JEE Main: జేఈఈ మెయిన్ పరీక్షల తేదీలు విడుదల... మార్చి 20 నుంచి హాల్ టికెట్స్...

ఏప్రిల్ 7 నుంచి ఏప్రిల్ 12 వరకూ జేఈఈ మెయిన్ పరీక్షలు.... సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్‌ను దృష్టిలో ఉంచుకుని జేఈఈ మెయిన్ పరీక్షల నిర్వహణలో స్వల్ప మార్పులు....

Chinthakindhi.Ramu | news18-telugu
Updated: March 14, 2019, 10:04 PM IST
JEE Main: జేఈఈ మెయిన్ పరీక్షల తేదీలు విడుదల... మార్చి 20 నుంచి హాల్ టికెట్స్...
విద్యార్థులు (నమూనా చిత్రం)
Chinthakindhi.Ramu | news18-telugu
Updated: March 14, 2019, 10:04 PM IST
కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించిన లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ ప్రభావం జేఈఈ మెయిన్ పరీక్షపై పడింది. ఏప్రిల్ 7 నుంచి ఏప్రిల్ 12 వరకూ జేఈఈ మెయిన్ పరీక్షలు జరగనున్నాయి. పేపర్ 1 (బి.టెక్ ఎగ్జామ్) ఏప్రిల్ 8, 9, 10, 12 తేదీల్లో జరగనుంది. పేపర్ 2 (బీ. ఆర్క్ ఎగ్జామ్) ఏప్రిల్ 7న నిర్వహించనున్నారు. జేఈఈ అడ్మిట్ కార్డ్స్ (హాల్ టికెట్స్) మార్చి 20 నుంచి వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయి. ప్రతీ ఒక్క విద్యార్థి తమ పరీక్ష తేదీని, సమయాన్ని హాల్ టికెట్‌ ద్వారా తెలుసుకోవచ్చు. సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్‌ను దృష్టిలో ఉంచుకుని జేఈఈ మెయిన్ పరీక్షల నిర్వహణలో స్వల్ప మార్పులు చేసింది నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ, పరీక్ష నిర్వహణా విభాగం. జేఈఈ మెయిన్ దరఖాస్తు సవరణ మార్చి 14న ముగియనుంది. మార్చి 14 సాయంత్రం 5 గంటల వరకూ మాత్రమే విద్యార్థులకు దరఖాస్తులో ఉన్న తప్పులను సవరించుకునేందుకు అవకాశం ఉంది. ఆ తర్వాత సవరణలకు అవకాశం ఉండదు.

జేఈఈ మెయిన్ పేపర్ 1 పరీక్షా ఫలితం ఏప్రిల్ 30న విడుదల కానుంది. పేపర్ 2 పరీక్ష ఫలితం మే 15న విడుదలవుతుంది. జనవరిలో జేఈఈ మెయిన్ పరీక్ష రాసినవారు కూడా ఈ పరీక్ష రాయాల్సి ఉంటుంది. రెండింట్లో ఉత్తమ మార్కులు సాధించిన వారికి అడ్మిషన్స్ తేలిగ్గా దొరుకుతాయి. NIT, IIIT లాంటి ప్రముఖ ఇంజనీరింగ్ కళాశాలతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలచే నిర్వహించబడుతున్న కాలేజీల్లో సీటు సాధించేందుకు ఈ పరీక్షలో ఉత్తీర్ణత సాధించడం ఎంతో కీలకం. జేఈఈ స్కోరుతో పాటు ఇంటర్, 12వ తరగతిలో సాధించిన మార్కులు కూడా అడ్మిషన్ ప్రక్రియలో ప్రధాన పాత్ర పోషిస్తాయి.

దరఖాస్తులో తప్పులు సవరించుకునేందుకు, హాల్ టికెట్స్ డౌన్‌లోడ్ చేసుకునేందుకు JEE అధికారిక వెబ్‌సైట్: https://jeemain.nic.in/webinfo/Public/Home.aspx

First published: March 14, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు