Home /News /life-style /

IS THE LIGHTNING REDUCED IN THE SKIN THEN STEAM CAN BRIGHTEN YOUR SKIN FOLLOW THESE STEPS PRV

Beauty tips: చర్మంలో మెరుపు తగ్గిపోయిందా? ఆవిరితో మీ చర్మం కాంతివంతంగా మార్చుకోవచ్చు.. ఇలా చేయండి

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

  కొంతమంది ఎంత ప్రయత్నించినా, ఎన్ని క్రీములు, ఫేస్​ ప్యాక్​లు వాడినా తమ చర్మం(skin) జిడ్డు(oily)గా ఉంటుందని బాధపడుతుంటారు. అలాంటి వారు కొన్ని పద్దతులు పాటిస్తే జిడ్డును తొలగించుకోవచ్చు.

    అందం (beauty) ప్రతీ ఒక్కరూ కోరుకుంటారు. కానీ, ఈ వాతావరణంలో తేడాలు, కాలుష్యం వల్ల చర్మం దెబ్బతిని ముఖంలో నలుపురంగు వస్తుంది. చల్లటి వాతావరణం కారణంగా గాలిలో తేమ ఎక్కువగా ఉంటుంది. తద్వారా, చర్మం తరచుగా జిడ్డు, నీరసంగా మారుతుంది. ఇది క్రమంగా మొటిమలు, మచ్చలకు దారితీస్తుంది. వాతావరణ పరిస్థితులు, కలుషితమైన గాలి కారణంగా ముఖంతో తేజస్సు తగ్గిపోతుంది. మొటిమలు (pimples) తయారవుతాయి. ఇక వేళకు తినకుండా ఒత్తిడికి లోనయ్యే వారికి నల్లటి వలయాలు (dark circles) కంటి చుట్టూ ఏర్పడతాయి. మనం తినే ఆహారం కూడా మన అందం (beauty)పై ప్రభావం చూపుతుంది. అందుకే వైద్యులు సరైన పోషక ఆహారం తీసుకోవాలని సూచిస్తారు. అయితే  కొంతమంది ఎంత ప్రయత్నించినా, ఎన్ని క్రీములు, ఫేస్​ ప్యాక్​లు వాడినా తమ చర్మం (skin) జిడ్డు(oily)గా ఉంటుందని బాధపడుతుంటారు. అలాంటి వారు కొన్ని పద్దతులు పాటిస్తే జిడ్డును తొలగించుకోవచ్చు.

    ఆవిరితో..

    బ్యూటీ పార్లర్ల చుట్ట తిరుగుతూ డబ్బులు (money) ఖర్చు పెట్టుకునేవారికి, ఫలితం అప్పటికప్పుడే వస్తుంది. కానీ తరువాత ఎన్నో సైడ్ ఎఫెక్ట్ (Side effects) లను ఎదుర్కోవాల్సి వచ్చేది. కానీ, ముఖానికి ఆవిరి (steam) పట్టడం వల్ల చర్మ (skin) రంధ్రాలను తెరచుకొనేలా చేస్తుంది. ఇలా చేయడం వల్ల చర్మం లోపలి పొరల్లో పేరుకున్న దుమ్ము (dust), ధూళిని నిర్మూలించడానికి ఆవిరి సహాయపడుతుంది. ఫలితంగా బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ ను తొలగించడం సులభం అవుతుంది. ఆవిరి పట్టడం వల్ల మన ముఖం మీద రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. ఫలితంగా సహజమైన ఆరోగ్యకరమైన కాంతి (healthy light) మీ చర్మానికి సంతరించుకుంటుంది.

    చర్మానికి తగినంత తేమ..

    ఎప్పుడైతే చర్మానికి ఆవిరి పడతామో (steam), అప్పుడు చర్మానికి (for skin) తగినంత తేమ అందుతుంది. ఆవిరి పట్టే సమయంలో సరైన రక్త ప్రవాహం జరిగి కొల్లేజన్, ఎలాస్టిన్ ఉత్పత్తిని ప్రోత్సహిస్తుంది. దీని ఫలితంగా చర్మం (skin) యవ్వనం (young)గా కనిపిస్తుంది.. అంతేకాకుండా ఆరోమాథెరపీ ద్వారా కూడా ఆవిరి పట్టవచ్చు.

    తలనొప్పి నుంచి ఉపశమనం..

    ఆవిరి పట్టేటప్పుడు సువాసనలను అందించే, నూనెను ఒక రెండు మూడు చుక్కలు నీటిలో వేస్తే సైనాస్ తో పాటు తరచూ వచ్చే తలనొప్పి నుండి ఉపశమనం పొందడానికి సహాయపడుతుంది.. కాబట్టి ఇంట్లోనే అతి తక్కువ సమయంలోనే ఆవిరి పట్టుకొని ముఖం అందంగా మారే లాగా ప్రయత్నించండి.

    (Disclaimer: The information and information provided in this article is based on general information. Telugu News 18 does not confirm these. Please contact the relevant expert before implementing them.)
    Published by:Prabhakar Vaddi
    First published:

    Tags: Beauty tips, Skin care

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు