Home /News /life-style /

Beauty tips: మీ జుట్టు చిక్కులు చిక్కులుగా ఉందా? అయితే కోడిగుడ్లతోనూ మీ జుట్టును అందంగా చేసుకోవచ్చు.. ఎలా అంటే..

Beauty tips: మీ జుట్టు చిక్కులు చిక్కులుగా ఉందా? అయితే కోడిగుడ్లతోనూ మీ జుట్టును అందంగా చేసుకోవచ్చు.. ఎలా అంటే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

చాలామంది ఫ్యాషన్ పేరుతో తలకు నూనె అప్లై చేయరు. దానివలన తలలో చర్మం పొడిబారి చుండ్రు, జుట్టు రాలే సమస్యలు వస్తాయి. అందుకే వారానికి రెండు సార్లయినా నూనె అప్లై చేయాలి.  జుట్టుని కాపాడుకోవచ్చు. కోడిగుడ్ల (eggs) తో జుట్టును అందంగా మార్చుకోవచ్చు. ఆ పద్దతి ఒకసారి తెలుసుకుందాం..

ఇంకా చదవండి ...
    మనిషి అందాన్ని వారి కేశాల (hair)ను బట్టి కూడా అంచనా వేస్తున్నారు. చాలామందికి వారి ఆహారపు అలవాట్లు, జీన్స్​ వల్ల జుట్టు పెరగకపోవడం, ఉన్న జుట్టు ఊడిపోవడం(fall) జరుగుతుంది. జుట్టు రాలిపోతుంటే (hair fall) విలవిలలాడిపోతూ ఉంటారు చాలా మంది. అయితే నల్లని ఒత్తైన జుట్టు (black hair) ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. కానీ ఇప్పటి ఆరోగ్య పరిస్థితులు (health issues) వలన జుట్టు రాలే (hair fall) సమస్యను ఎదుర్కొంటున్నారు. అంతేకాకుండా ఉద్యోగపరమైన ఒత్తిడి, మానసిక ఆందోళనలు వలన తెల్లజుట్టు చిన్న వయసులోనే త్వరగా వచ్చేస్తుంది. వీటిని నివారించుకోవడానికి మార్కెట్లో దొరికే ప్రోడక్ట్స్ కంటే ఇంట్లో దొరికి పదార్థాలతో తయారు చేసుకున్న చిట్కాలు (beauty tips) మంచి ఫలితాలను ఇస్తాయి.

    ప్రతివారం నూనె (oil)తో తలస్నానం చేయడం వల్ల అందమైన జుట్టు (beautiful hair) అందరికీ ఉండేది. కానీ ఇప్పటి కాలుష్యం (pollution), షాంపూలు (shampoos), హెయిర్ ప్రొడక్ట్స్ పూర్తిగా రసాయనాలకు అలవాటు పడిపోయారు. ఇవి జుట్టుకు ఎంతో నష్టం చేస్తున్నాయి.  కోడిగుడ్ల (eggs) తో జుట్టును అందం (beautiful)గా మార్చుకోవచ్చు. ఆ పద్దతి ఒకసారి తెలుసుకుందాం..

    రెండు కోడిగుడ్లు (eggs)ని అలాగే మూడు టేబుల్ స్పూన్ల ఆలివ్ ఆయిల్ (olive oil) ను తీసుకుని అందులో కోడిగుడ్లు పగులగొట్టి ఒక బౌల్ లో పోసుకోవాలి.ఇక అలా ఆ బౌల్ లో పోసిన కోడిగుడ్ల సొన ఇంకా లోపలి పదార్థానికి ఆలివ్ ఆయిల్ (olive oil) ను కలపాలి.ఇక ఆ తరువాత ఈ రెండు పదార్థాలు బాగా కలిసే వరకు బాగా షేక్ (shake) చేయాలి. ఇలా బాగా కలిపిన ఆ మిశ్రమాన్ని (mixer) తీసుకొని మీ జుట్టుకు అప్లై చేసుకోవాలి.

    ఆ మిశ్రమం బాగా మిక్స్ అయిన తర్వాత మాత్రమే తలకి అప్లై (apply for hair) చేయాలి. మిశ్రమం బాగా మిక్స్ అవ్వక ముందు జుట్టుకు అప్లై చేయడం అంత మంచిది కాదు. ఇలా ఆలివ్ ఆయిల్ ఇంకా కోడిగుడ్ల (eggs) మిశ్రమాన్ని మీ జుట్టుకు అప్లై చేసి దాదాపు ఒక గంట సేపు పాటు జుట్టును అలాగే ఉంచుకోవాలి. ఇలా ఒక గంట సేపు ఆ మిశ్రమాన్ని జుట్టుకే ఉంచుకోవడం వలన ఆ మిశ్రమం అనేది పూర్తిగా జుట్టుకు పడుతుంది. ఇక ఒక గంట సేపు గడిచిన తర్వాత జుట్టుకు అప్లై చేసిన ఆ మిశ్రమాన్ని చల్లటి నీటితో కడగాలి. ఇక అలాగే సల్ఫేట్ లేని షాంపూతో జుట్టును బాగా శుభ్రంగా కడుక్కోవాలి. ఇక కోడిగుడ్లు (eggs) ఇంకా ఆలివ్ ఆయిల్ మిశ్రమాన్ని మీ జుట్టుకు అప్లై చేయడం వలన జుట్టు చాలా స్మూత్ గా ఎలా తయారవుతుంది.

    (Disclaimer: The information and information provided in this article is based on general information. Telugu News 18 does not confirm these. Please contact the relevant expert before implementing them.)

    ఇది కూడా చదవండి:

    వర్షంలో తడిచాక మీ జుట్టు పాడైపోతుంది కదా? ఈ చిట్కాలతో మీ జుట్టును కాపాడుకోండి..

    Published by:Prabhakar Vaddi
    First published:

    Tags: Beauty tips, Hair fall, Hair Loss, Life Style

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు