JEE ADVANCED 2019 : జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష తేదీలో మార్పు.. మే 27న ఎగ్జామ్..

జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష తేదీలో మార్పులు చేశారు అధికారులు. మే 19న నిర్వహించాల్సిన పరీక్ష తేదీని మారుస్తూ ప్రకటన చేశారు.

news18-telugu
Updated: March 19, 2019, 5:14 PM IST
JEE ADVANCED 2019 : జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష తేదీలో మార్పు.. మే 27న ఎగ్జామ్..
విద్యార్థులు (నమూనా చిత్రం)
news18-telugu
Updated: March 19, 2019, 5:14 PM IST
లోక్‌సభ ఎన్నికల సందర్భంగా ఈ సంవత్సరం మే 19న జరగాల్సిన జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష తేదీని మార్చారు అధికారులు. మే 27న పరీక్ష నిర్వహించనున్నట్లు జేఈఈ అడ్వాన్స్‌డ్ ఆర్గనైజింగ్ ఇనిస్టిట్యూట్ ఐఐటీ అధికారులు తెలిపారు. మే 19న 8 రాష్ట్రాల్లోని 59 నియోజకవర్గాలకు పోలింగ్ జరుగుతోంది. దీంతో స్టూడెంట్స్ ఎలాంటి ఇబ్బంది కలగకుండా అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు.
పరీక్ష నిర్వహణ కోసం అధికారులు అన్నీ ఏర్పాట్లు చేశారు. మే 27 సోమవారం పరీక్ష జరుగనుందని, ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు పేపర్ 1, మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు పేపర్ 2 పరీక్ష ఉంటుంది. విద్యార్థులు 30 నిమిషాల ముందుగానే ఎగ్జామ్ సెంటర్‌కి చేరుకోవాలని సూచిస్తున్నారు. దేశవ్యాప్తంగా 2.24 లక్షల మంది హాజరవుతున్న ఈ పరీక్ష కోసం అధికారులు అన్నీ ఏర్పాట్లు చేశారు.
అదేవిధంగా జేఈఈ మెయిన్ రెండో విడత ఏప్రిల్ 6 నుంచి 20వ తేదీ మధ్య నిర్వహిస్తున్నట్లు జాతీయ పరీక్షల సంస్థ ప్రకటించింది. మధ్యలో నాలుగు లేదా అయిదు రోజుల పాటు ఆన్‌లైన్ పరీక్షలు జరుగుతాయి.

First published: March 19, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...