అందం (beauty). ఈ రోజుల్లో దీనికోసం ఉన్న డబ్బంతా ఖర్చు చేసే వారున్నారంటే నమ్మాల్సిందే. సమాజంలో మంచి గుర్తింపు కోసమో.. బంధువుల దగ్గర మెప్పు కోసమో.. ప్రయత్నిస్తూ తెలిసీ తెలియని ఫేస్‌ప్యాక్‌లను వాడుతుంటారు. అయితే మన ఇంట్లో చేసుకునే కొన్ని ప్యాక్‌లు మన చర్మాన్ని (skin) సంరక్షిస్తాయి. మన చర్మం కాంతివంతంగా ప్రకాశించడానికి (glow brighter) తోడ్పడుతాయి. అందులో ఒకటి సోంపు (anise). మామూలుగా హోటళ్లలో తినేశాక ఫ్రీగా ఇచ్చేస్తారే.. అదే సోంపు. దీనితో మన చర్మాన్ని అందంగా మార్చుకోవచ్చంట. అదేలాగో ఓ సారి తెలుసుకుందాం..
సోంపులో ప్రత్యేకత ఏంటి?
సోంపు (anise) గింజల్లో సహజసిద్ధమైన ఆస్ట్రింజెంట్ గుణాలుంటాయి. ఇవి చర్మ రంధ్రాల్లో (skin holes) చేరిన మురికిని తొలగించి.. అవి తిరిగి తెరుచుకొనేలా చేస్తాయి. అంతేకాదు.. చర్మగ్రంథులు విడుదల చేసే నూనెలను క్రమబద్ధీకరిస్తాయి. ఒక స్ప్రే బాటిల్లో సోంపు టీ వేసి దాన్ని ఫ్రిజ్‌లో ఉంచాలి. ప్రతి రోజూ ఉదయం, సాయంత్రం దీన్ని ముఖంపై స్ప్రే చేసుకోవడం ద్వారా చర్మంపై చేరిన మురికి (dirty)ని తొలగించుకోవచ్చు. ఇలా చేయడం ద్వారా చర్మం చక్కగా టోనింగ్ (toning) అవడంతో పాటు సాగిపోకుండా ఉంటుంది.
ప్రకాశించడానికి..
చర్మం ప్రకాశవంతంగా (skin glow ness) కనిపించడానికి సోంపు గింజల నీటితో ఆవిరి పట్టుకోవచ్చు. సోంపు గింజ (anise seeds)ల్లో ఉన్న యాంటీ సెప్టిక్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు చర్మాన్ని అందంగా మారుస్తాయి. లీటరు వేణ్నీళ్లలో టేబుల్ స్పూన్ సోంపు గింజలు వేయాలి. దళసరి టవల్ కప్పుకొని ముఖానికి ఐదు నిమిషాలు ఆవిరి పట్టుకోవాలి. ఈ చిట్కాను వారానికి రెండు సార్లు పాటిస్తే మీ చర్మం ఛాయ మెరుగుపడుతుంది.
చర్మం ప్రకాశవంతం కోసం సోంపు ఫేస్ ప్యాక్ (anise face pack) కూడా ప్రయత్నించవచ్చు. అరకప్పు వేడి నీటిలో టేబుల్ స్పూన్ సోంపు వేయాలి. అరగంట తర్వాత నీటిని వడపోసి సోంపు వేరు చేయాలి. ఆ నీటిలో టేబుల్ స్పూన్ ఓట్ మీల్, టేబుల్ స్పూన్ తేనె కలిపి మెత్తని పేస్ట్ (paste)లా తయారు చేసి ముఖానికి అప్లై (apply to face) చేసుకోవాలి. ఇరవై నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం (clean) చేసుకొంటే సరిపోతుంది.
ఇది కూడా చదవండి: ఈ కలుపు మొక్కతో మగవారిలో లైంగిక పరంగా ఉన్న ఆ సమస్యకు చెక్ పెట్టొచ్చంట.. ఆ మొక్క ఏంటంటే?
గ్లాసు నీటిలో చెంచా సోంపు వేసి రాత్రంతా నానబెట్టాలి. మరుసటి రోజు ఉదయానికి సోంపు నీరు తయారవుతుంది. దీన్ని ముఖం (face) శుభ్రం చేసుకోవడానికి ఉపయోగించవచ్చు. చర్మంపై ఉన్న మురికి, జిడ్డు, మృతకణాలు.. వీటన్నింటి కారణంగా చర్మ రంధ్రాలు మూసుకుపోతాయి. ఇవేమీ లేకుండా శుభ్రం చేసుకొన్నప్పుడే చర్మం ఆరోగ్యంగా, అందంగా ఉంటుంది. చర్మ రంధ్రాల్లో చేరిన మురికిని సోంపు గింజలతో తయారుచేసిన ప్రత్యేకమైన మిశ్రమంతో తొలగించవచ్చు.
గిన్నెలో వేడి నీరు పోసి.. అందులో పెద్ద చెంచాడు సోంపు వేసి 20 నిమిషాలు నానబెట్టాలి. చల్లారిన తర్వాత రెండు చుక్కల టీట్రీ ఎస్సెన్సియల్ ఆయిల్ సైతం కలపాలి. ఈ మిశ్రమాన్ని గాజు సీసాలో వేసి మూత గట్టిగా బిగించాలి. ఈ నీటిలో దూదిని ముంచి ..దానితో ముఖం తుడుచుకొంటే చర్మంపై చేరిన మురికి మొత్తం వదిలిపోతుంది.
(Disclaimer: The information and information provided in this article is based on general information. Telugu News 18 does not confirm these. Please contact the relevant expert before implementing them.)
ఇది కూడా చదవండి:
గదిలో ఒంటరిగా కూర్చుంటే తలనొప్పి తగ్గుతుందా? మరి నొప్పి తగ్గాలంటే ఇంకేం చేయాలి?
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Beauty tips, Face mask, Glow garden, Life Style