Weight loss: మీరు అధిక బరువును తగ్గించుకోవాలంటే ఈ పండ్లను తీసుకుంటే ఉత్తమం.. అవి ఏంటంటే?

ప్రతీకాత్మక చిత్రం

అధిక బరువు (heavy weight). చాలామందికి నిద్ర కూడా పట్టనివ్వదు. వేగంగా పరిగెత్తలేరు. కూర్చొంటే లేవలేరు. ఎక్కువగా తిరగలేరు. వ్యాయామాలు (Exercise) చేయడం ఇబ్బందిగానే ఉంటుంది. మరోవైపు భారీ శరీరం (heavy body) ఉండటంతో కడుపు (stomach) కట్టుకోలేరు. అయితే కొన్ని రకాల పండ్లు తింటే బరువును అదుపులో పెట్టుకోవచ్చు.

  • Share this:
    అధిక బరువు (heavy weight). చాలామందికి నిద్ర కూడా పట్టనివ్వదు. వేగంగా పరిగెత్తలేరు. కూర్చొంటే లేవలేరు. ఎక్కువగా తిరగలేరు. వ్యాయామాలు (Exercise) చేయడం ఇబ్బందిగానే ఉంటుంది. మరోవైపు భారీ శరీరం (heavy body) ఉండటంతో కడుపు (stomach) కట్టుకోలేరు. ఏదో ఒకటి తినాల్సిందే (should eat). లేకపోతే శరీరం సహకరించదు. సమాజంలో అందరి శరీరాకృతి చూసి మానసికంగా ఒత్తిడి (stress)కి లోనవుతుంటారు. బరువు ఎక్కువుంటే కొన్ని రకాల సమస్యలు కూడా వస్తాయి. బరువు తగ్గడానికి అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంటారు.  అయినా బరువు తగ్గకపోగా ఇతర సమస్యలు (side effects) కూడా వస్తుంటాయి. ఆరోగ్యకరమైన  ఆహారం (healthy food) తీసుకోవడం వల్ల బరువు తగ్గడం (weight loss) సులువు అవుతుంది. అలాగే మంచి పోషకాలు ఉన్న ఆహారాన్ని తీసుకోవడం వల్ల బరువు (weight) తగ్గుతారు. ముఖ్యంగా పండ్లు తీసుకుంటే బరువును అదుపులో పెట్టుకోవచ్చు.

    పండ్లను తీసుకోండి..

    ఎక్కువగా పండ్లు తీసుకోవడం వల్ల బరువు (weight)ను అదుపులో పెట్టుకోవచ్చు. ఇందులో శరీరానికి కావాల్సిన పోషకాలు పుష్కలంగా అందుతాయి. అంతేకాకుండా  తక్కువ క్యాలరీస్ (calories) ను అందిస్తాయి. ద్రాక్ష పండ్లు (grapes), బ్లూ బెర్రీస్, స్ట్రాబెర్రీస్, ఆపిల్ (apple), దానిమ్మ వంటి పండ్లు బరువు తగ్గించడం  (weight loss)లో సహాయపడతాయంట.

    పాలు, పెరుగులో తృణ ధాన్యాలు..

    తృణ ధాన్యాలను తీసుకుంటే బరువు తగ్గించుకోవచ్చు. ఆరోగ్యంగానూ ఉంటారంట. ఇవి ఎనర్జీ లెవెల్స్ ను పెంచుతాయి. తృణ  ధాన్యాలను పెరుగు, పాలల్లో (milk) కలిపి తినడం వల్ల మంచి ఫలితాలు వస్తాయంటున్నారు నిపుణులు. పాలలో తక్కువ ఫ్యాట్ కలిగి ఉంటుంది. పోషకాలు కూడా ఉంటాయి.

    చేపలు (fish) తినడం వల్ల బరువు తగ్గడమే కాకుండా ఆరోగ్యం (health) కూడా బాగా ఉంటుంది. సాల్మన్​ చేపలు వీటికి మేలు.

    దీనిలో ఒమేగా 3 ఫ్యాటి ఆసిడ్లు కలిగి ఉంటాయి. ఇవి శరీరాన్ని ఇన్సులిన్  విషయంలో ఎక్కువ  సున్నితంగా ఉండేలా పనిచేస్తాయి. అంతేకాకుండా నడుము చుట్టూ పేరుకుపోయిన కొవ్వును  కరిగించడంలో సాల్మన్ చేపలు ప్రముఖ పాత్ర వహిస్తాయి.

    బరువు తగ్గడానికి ఓట్ మీల్స్ మంచి ఆహారం (food). ఓట్ మీల్ తినడం వల్ల ఆరోగ్యకరమైన స్నాక్స్ (snacks) కి దూరంగా ఉండేలా చేస్తుంది..

    తోటకూర ను ఉపయోగించడం వల్ల అధిక బరువు (heavy weight) తగ్గుతారు. ఎందుకంటే ఇందులో నీటి శాతం ఎక్కువగాను, తక్కువ కేలరీలు కలిగి ఉంటుంది. టమోటా, క్యారెట్, దోసకాయ వంటి వెజిటబుల్ సలాడ్ (salad) శరీరానికి కావాల్సిన ఫైబర్ ను అందిస్తాయి. అంతేకాకుండా కార్బోహైడ్రేట్ ను అందించి బరువు తగ్గడంలో సహాయపడతాయి. ఇలాంటి ఆహారం మీ రోజువారి డైట్​లో ఉండేలా చూసుకుంటే మీ బరువును అదుపులో పెట్టుకోవచ్చు.
    Published by:Prabhakar Vaddi
    First published: