JNTU Jobs : జేఎన్టీయూలో ప్రొఫెసర్ జాబ్స్... వివరాలు ఇవే..

బోధనా సిబ్బంది కొరతను తీర్చేందుకు జేఎన్‌టీయూహెచ్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. అందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇవే..

Amala Ravula | news18-telugu
Updated: March 17, 2019, 9:47 AM IST
JNTU Jobs : జేఎన్టీయూలో ప్రొఫెసర్ జాబ్స్... వివరాలు ఇవే..
ప్రతీకాత్మక చిత్రం
Amala Ravula | news18-telugu
Updated: March 17, 2019, 9:47 AM IST
గతంలో జరిగిన విశ్వవిద్యాలయ పాలకమండలి సమావేశంలో 32 మంది ప్రొఫెసర్ల నియామకానికి పచ్చజెండా ఊపిన జెఎన్టీయూహెచ్ అందుకు సంబంధించిన ప్రకటనను విడుదల చేసింది. ఈ నెల 11 నుంచి దరఖాస్తులను ఆన్‌లైన్‌లో స్వీకరించనున్నట్లు అధికారులు తెలిపారు. మార్చి 30వ సాయంత్రం 5 గంటల లోపు మాత్రమే దరఖాస్తులు స్వీకరణ ఉంటుంది.
ఈ ఉద్యోగాలు.. హైదరాబాద్‌లోనే కాకుండా వర్సిటీ అనుబంధ ప్రాంగణ కళాశాలలైన జగిత్యాల, మంథని, సుల్తాన్‌పూర్‌లోనూ భర్తీ చేయనుంది. ఇవే కాక త్వరలోనే మహాత్మాగాంధీ 10, పాలమూరు 12, శాతవాహన 9, తెలంగాణ 11, ఆర్జీయూకేటీ 25, కాకతీయలో 4 ఆచార్యుల పోస్టులను భర్తీ చేసేందుకు ప్రకటనలు వెలువడనున్నాయి. అసోసియేట్, అసిస్టెంట్ ప్రొఫెసర్ల పోస్టుల భర్తీకి కాస్తా సమయం పట్టే అవకాశముంది.
వివరాలు...

దరఖాస్తు విధానం : ఆన్‌లైన్
దరఖాస్తు ప్రారంభం : మార్చి 11, 2019
దరఖాస్తుకి చివరి తేదీ : మార్చి 30, 2019 సాయంత్రం 5లోపు మాత్రమే


ఉద్యోగం చేసే ప్రాంతాలు: హైదరాబాద్, జగిత్యాల, మంథని, సుల్తాన్‌పూర్
First published: March 17, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...