Health Tips : హైబీపీ ఉందా.. ఈ ఫ్రూట్ తినండి.. సమస్య తగ్గుతుంది..

Health Tips | పుచ్చకాయల్లోని యాంటీ ఆక్సిడెంట్స్ రక్తనాళాలను వెడల్పుగా చేస్తాయి. ఈ కారణంగ రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. కాబట్టి హైబీపీ ఉన్నవారు పుచ్చకాయలు తినొచ్చని నిపుణులు చెబుతున్నారు. 

news18-telugu
Updated: June 27, 2019, 5:11 PM IST
Health Tips : హైబీపీ ఉందా.. ఈ ఫ్రూట్ తినండి.. సమస్య తగ్గుతుంది..
ప్రతీకాత్మక చిత్రం
news18-telugu
Updated: June 27, 2019, 5:11 PM IST

ఎక్కువగా టెన్షన్ పడడాన్నే హైపర్ టెన్షన్ లేదా హైబీపీ అంటారు. సాధారణం 140/90 కంటే ఎక్కువ ప్రెషర్ ఉండడాన్నే హైబీపీ అంటారు. 180/90 ఉంటే అనారోగ్య సమస్యలు వస్తాయి. అందుకే.. అలాంటి పరిస్థితి రాకముందే బీపీ కంట్రోల్‌ చేసుకోవడం చాలా ముఖ్యం. ఫుడ్ విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. కొన్ని ఆహారపదార్థాలు తీసుకోవడం వల్ల బీపీ కంట్రోల్‌లో ఉంటుంది. అందులో ఒకటే పుచ్చకాయ.



నీటిశాతం ఎక్కువగా ఉన్న పుచ్చకాయని తీసుకోవడం వల్ల హైబీపీ కంట్రోల్‌లో ఉంటుందని సైటింస్టులు చెబుతున్నారు. అమెరికన్ జర్నల్ ఆఫ్ సైంటిస్టులు చేసిన పరిశోధన ప్రకారం.. పుచ్చకాయల్లో ఉండే ఎన్నో ఔషధ గుణాలు హైబీపీని తగ్గిస్తాయని తేలింది. పుచ్చకాయల్లోని యాంటీ ఆక్సిడెంట్స్ రక్తనాళాలను వెడల్పుగా చేస్తాయి. ఈ కారణంగ రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. కాబట్టి హైబీపీ ఉన్నవారు పుచ్చకాయలు తినొచ్చని నిపుణులు చెబుతున్నారు.


కాబట్టి.. కూసింత కోపంలో ఉన్నప్పుడూ ఓ ఊగిపోకుండా.. పుచ్చకాయ ముక్కలు తినండని చెబుతున్నారు.



Loading...
ఈ వీడియో కూడా చూడండి..

First published: June 27, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...