టెక్నాలజీ పెరిగిపోతున్నకొద్దీ శారీరక శ్రమ తగ్గిపోయింది. కాలుష్యం పెరిగిపోయింది. ఆహారపు అలవాట్లు మారిపోయాయి. పని ఒత్తిడీ పెరిగిపోయింది. వేళకు తినడం లేదు. ఇక చాలా మంది తమ కళ్ల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం లేదు. ఫలితంగా కంటి సమస్యలు(Eye problems) వస్తున్నాయి. కళ్ల నొప్పులు రావడం, దురదలు పెట్టడం, కంటి చూపు(eye site) సరిగ్గా లేకపోవడం.. వంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఇందుకు అస్తవ్యస్తమైన జీవన విధానం, ఆహారపు అలవాట్లు, ఎక్కువ సమయం పాటు స్క్రీన్లను(screens) చూడటం. వంటివి కారణమవుతున్నాయి. ఈ క్రమంలోనే కంటి చూపు మందగిస్తోంది కూడా. ఎక్కువ సమయం పాటు ఫోన్లు, కంప్యూటర్లు, టీవీల ఎదుట గడుపుతున్నారు. దీంతో కంటి సమస్యలు(eye problems) వస్తున్నాయి. అయితే కంటి సమస్యలు తగ్గడంతో పాటు కంటి చూపు మెరుగు పడాలంటే మంచి ఆహారం తీసుకోవాలి. దీంతో కళ్లను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు.
క్యారట్ జ్యూస్..
ప్రస్తుత తరుణంలో చాలా మంది చిన్న వయస్సులోనే కంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు. చాలా మందికి దృష్టి తగ్గుతోంది. కంటి చూపు మందగిస్తోంది. దీంతో చిన్న వయస్సులోనే అద్దాలను వాడాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే కింద తెలిపిన ఆహారాలను(food) తీసుకోవడం వల్ల కళ్లను సురక్షితంగా ఉంచుకోవచ్చు. అయితే క్యారెట్ల వినియోగం కళ్లకు ఎంతగానో మేలు చేస్తుంది. రోజువారీ ఆహారంలో క్యారెట్లను చేర్చడం ద్వారా కంటి చూపు మెరుగుపడుతుంది. క్యారెట్ జ్యూస్(Carrot juice) తాగడం వల్ల కంటి చూపు ఎక్కువ కాలం పాటు చెదిరిపోకుండా ఉంటుంది. రోజ్ వాటర్ కంటి సంబంధిత సమస్యలకు చికిత్స చేయడానికి ఉపయోగపడుతుంది.
పాలకూరలో విటమిన్లు ఎ, సి, కె, మెగ్నిషియం, మాంగనీస్, ఐరన్లు సమృద్ధిగా ఉంటాయి. అందువల్ల కళ్లను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. కంటి చూపు మెరుగు పడుతుంది. రోజూ పాలకూరు జ్యూస్‌ను తాగుతున్నా కళ్లు ఆరోగ్యంగా ఉంటాయి.
మెదడుతో పాటు కళ్లకు కూడా బాదం(almonds) పప్పులు ఎంతగానో మేలు చేస్తాయి. ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు వీటిలో ఉంటాయి. విటమిన్ ఇ కూడా ఉంటుంది. ఇది కళ్లకి చాలా ముఖ్యం. రోజూ 8-10 ఎండుద్రాక్షలను లేదా 4 నుండి 5 బాదంపప్పులను నీటిలో నానబెట్టి ఉదయం నిద్రలేవగానే ఖాళీ కడుపుతో తినాలి. ఇవి కళ్లకు రక్షణను అందిస్తాయి. కంటి చూపును మెరుగు పరుస్తాయి.
రోజ్ వాటర్(Rose water)లోని యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కండ్లకలక లేదా పింక్ ఐ, వాపు నుండి బయటపడటానికి సహాయపడతాయి. రోజ్ వాటర్‌లో శుభ్రమైన పత్తిని ముంచి మూసిన కనురెప్పలపై మెత్తగా రుద్దవచ్చు. దీంతో కళ్లు ఆరోగ్యంగా ఉంటాయి.
తేనె(honey) మన శరీరానికి అద్భుతమైన ఔషధంగా పనిచేస్తుంది. కంటి చూపును మెరుగుపరచడానికి, కంటి శ్రేయస్సు కోసం ఒక టీస్పూన్ తేనెతో తాజా ఉసిరి కాయ జ్యూస్‌ను రోజూ తీసుకోవాలి. ఉదయం నిద్ర లేచిన వెంటనే దీనిని తీసుకోవాలి. ఇది కంటికి మేలు చేస్తుంది. తాజా ఉసిరి లభించకపోతే ఉసిరిక పొడిని కూడా ఉపయోగించవచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Almonds Health Benefits, Food, Health Tips, Honey, Life Style