Home /News /life-style /

IS THE BEAUTY OF YOUR KNEES DIMINISHING AND TURNING BLACK THEN DO THIS AND GET RID OF THE PROBLEM PRV

Beauty tips: మీ మోకాళ్ల అందం తగ్గిపోతుందా? నల్లగా మారుతున్నాయా? అయితే ఇలా చేసి సమస్య దూరం చేసుకోండి

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

మన శరీరంలోని మోకాళ్లు (foreleg), మోచేతులు (forehand),  చాలా మందిలో నల్లగా ఉంటాయి .ఈ ప్రదేశాలలో చర్మం మందంగా ఉంటుంది అందుకే.. ఈ ప్రదేశాలపై కాస్త శ్రద్ధ పెట్టాల్సిన ఉంది.

    చల్లటి వాతావరణం కారణంగా గాలిలో తేమ ఎక్కువగా ఉంటుంది. తద్వారా, చర్మం తరచుగా జిడ్డు, నీరసంగా మారుతుంది. ఇది క్రమంగా మొటిమలు, మచ్చలకు దారితీస్తుంది. వాతావరణ పరిస్థితులు, కలుషితమైన గాలి కారణంగా ముఖంతో తేజస్సు తగ్గిపోతుంది. మొటిమలు (pimples) తయారవుతాయి. ఇక వేళకు తినకుండా ఒత్తిడికి లోనయ్యే వారికి నల్లటి వలయాలు (dark circles) కంటి చుట్టూ ఏర్పడతాయి. మనం తినే ఆహారం కూడా మన అందం (beauty)పై ప్రభావం చూపుతుంది. అందుకే వైద్యులు సరైన పోషక ఆహారం తీసుకోవాలని సూచిస్తారు. అయితే  కొంతమంది ఎంత ప్రయత్నించినా, ఎన్ని క్రీములు, ఫేస్​ ప్యాక్​లు వాడినా తమ చర్మం (skin) జిడ్డు (oily)గా ఉంటుందని బాధపడుతుంటారు. అలాంటి వారు కొన్ని పద్దతులు పాటిస్తే జిడ్డును తొలగించుకోవచ్చు. మన  చర్మం యొక్క గోప్ప తనం ఏంటంటే పాత కణాలు, చెడిపోయిన కణాలు  నిరంతరం  కొత్త కణాలతో రిప్లేస్ అవుతుంటాయి. మంచి పోషకాహారం మరియు మంచి జీవన శైలి ఉంటే  ఈ  ప్రక్రియ మరింత వేగవంతం అవుతుంది. దాని వల్ల మీ చర్మం (skin) సహజంగా అందం (beauty)గా అవుతుంది.

    మృత చర్మం పొర అలాగే పేరుకుపోతోంది..

    మన శరీరంలోని మోకాళ్లు (knees), మోచేతులు (forehand),  చాలా మందిలో నల్లగా ఉంటాయి.ఈ ప్రదేశాలలో చర్మం మందంగా ఉంటుంది. ఆ కారణంగా మృత చర్మం పొర అలాగే అక్కడ పేరుకుపోతోంది. అలా ఆ ప్రాంతం అంతా అంద వికారంగా ఉంటుంది. అయితే, ఈ ప్రదేశాలలో ఆయిల్ గ్లేడ్స్ లేనందున.. చర్మం (skin) త్వరగా పొడిగా, నిర్జీవంగా కనిపిస్తుంటుంది. అందుకే.. ఈ ప్రదేశాలపై కాస్త శ్రద్ధ పెట్టాల్సిన ఉంది.

    పెరుగు నల్లధనాన్ని పోగొడుతుంది. దీనిలో లాక్టిక్ యాసిడ్ ఉంటుంది. ఇది చర్మం (skin) రంగును కాంతివంతం చేయడానికి సహాయపడుతుంది. అలాగే.. ఇది చర్మాన్ని తేమగా ఉంచడంలో సహాయపడుతుంది. మీరు నేరుగా మోచేతులు, మోకాళ్ల (knees)పై పెరుగును అప్లై చేయొచ్చు. పెరుగును మోచేతులు, మోకాళ్ల (knees)కు అప్లై చేసి.. కొంతసేపు ఉంచి, తర్వాత నీటితో కడగాలి. కొబ్బరి నూనెను ఉపయోగించడం ద్వారా మోకాలు, మోచేతుల (forehand) నలుపు తొలగిపోతుంది. ఇందులో విటమిన్-ఇ పుష్కలంగా ఉంటుంది. ఇది చర్మాన్ని తేమగా ఉంచడంలో సహాయపడుతుంది. ఇది నలుపును వదిలించుకోవడానికి కూడా సహాయపడుతుంది. కొబ్బరి నూనెను వారానికి 2 నుండి 3 రోజులు ఉపయోగించడం వల్ల చర్మం (skin) పొడిబారడం తొలగిపోతుంది.

    (Disclaimer: The information and information provided in this article is based on general information. Telugu News 18 does not confirm these. Please contact the relevant expert before implementing them.)
    Published by:Prabhakar Vaddi
    First published:

    Tags: Beauty tips

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు