Relationship Tips: మీ బాయ్‌ ఫ్రెండ్‌ వేరే అమ్మాయిలను ఫ్లర్ట్‌ చేస్తున్నాడా? అయితే ఇలా చేయండి!

మీ బాయ్‌ఫ్రెండ్ పక్క చూపులకు ఇలా చెక్ పెట్టండి (PC: Love Divani)

మీరు పక్కన ఉన్నప్పుడే మీ బాయ్‌ఫ్రెండ్‌ వేరే అమ్మాయిని ఫ్లర్ట్‌ చేస్తుంటే ఆవేశపడకండి. ప్రశాంతంగా చూస్తూ ఉండండి. ఇలాంటి బాయ్‌ ఫ్రెండ్ అలా చేయకుండా ఈ టిప్స్ పాటించండి.

  • Share this:
‘నీ బాయ్‌ ఫ్రెండ్‌ ఏంటే.. ఎప్పుడూ నావైపు అలానే చూస్తూ, ఫ్లర్ట్‌ చేస్తున్నాడు’ ఇలా మీ స్నేహితురాలు ఎవరైనా మీకు చెప్పారా?

‘వీడేంటి నేను పక్కనే ఉండగానే వేరే అమ్మాయిల్ని ఫ్లర్ట్‌ చేస్తున్నాడు.. అదేనండి సరసాలు ఆడుతున్నాడు’ అని మీకు ఎప్పుడైనా అనిపించిందా?

ఇలాంటి సందర్భాలు మీకెప్పుడైనా ఎదురైతే వెంటనే రియాక్ట్‌ అయిపోకండి. దాని వల్ల మీ మధ్య అనుబంధం చెడిపోయే అవకాశమూ ఉంది. అసలు అతని ఫ్లర్టింగ్‌ (సరసాల) వెనుక ఉన్న కారణమేంటో తెలుసుకోండి. ఆ తర్వాత ఏం చేయాలో నిర్ణయం తీసుకోండి. ఆయన ఆలోచన ఏంటో తెలియకుండా మీరే నిర్ణయం తీసుకుంటే ఇబ్బంది పడతారు మరి. దీని కోసం ఏం చేయాలంటే....

మీరు పక్కన ఉన్నప్పుడే మీ బాయ్‌ఫ్రెండ్‌ వేరే అమ్మాయిని ఫ్లర్ట్‌ చేస్తుంటే ఆవేశపడకండి. ప్రశాంతంగా చూస్తూ ఉండండి. ఇలాంటి బాయ్‌ ఫ్రెండ్స్‌ మిమ్మల్ని మోసం చేస్తున్నారని కాదనే విషయం గుర్తించండి. అలా అని ఫ్లర్ట్‌ చేసే ప్రతి బాయ్‌ ఫ్రెండ్‌ అవతలి వ్యక్తి తో ఫిజికల్‌ రిలేషన్‌ కోసం ఆలోచిస్తున్నాడని కాదు.

* ఫ్లర్ట్‌ చేస్తున్న ప్రతి బాయ్‌ఫ్రెండ్‌ చీటర్‌ కాదనే విషయం గుర్తుంచుకోవాలి. కొన్నిసార్లు ఫ్లర్టింగ్‌ అవతలి వ్యక్తిలో ఆత్మవిశ్వాసాన్ని పెంచే అవకాశమూ ఉంటుంది. దాంతోపాటు మీ బాయ్‌ఫ్రెండ్‌ కేవలం అందమైన అమ్మాయిల్నే ఫ్లర్ట్‌ చేస్తున్నాడా? లేక అందరి అమ్మాయిల విషయంలోనూ ఇలానే ఉంటాడా అనేది చూసుకోవాలి.

* మీ బాయ్‌ ఫ్రెండ్‌ ఇతరుల్ని ఫ్లర్ట్‌ చేస్తున్నప్పుడు కాస్త కష్టమైనా కామ్‌గా ఉండాలి. మిమ్మల్ని మీరు కంట్రోల్‌ చేసుకున్నప్పుడే పరిస్థితిని మీరు అదుపులో ఉంచుకోగలుగుతారు. సమయం వచ్చేంతవరకు వేచి చూసి మీ బాయ్‌ఫ్రెండ్‌తో విషయం మీద చర్చించాలి. అది కూడా కూల్‌గా చేయాలి.

* ఇలాంటి సెన్సిటివ్‌ విషయాలు చర్చించినప్పుడు మీ మాట చాలా ముఖ్యం. మీ టోన్‌ బట్టే అవతలి వ్యక్తి స్పందన ఉంటుందని గ్రహించాలి. మీరు గొడవపడేలా మాట్లాడితే... విషయం చినికి చినికి గాలివానలా మారి ఇబ్బంది పడతారు. ఎంత మెచ్యూర్‌గా మాట్లాడితే పని అంత సులభం అవుతుంది.

* బంధంలో నమ్మకం అనేది చాలా ముఖ్యం. అయితే అతి నమ్మకం ఎప్పుడూ అనర్థాలకు దారి తీస్తుంది. అందుకే మరీ బాయ్‌ఫ్రెండ్‌ చెప్పే అన్ని మాటల్నీ నమ్మేయకుండా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. అలా అని నమ్మకం కోల్పోయేలా మాటలు ఉండకూడదు.

* ఇతర అమ్మాయిల్ని ఫ్లర్టింగ్‌ చేస్తున్న విషయం కావొచ్చు, ఇంకే విషయం కావొచ్చు వాటి గురించి మాట్లాడేటప్పుడు మీరు అతన్ని ఎంత నమ్ముతున్నారు అనేది తెలిసేలా చేయాలి. మీ నమ్మకం అతనికి తెలిస్తే... అతని ఆలోచనల్లో మార్పులు రావొచ్చేమో.

* కమ్యూనికేషన్‌ గ్యాప్‌ ఏ బంధంలో అయినా ఇబ్బంది పెట్టేదే. అందుకే అనవసరమైన చర్చలకు ఆస్కారమిచ్చేలా మీ కమ్యూనికేషన్‌ ఉండకూడదు. మాటలతో తేలేదానికి అరుపులు, కేకల వరకు తెచ్చుకోకూడదు అని రిలేషన్‌ ఎక్స్పర్ట్స్ సూచిస్తున్నారు.
Published by:John Naveen Kora
First published: