హోమ్ /వార్తలు /లైఫ్ స్టైల్ /

Hair fall Treatment: జుట్టు రాలిపోవడం ఆగాలంటే ఈ ఆహార పదార్థాలకు దూరంగా ఉండే బెటర్​..

Hair fall Treatment: జుట్టు రాలిపోవడం ఆగాలంటే ఈ ఆహార పదార్థాలకు దూరంగా ఉండే బెటర్​..

బియ్యం నీళ్ల (Rice water)ను రాత్రంతా అలాగే ఉంచి ఉదయాన్నే కురులకు పట్టించాలి. అరగంట తర్వాత నీళ్లతో శుభ్రంగా కడుక్కుంటే శిరోజాలు (hairs) నల్లగా నిగ నిగ లాడతాయి. బియ్యం కడిగిన నీళ్లతో మర్దనా చేసుకుంటే మాడు ఆరోగ్యంగా ఉంటుంది.

బియ్యం నీళ్ల (Rice water)ను రాత్రంతా అలాగే ఉంచి ఉదయాన్నే కురులకు పట్టించాలి. అరగంట తర్వాత నీళ్లతో శుభ్రంగా కడుక్కుంటే శిరోజాలు (hairs) నల్లగా నిగ నిగ లాడతాయి. బియ్యం కడిగిన నీళ్లతో మర్దనా చేసుకుంటే మాడు ఆరోగ్యంగా ఉంటుంది.

మహిళలు జుట్టు రాలడం (hair fall) భరించలేరు. ఇక పురుషుల్లో అయితే అనేక కారణాల వల్ల నేడు చిన్నాపెద్దా అనే తేడా లేకుండా బట్టతల అనే సమస్యను ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యను అధిగమించడానికి చాలామంది రకరకాల షాంపూలు, హెయిర్‌మాస్క్‌లు ట్రై చేస్తుంటారు. అయినా ఏం లాభం ఉండదు. ఈ సమస్య పరిష్కారానికి మూలం ఎక్కడుందో తెలుసుకోవాలి. ఆహారపు అలవాట్లు (food habits) సరిచేసుకోవాలి.

ఇంకా చదవండి ...

జుట్టు అందరికీ అందాన్ని ఇస్తుంది. ముఖ్యంగా మహిళలు (women) కేశాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. అయితే ఇటీవల కాలంలో అనేక మందికి ఎదురవుతున్న సమస్య జుట్టు రాలడం. మహిళలు జుట్టు రాలడం (hair fall) భరించలేరు. ఇక పురుషుల్లో అయితే అనేక కారణాల వల్ల నేడు చిన్నాపెద్దా అనే తేడా లేకుండా బట్టతల అనే సమస్యను ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యను అధిగమించడానికి చాలామంది రకరకాల షాంపూలు, హెయిర్‌మాస్క్‌లు ట్రై చేస్తుంటారు. అయినా ఏం లాభం ఉండదు. ఈ సమస్య పరిష్కారానికి మూలం ఎక్కడుందో తెలుసుకోవాలి. ఆహారపు అలవాట్లు (food habits) సరిచేసుకోవాలి. జన్యుపరమైన అంశాలు, చర్మ సమస్యల, మానసిక ఇబ్బందులు ఏమైనా ఉన్నాయో గమనించుకోవాలి. వాటిని అధిగమించేలా చూసుకోవాలి. మనం తీసుకునే ఆహారం (food) వల్ల మనకు అందం(beauty), ఆరోగ్యం రెండూ వస్తాయి. చర్మ సౌందర్యం, జుట్టుకు అవసరమైన పోషకాలను అందించేది ఆహారం. అయితే మీ జుట్టు అకస్మాత్తుగా రాలితే మీరు తినే ఆహారంలో కొన్ని పోషకాలు లేకపోవడమే కారణం. కొన్ని ఆహార పదార్థాలకు దూరంగా (distance) ఉంటే మంచిది. అవేంటో చూద్దాం..

జంక్ ఫుడ్​ వద్దు..

జంక్ ఫుడ్ (junk food) లో ఉన్న శాచురేటెడ్ వంటి రకాల పేర్లతో ఊబకాయం రావడమే కాదు, గుండె జబ్బులు వంటి ఆరోగ్య సమస్యలకు కూడా కారణం అవుతుంది. ఇందులో భాగంగానే జుట్టు కూడా ఊడిపోతుంది. నూనెలు ఎక్కువగా ఉన్న పదార్థాలు రోజు తినడం  వల్ల కూడా మీ జుట్టు రాలడం తారస్థాయికి చేరుతుంది.

చేపలతో జాగ్రత్త..

చేపల్లో అత్యధికంగా ఉన్న పాదరసం నిల్వల కారణంగా చేపలు (fish) ఎక్కువగా తినేవారిలో కొందరికి ఉన్నట్టుండి జుట్టు ఊడిపోతుంది. కానీ కొన్ని చేపల వల్ల వెంట్రుకలు (hairs) బాగా పెరుగుతాయి. కానీ మీరు ఎలాంటి చేపలు తింటారు అనే దానిపై ఆధారపడి ఉంటుంది. మీకు జుట్టు రాలడం ప్రారంభం అయితే చక్కెర (sugar)ను బాగా తగ్గించండి. కుదిరితే చక్కెరను తీసుకోవడం మానేయండి.

అధిక గ్లైసెమిక్  కలిగిన ఆహార పదార్థాలు ఎక్కువగా తీసుకోవడం వల్ల జుట్టు రాలడానికి ప్రధాన కారణం అని చెప్పవచ్చు. శుద్ధ పిండి, రొట్టె మరియు చక్కెర చాలా ఎక్కువ గ్లైసెమిక్ సూచిక ను కలిగి ఉంటుంది. ఇలాంటి వాటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల జుట్టు రాలడానికి కారణమవుతాయి. ఆల్కహాల్ (Alcohol) జుట్టుకు చాలా ప్రమాదకరం. ఆల్కహాల్ ప్రొటీన్లను బలహీన పరుస్తుంది. దీంతో జుట్టు అధికంగా రాలిపోవడం జరుగుతుంది.

అయితే జుట్టు ఒత్తుగా పెరగడానికి ముఖ్యంగా తినే ఆహారంలో ఐరన్ (Iron) ఉండేలా జాగ్రత్త తీసుకోవాలి. సాధారణంగా 18 గ్రాముల ఐరన్, పురుషులకి 8 గ్రాముల ఐరన్ అవసరం. మాంసాహారంలో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. అదే వెజిటేరియన్స్ అయితే..చిక్కుళ్లు, పొద్దుతిరుగుడు గింజలు, పాలు, పాల పదార్థాలు డ్రైఫ్రూట్స్ తీసుకోవాలి. దీనివల్ల వెంట్రుకలు ఊడటం తగ్గి బలంగా పెరుగుతాయి.

First published:

ఉత్తమ కథలు