IS YOUR FACE BECOMING TOO GREASY DO YOU KNOW WITH THIS SINGLE APPLE YOU CAN GET RID OF YOUR PROBLEM PRV
Beauty tips: మీ ముఖం మరీ జిడ్డుగా మారుతోందా? అయితే ఈ ఒక్క ఆపిల్తోనే మీ సమస్యను దూరం చేసుకోవచ్చు
(ప్రతీకాత్మక చిత్రం)
కొంతమంది ఎంత ప్రయత్నించినా, ఎన్ని క్రీములు, ఫేస్ ప్యాక్‌లు వాడినా తమ చర్మం(skin) జిడ్డు(oily)గా ఉంటుందని బాధపడుతుంటారు. అలాంటి వారు కొన్ని పద్దతులు పాటిస్తే జిడ్డును తొలగించుకోవచ్చు. అందులో ఆపిల్ కూడా ఒకటి.
అందం (beauty). ఈ రోజుల్లో దీనికోసం ఉన్న డబ్బంతా ఖర్చు చేసే వారున్నారంటే నమ్మాల్సిందే. సమాజంలో మంచి గుర్తింపు కోసమో.. బంధువుల దగ్గర మెప్పు కోసమో.. ప్రయత్నిస్తూ తెలిసీ తెలియని ఫేస్‌ప్యాక్‌లను వాడుతుంటారు. అయితే మన ఇంట్లో చేసుకునే కొన్ని ప్యాక్‌లు మన చర్మాన్ని (skin) సంరక్షిస్తాయి. మన చర్మం కాంతివంతంగా ప్రకాశించడానికి (glow brighter) తోడ్పడుతాయి. చల్లటి వాతావరణం కారణంగా గాలిలో తేమ ఎక్కువగా ఉంటుంది. తద్వారా, చర్మం తరచుగా జిడ్డు, నీరసంగా మారుతుంది. ఇది క్రమంగా మొటిమలు, మచ్చలకు దారితీస్తుంది. వాతావరణ పరిస్థితులు, కలుషితమైన గాలి కారణంగా ముఖంతో తేజస్సు తగ్గిపోతుంది. మొటిమలు (pimples) తయారవుతాయి. కొంతమంది ఎంత ప్రయత్నించినా, ఎన్ని క్రీములు, ఫేస్ ప్యాక్‌లు వాడినా తమ చర్మం(skin) జిడ్డు(oily)గా ఉంటుందని బాధపడుతుంటారు. అలాంటి వారు కొన్ని పద్దతులు పాటిస్తే జిడ్డును తొలగించుకోవచ్చు. అందులో ఆపిల్ కూడా ఒకటి.
గోరు వెచ్చని నీటితో..
ఆయిల్ స్కిన్ (oily skin) తో బాధపడేవారు ప్రతిరోజు గోరు వెచ్చని నీటి (lukewarm water)తో ముఖాన్ని రోజుకు 4 నుంచి 6 సార్లు శుభ్రపరచుకోవాలి. ఆపిల్ (apple) ని రౌండ్ ముక్కలుగా కట్ చేసి ముఖం (face)పై 30 పై నిమిషాలు పెట్టుకోవాలి. ఇలా చేస్తే చర్మం (skin) మీదుండే జిడ్డునంతా ఆపిల్ ముక్కలు పీల్చేసి, చర్మాన్ని కాంతివంతం (brightness) చేస్తుంది. స్పూన్ నిమ్మరసం (lemon)లో ఒక టేబుల్ స్పూన్ నారింజ తొక్కల పొడి, ఒక టేబు స్పూన్ తేనె కలిపి ఆ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి ఆరిన తరువాత గోరువెచ్చని నీటితో కడిగేస్తే నిగనిగలాడే చర్మం మీ సొంతమవుతుంది.
బయటికి వెళ్లేముందు ఐస్ క్యూబ్ (Ice cube) తో ముఖాన్ని మర్దనా చేయాలి. ముఖంపై తడి ఆరిన తరువాత మేకప్ చేసుకుంటే చర్మం (skin) జిడ్డవ్వకుండా, ఎక్కువ సేపు తాజాగా మెరుస్తూ ఉంటుంది. బొప్పాయిని గుజ్జుగా చేసి అందులో నిమ్మ రసం, అర కప్పు బియ్యం (rice) పిండి కలిపి ఈ మిశ్ర మాన్ని (mixer) ముఖంపై సుతిమెత్తగా మర్దనా చేయాలి. చర్మం సహజ కాంతిని సంతరించుకుంటుంది.
(Disclaimer: The information and information provided in this article is based on general information. Telugu News 18 does not confirm these. Please contact the relevant expert before implementing them.)
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.