Sleeping while Sitting: కుర్చీలో కూర్చొని నిద్రపోవడం మంచి అలవాటేనా? ఇది ఎలాంటి సమస్యలకు కారణమవుతుంది?

ప్రతీకాత్మక చిత్రం (photo : meetuptim/twitter)

డెస్క్‌ ముందు పనిచేస్తూ అలాగే కుర్చీలో కూర్చొని ఓ కునుకు తీయడం, స్కూల్‌లో పిల్లలు బెంచ్‌లపై నిద్రపోవడం చాలా సార్లు జరుగుతూనే ఉంటుంది. కానీ తరచూ అలా నిద్రపోవడం ఆరోగ్యపరంగా చాలా సమస్యలకు దారితీస్తుంది.

  • Share this:
చాలా మందికి కూర్చొని నిద్రపోయే (Sleeping while Sitting) అలవాటు ఉంటుంది. కొందరు కంప్యూటర్‌పై పనిచేస్తూ అలాగే నిద్ర (sleep)లోకి జారుకుంటారు. అలా పడుకోవడం ఆ క్షణానికి సౌకర్యంగానే అనిపించవచ్చు కానీ, ఆ తర్వాత తీవ్రమైన బ్యాక్‌ పెయిన్‌ (back pain), మెడ (neck), భుజాలు పట్టేసినట్టు ఉండటం వంటివి ఎదురవ్వచ్చు. దానికి ప్రధాన కారణం గంటల తరబడి ఒక చోట కదలకుండా కూర్చోవడమే. నిద్రించేటప్పుడు, కూర్చున్నప్పుడు లేదా నిల్చున్నప్పుడు కదలకుండా, నిశ్చలంగా ఉండటం జంతువులకు సాధ్యం కానీ, మనుషులకు (humans) అది కుదరదు. ఒకే పొజిషన్‌లో నిశ్చలంగా ఎక్కువ సేపు కూర్చొని ఉంటే అది మీ కీళ్లపై తీవ్ర ప్రభావం చూపుతుంది. అవన్ని పట్టేసినట్టుగా మారిపోతాయి. డీప్‌-వెయిన్ థ్రోంబొసిస్‌ వంటి తీవ్రమైన వ్యాధులకు (diseases) అవి కారణం కూడా అవుతాయి.

కూర్చొని నిద్రపోవడం వల్ల ఎదురయ్యే ప్రమాదాలు

డెస్క్‌ ముందు పనిచేస్తూ అలాగే కుర్చి (In chair)లో కూర్చొని ఓ కునుకు తీయడం, స్కూల్‌లో పిల్లలు బెంచ్‌లపై నిద్రపోవడం (sleep) చాలా సార్లు జరుగుతూనే ఉంటుంది. కానీ తరచూ అలా నిద్రపోవడం ఆరోగ్యపరంగా (healthy) చాలా సమస్యలకు దారితీస్తుంది. మంచం మీద మనం పడుకున్నప్పుడు మన చేతులు, కాళ్లలోని కండరాలు సాగి విశ్రాంతి (Rest)గా ఉంటాయి. అదే కూర్చొని నిద్రపోతే అది రక్త ప్రసరణను మందగింపజేస్తుంది, కదలికలను నియంత్రిస్తుంది. వీటితో కొత్త సమస్యలు వస్తాయి.

ఇది కూడా చదవండి: బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేస్తే ఏమవుతుంది ? అసలు బ్రహ్మ ముహూర్తం ఎప్పుడు ఉంటుంది?

మరణానికి కూడా దారితీయవచ్చు..

కూర్చొని నిద్రపోవడం (Sitting and falling asleep) వల్ల స్వల్పకాలిక సమస్యలతో పాటు డీప్‌ వీన్‌ థ్రోంబోసిస్‌ అంటే రక్తం గడ్డకట్టడం వంటివి మన శరీరంలో ముఖ్యంగా కాళ్లలో ఏర్పడుతుంది. ఎటువంటి కదలికలు లేకుండా ఒక వైపు పడుకోవడం లేదా ఎక్కువ సమయం పాటు కూర్చొని నిద్రపోవడం (Sitting and falling asleep) వలన ఇలాంటి ప్రతికూల పరిస్థితి ఏర్పడుతుంది. ఈ పరిస్థితిని పట్టించుకోకుండా వదిలిస్తే అది తీవ్రమై కొన్ని సందర్భాల్లో మరణానికి కూడా దారితీయవచ్చు.

రక్తం గడ్డకట్టుకొని అది పగిలిపోయినప్పుడు అది వేగంగా ఊపిరితిత్తులు, మెదడు (brain)కు చేరి తీవ్రమైన నష్టాన్ని కలిగించడమే కాదు మరణానికి కారణమవుతుంది. రక్తం గడ్డకట్టడం (Blood clots) అనే పరిస్థితి కారణంగా ప్రతీ రోజు 200 మంది చనిపోతున్నారు. ఇలాంటి పరిస్థితి 25 ఏళ్ల వారిలోనూ ఏర్పడవచ్చు, 85 ఏళ్ల వయస్సు వారిలోనూ ఏర్పడవచ్చు.

వర్షంలో తడిచాక మీ జుట్టు పాడైపోతుంది కదా? ఈ చిట్కాలతో మీ జుట్టును కాపాడుకోండి..
డీప్‌ వీన్‌ థ్రోంబోసిస్‌ లక్షణాలు
మడమ, పాదం, పిక్కలు వాయడం, నొప్పి.. వాపు కారణంగా చర్మం ఎర్రబారడం, వేడిగా అవడం.. హఠాత్తుగా పాదం, మడమ నొప్పి వంటివి దీని లక్షణాలు.

కూర్చొని నిద్రపోదలిస్తే రిక్లైనర్లను ఆశ్రయించవచ్చు. పడుకునేందుకు ఇబ్బందిగా ఉండే పొజిషన్‌ లేకుండా చూసుకోవాలి. నిద్రలో శ్వాస సమస్యలు ఎదుర్కొనే వారికి ఇది ఉత్తమం. యాసిడిటీ సమస్యలతో బాధపడేవారు చక్కగా నిద్రపోయేందుకు ఇది బాగా ఉపయోగపడుతుంది.

(Disclaimer: The information and information provided in this article is based on general information. Telugu News 18 does not confirm these. Please contact the relevant expert before implementing them.)

ఇది కూడా చదవండి: నీళ్లు ఎక్కువగా తాగితే నిత్య యవ్వనంగా కనిపిస్తారా? ముఖంపై ముడుతలు పోవాలంటే ఏం చేయాలి?
Published by:Prabhakar Vaddi
First published: