వారానికోసారి శృంగారం వల్ల ఆరోగ్యం.. ఆ రోగం ఉన్నవారికి సంజీవనిలా..

Sex Education : గుండె సంబంధిత వ్యాధులతో బాధపడే వారు వారానికోసారి సెక్స్‌లో పాల్గొంటే మరణం సంభవించే రేటు 37 శాతం తగ్గుతుందని టెల్ అవీవ్ యూనివర్సిటీ, షార్ జెడెక్ మెడికల్ సెంటర్ శాస్త్రవేత్తలు తెలిపారు.

news18-telugu
Updated: August 7, 2019, 2:30 PM IST
వారానికోసారి శృంగారం వల్ల ఆరోగ్యం.. ఆ రోగం ఉన్నవారికి సంజీవనిలా..
ప్రతీకాత్మక చిత్రం
news18-telugu
Updated: August 7, 2019, 2:30 PM IST
శృంగారం వల్ల శారీరక, మానసిక ఉల్లాసం కలుగుతుంది. ఒంట్లో కొవ్వు కరగడమే కాకుండా, జ్ఞాపకశక్తి పెరుగుతుంది. మలి వయసులోనూ శృంగారాన్ని ఆస్వాదిస్తే మతిమరుపు దరికి చేరదని గతంలోనే శాస్త్రవేత్తలు తేల్చారు. సెక్స్ అనేది ఒత్తిడిని తరిమికొడుతుంది. తాజాగా, మరో వ్యాధి నుంచి ఇది దూరం చేస్తుందని పరిశోధకులు గుర్తించారు. గుండె సంబంధిత వ్యాధులతో బాధపడే వారు వారానికోసారి సెక్స్‌లో పాల్గొంటే మరణం సంభవించే రేటు 37 శాతం తగ్గుతుందని టెల్ అవీవ్ యూనివర్సిటీ, షార్ జెడెక్ మెడికల్ సెంటర్ శాస్త్రవేత్తలు తెలిపారు. హృద్రోగులు క్రమం తప్పకుండా వారానికి ఒకసారి సెక్స్ చేస్తే చాలా మంచిదని దీర్ఘకాలం పాటు జీవిస్తారని వెల్లడించారు.

65 ఏళ్లలోపు ఉన్న 1120 మంది వ్యాధిగ్రస్తులను పరీక్షించగా, అందులో వారానికోసారి క్రమం తప్పకుండా సెక్స్ చేసిన వారిలో 37 శాతం మరణం సంభవించే రేటు తగ్గిందట. అంతకంటే ఎక్కువ సార్లు సెక్స్ చేసిన వారిలో 33 శాతం, వారానికి ఒక సారి లేదా అంతకంటే ఎక్కువ రోజుల వ్యవధిలో సెక్స్ చేసే వారిలో 28 శాతం మరణం సంభవించే రేటు తగ్గిందని పరిశోధకులు వెల్లడించారు.

First published: August 7, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...