Home /News /life-style /

IT IS ENOUGH TO GROW THIS SINGLE PLANT IN YOUR HOUSE AND NO ONE IN THE HOUSE WILL GET DISEASES PRV

Health tips: ఈ ఒక్క మొక్క మీ ఇంట్లో పెంచుకుంటే చాలు.. ఇక ఇంటిల్లిపాదికి రోగాలు దరిచేరవు.. ఆ మొక్క ఏంటంటే?

వాము (అజ్వైన్​)

వాము (అజ్వైన్​)

ప్రతి ఇంటి పెరట్లో కచ్చితంగా ఉండవలసిన మొక్కలలో వాము ఒకటి. ఈ మొక్కలోని అన్ని భాగాలకు ఘాటైన వాసన(smell) ఉండటం వల్ల సంస్కృతంలో దీన్ని ‘ఉగ్రగంధ’ అంటారు. వాములో పీచు, ఖనిజ లవణాలు, విటమిన్లు(Vitamins), యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. దీన్ని పచ్చిగా, వేయించి కూడా వాడుకోవచ్ఛు నీటిలో కలుపుకొని తాగొచ్ఛు తేనీటిలో వేసుకొని తాగొచ్ఛు జలుబు, జీర్ణ సంబంధ సమస్యలు ఇట్టే దూరమవుతాయి.

ఇంకా చదవండి ...
  రుచికి, శుచికి, ఆరోగ్యానికి వాము (Ajwain) పెట్టింది పేరు. ప్రతి ఇంట్లో ఉండాల్సిన వస్తువు వాము గింజలు అయితే.. ప్రతి ఇంటి పెరట్లో కచ్చితంగా ఉండవలసిన మొక్కలలో వాము ఒకటి. ఈ మొక్కలోని అన్ని భాగాలకు ఘాటైన వాసన(smell) ఉండటం వల్ల సంస్కృతంలో దీన్ని ‘ఉగ్రగంధ’ అంటారు. వాములో పీచు, ఖనిజ లవణాలు, విటమిన్లు(Vitamins), యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. దీన్ని పచ్చిగా, వేయించి కూడా వాడుకోవచ్ఛు నీటిలో కలుపుకొని తాగొచ్ఛు తేనీటిలో వేసుకొని తాగొచ్ఛు జలుబు, జీర్ణ సంబంధ సమస్యలు ఇట్టే దూరమవుతాయి. వాము మొక్కలను పెరట్లో లేదా తొట్టెల్లో పెంచుకుని తాజా ఆకులను వివిధ వంటకాల్లో వాడుకోవచ్చు. పిల్లలు ఉన్నవారు ఈ వాము మొక్కలు పెంచుకోవడంతో ఎన్నో సమస్యల నుంచి ఈజీగా బయటపడతారు.  వాము ఆకు ఇచ్చే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం..

  విటమిన్స్​, ప్రోటీన్స్​లకు నిలయం..

  వాము గింజలను వంటకాల(cooking's)తో పాటు పలురకాల పానీయాలు తయారీ కోసం ఉపయోగిస్తారు. వాము చక్కని సువాసనను అందిస్తుంది. వాములోని యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్స్, ప్రోటీన్స్ వంటి ఖనిజాలు శరీర ఆరోగ్యానికి ఎంతో మేలు(health benefits) చేస్తాయి. వాము ఆకు అప్పుడప్పుడు వాడితే ఆరోగ్యానికి చాలా మంచిదని ఆయుర్వేదం (Ayurveda) చెబుతోంది.

  వాము కొవ్వును కరిగించి, బరువు తగ్గడం(weight loss)లో ఉపయోగపడుతుంది. వెంట్రుకలు తెల్లబడకుండా చేసే శక్తి వాముకుంది. గుండెపోటుకు కారణమయ్యే కొలెస్ట్రాల్‌ స్థాయులను తగ్గిస్తుంది. రక్తపోటును, అధిక ఒత్తిడిని తగ్గిస్తుంది. వాములో కాస్త ఆవనూనె వేసి ఇంట్లో ఒక మూలన ఉంచితే దోమలు దరిచేరవు. చిన్న పిల్లలకు అజీర్తితో కడుపునొప్పి(stomach pain)కి వాము ఆకు మంచి ఔషధం. వాము ఆకు రసంలో తేనె కలిపి చిన్న పిల్లలకు ఇస్తే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఇక తరచుగా చిన్న పిల్లలు దగ్గు, జలుబు, ఇన్ఫెక్షన్స్ వంటివి వాటితో ఇబ్బంది పడుతుంటే.. వాము ఆకు నీరు మంచి మెడిసిన్. కాలిన గాయాలు, మచ్చలను వాము తగ్గిస్తుంది. దీనిలో యాంటీ సెప్టిక్ గుణాలు గాయాలను తగ్గించడానికి ఉపయోగపడుతుంది. వాము ఆకులతో చేసిన పకోడీలు తినడం వల్ల అజీర్తి సమస్య తగ్గుతుంది. నీళ్లలో కాస్త వాము వేసుకుని తాగితే జీర్ణశక్తి పెరుగుతుంది.

  ఎలా పెంచాలి..

  వాములో ఉండే యాంటీ బయోటిక్‌, అనస్తిటిక్‌ విలువల వల్ల కాళ్ల నొప్పులు తగ్గుతాయని ఆయుర్వేదం చెబుతుంది. చిన్న పిల్లలకు గ్యాస్‌, అజీర్తి తగ్గించే సిరప్‌లలో వాము నీటిని ఎక్కువగా వాడతారు. వామును విత్తనాల ద్వారా పెంచుకోవచ్చు. కంపోస్టు, కొబ్బరి పీచు మిశ్రమాన్ని ట్రేలో గానీ, సిమెంట్‌ తొట్టెలో గానీ నింపి అందులో పైపైన వాము గింజలు చల్లాలి. ఆ తర్వాత పైన పల్చగా మట్టిని వేయాలి. నీడ ప్రదేశంలో ఉంచి ఉదయం, సాయంత్రం నీటిని తుంపరలుగా చల్లాలి. వారం నుంచి రెండు వారాల్లో మొలకెత్తుతాయి. సూర్యరశ్మి ఎక్కువగా అవసరం లేదు. కొద్దిగా ఎండపడే ప్రాంతంలో ఉండేలా చూసుకోవాలి. ఆకులు ఎండిపోతే తెంపి పారేయాలి. పురుగులు పడితే వేపనూనె పిచికారీ చేయాలి. తొట్టిలోని మట్టి తడారకుండా చూసుకోవాలి

  ఇది కూడా చదవండి: జలుబు, దగ్గు తగ్గాలంటే మీరు రోజూ కూరల్లో వాడే ఈ పదార్థం తీసుకోండి.. అదేంటంటే
  Published by:Prabhakar Vaddi
  First published:

  Tags: Health Tips, Life Style, Tree plantation

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు