IS YOUR FACE TOO GREASY OILY THEN IT IS BETTER TO USE A FACE PACK MADE WITH PEANUTS DAL PRV
Beauty tips: మీ ముఖం మరీ జిడ్డుగా ఉందా? అయితే ఈ శనగపప్పుతో చేసే ఫేస్‌ప్యాక్ వాడితే బెటర్
ప్రతీకాత్మక చిత్రం
జిడ్డుగల చర్మం(skin) ఉన్నవారు బయట నుంచి ఇంటికి వచ్చినప్పుడు ముఖాన్ని ఫేస్ వాష్(face wash) తో తప్పనిసరిగా శుభ్ర పరుస్తారు. అందంగా మారాలని అందరికీ ఉంటుంది. దీనికోసం ఎంతో ఖర్చు పెడతారు. ఖరీదైన క్రీమ్స్ వాడతారు. ఎన్నెన్నో టిప్స్ వాడతారు. ఇలాంటి వాటి కంటే కొన్ని ఇంటి చిట్కాలు వాడటం వల్ల ఎంతో అందంగా తయారవ్వొచ్చు.
అందం (Beauty) ప్రతీ ఒక్కరూ కోరుకునేదే. అయితే వాతావరణ పరిస్థితులు, కలుషితమైన గాలి కారణంగా ముఖంతో తేజస్సు తగ్గిపోతుంది. మొటిమలు (pimples) తయారవుతాయి. ఇక వేళకు తినకుండా .. ఒత్తిడికి లోనయ్యేవారికి నల్లటి వలయాలు (dark circles) కంటి చుట్టూ ఏర్పడతాయి. మనం తినే ఆహారం కూడా మన అందంపై ప్రభావం చూపుతుంది. అందుకే వైద్యులు సరైన పోషక ఆహారం తీసుకోవాలని సూచిస్తారు. అయితే కొంతమంది ఎంత ప్రయత్నించినా, ఎన్ని క్రీములు, ఫేస్ ప్యాక్‌లు వాడినా తమ చర్మం(skin) జిడ్డు(oily)గా ఉంటుందని బాధపడుతుంటారు. అలాంటివారు కొన్నిచిట్కాలు (tips) పాటిస్తే ముఖం(face) కాంతివంతగా మారుతుంది. జిడ్డుగల చర్మం(skin) ఉన్నవారు బయట నుంచి ఇంటికి వచ్చినప్పుడు ముఖాన్ని ఫేస్ వాష్(face wash) తో తప్పనిసరిగా శుభ్ర పరుస్తారు. అందంగా మారాలని అందరికీ ఉంటుంది. దీనికోసం ఎంతో ఖర్చు పెడతారు. ఖరీదైన క్రీమ్స్ వాడతారు. ఎన్నెన్నో టిప్స్ వాడతారు. ఇలాంటి వాటి కంటే కొన్ని ఇంటి చిట్కాలు వాడటం వల్ల ఎంతో అందంగా తయారవ్వొచ్చు.
రసాయనాలతో సమస్య..
జిడ్డు చర్మం కలిగినవారికి మొటిమలు, బ్లాక్ హెడ్స్ (black heads) వంటి చర్మ సమస్యలు రావడం సహజం. అందుకే ముఖం జిడ్డుగా కనిపించకుండా ఉండేందుకు.. తరచూ దానిని శుభ్రం (clean) చేసుకోవాల్సి వస్తుంది. దీనివల్ల చర్మం రసాయనాల (chemicals) బారిన పడి.. ఇతర సమస్యలు వచ్చే అవకాశం కూడా ఉంది.
శనగపప్పుతో ప్యాక్..
శనగ పప్పు (peanut dal) చిట్కాలతో ఈ సమస్యను తగ్గించుకోవచ్చు. అందుకోసం తొలుత పప్పును (dal) ఎండబెట్టి పొడిగా చేసుకోవాలి. ఈ పొడిని రెండు టేబుల్ స్పూన్లు (spoons) తీసుకోవాలి. దీనికి రెండు టేబుల్ స్పూన్ల పాలు (milk) లేదా పెరుగు (curd) కలిపి.. ముఖానికి ప్యాక్ మాదిరిగా వేసుకుని 20 నిమిషాలు ఆరనివ్వాలి. ఆ తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఈ ప్యాక్ (pack) ముఖంపై ఉన్న జిడ్డును తొలిగిస్తుంది.
చెంచా ముల్లంగి గుజ్జుకు అర చెంచా నిమ్మరసం (lemon), నాలుగైదు చుక్కల ఆలివ్ నూనె (olive oil)ను కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖంపై రాసి పావుగంట ఆరనిచ్చి గోరువెచ్చని నీటితో శుభ్రపరచాలి. నిమ్మలోని విటమిన్ సి చర్మాన్ని శుభ్ర పరుస్తుంది. మొటిమల మచ్చలు లేదా ఎండవల్ల కమిలిన చర్మం పూర్వపు కాంతిని సంతరించుకుంటుంది. ముల్లంగి రసంలో దూదిని ముంచి మచ్చలపై మృదువుగా రాసినా ప్రయోజనం ఉంటుంది. ఈ మిశ్రమాన్ని ముఖంపై 20 నిమిషాలు ఆరనిచ్చి చల్లని నీటితో శుభ్రపరిచి మెత్తని వస్త్రంతో అద్దితే చాలు. వారంలో నాలుగైదుసార్లు ఇలా చేస్తే మటుమాయమవుతాయి.
(Disclaimer: The information and information provided in this article is based on general information. Telugu News 18 does not confirm these. Please contact the relevant expert before implementing them.)
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.