IS RIMMING A DEVIANCY HOW CAN I ASK A WOMAN TO LET ME RIM HER BA SWPB
Sexual Wellness: రిమ్మింగ్ అనేది విపరీతమైన లైంగిక చర్యా? ఆమెను ఎలా అడగాలి?
ప్రతీకాత్మకచిత్రం
‘రిమ్మింగ్’ (మల ద్వారాన్ని నాలుకతో స్పృసించడం) గురించి మీ అభిప్రాయం ఏంటి? అదేమైనా విపరీతమా? లేకపోతే సహజమైన ప్రక్రియేనా? మహిళలు దీన్ని ఆస్వాదిస్తారా? సెక్స్ పార్ట్నర్ను రిమ్మింగ్ చేస్తానని ఎలా అడగాలి?
ప్రశ్న. ‘రిమ్మింగ్’ (మల ద్వారాన్ని నాలుకతో స్పృసించడం) గురించి మీ అభిప్రాయం ఏంటి? అదేమైనా విపరీతమా? లేకపోతే సహజమైన ప్రక్రియేనా? మహిళలు దీన్ని ఆస్వాదిస్తారా? సెక్స్ పార్ట్నర్ను రిమ్మింగ్ చేస్తానని ఎలా అడగాలి?
జవాబు.
అసలు ‘విపరీత’ లైంగిక ప్రవర్తన అనే పదబంధాన్ని ఎలా ఉపయోగిస్తున్నారనే దానిపై నాకు సందేహాలు ఉన్నాయి. విపరీత చర్య అంటే చరిత్రలో చూస్తే లైంగికంగా హింసించడం అనేదానికి వాడేవారు. దాన్ని నైతికంగా అనుమతించేవారు కాదు. పెళ్లికి ముందు సెక్స్, క్వీర్ సెక్స్, సెక్సువల్ ఫ్యాంటసీలు, కింక్స్ అంటే సిగ్గుపడేవారు. దాన్ని గురించి మాట్లాడుతూ ఇలాంటి పదాలతో దాడి చేసేవారు. ఇతరులు సెక్స్ చేసుకునేటప్పుడు రహస్యంగా చూడడం, శవాలపై లైంగిక కోరిక తీర్చుకోవడం, చిన్న పిల్లలపై లైంగిక దాడి, జంతువులతో సెక్స్ చేయడం అనేది విపరీత లైంగిక ప్రవర్తన కంటే కూడా అవి నేరపూరితమైనవి. పరస్పర అంగీకారంతో శృంగారం జరుపుకొనే జంట మధ్య విలువలు, తీర్పులు ఇవ్వాల్సిన అవసరం లేదు. అది రిమ్మింగ్కు కూడా వర్తిస్తుంది.
రిమ్మింగ్ అంటే మీ పార్ట్నర్ యొక్క మలద్వారాలను చూషించడం, నాలుకతో స్పృసించడం. దీన్ని తక్కువ చేసి చూస్తారు. చాలా మంది దీన్ని నైతికతకు విరుద్ధం అంటారు. సిగ్గుపడుతూ ఉంటారు. మల ద్వారా సెక్స్ లాగే దీన్ని కూడా చూస్తారు. మీ ఆరోగ్యానికి సంబంధించి అన్ని చర్యలు తీసుకుంటే ఇది కూడా ఒక ఆనందం కలిగించే లైంగిక చర్య. ఒకవేళ మీరు చేయాలనుకుంటే చేసేయండి. అందులో మరో మాట లేదు. అందులో తప్పు పట్టాల్సినది, సిగ్గుపడాల్సినది ఏమీ లేదు.
ఇతర లైంగిక చర్యల లాగానే కొందరు దీన్ని లైక్ చేయవచ్చు. కొందరు చేయకపోవచ్చు. అది మీ సెక్సువల్ పార్ట్నర్ ఎంపిక మీద ఆధారపడి ఉంటుంది. రిమ్మింగ్ను ఆస్వాదించే వారయితే ఓకే. ఒకవేళ వారికి ఇష్టం లేకపోతే వారి అభిప్రాయాన్ని గౌరవించాలి. మీరు అలాంటి వారి కోసం ఎదురుచూస్తున్నట్టయితే వారి కోసం ప్రత్యేక చాట్ రూమ్స్, ఫోరమ్స్ ఉంటాయి. కొన్ని ఆన్ లైన్ కమ్యూనిటీస్ ఉంటాయి. రెడిట్ లాంటి ప్లాట్ ఫాంలో కొందరు రిమ్మింగ్ కోసం తపించే వారు కూడా ఉంటారు.
మరో విషయం ఏంటంటే, మీరు రిమ్మింగ్ అనే దాని మీద ఆశలు పెట్టుకోకుండా ఇతర లైంగిక చర్యలను కూడా ఆస్వాదించడం, ఆనందించడం నేర్చుకోండి. దాని ద్వారా వచ్చే లాభం ఏంటంటే.. మీకు దొరికిన సెక్స్ పార్ట్నర్ మీ రిమ్మింగ్ కోరికను తిరస్కరిస్తే ఇతర లైంగిక చర్యల ద్వారా అంతే ఆనందం పొందడానికి ఆస్కారం ఉంటుంది.
చివరగా మీ ప్రశ్నకు సమాధానం ఏంటంటే, ఇతర అన్ని లైంగిక చర్యల లాగానే దీన్ని కూడా భావించండి. మీకు ఎదురయ్యే పార్ట్నర్గా నిజాయితీగా ఉండండి. ఆమెకు మీరు కోరుకుంటున్న రిమ్మింగ్ నచ్చుతుందో, ఎంజాయ్ చేస్తుందో లేదో అడగండి. అందుకు సుముఖంగా ఉందో లేదో అడగండి. ఆమె ఓకే అంటే ముందుకు వెళ్లండి. ఎవరైనా మీ సెక్సువల్ చర్యల గురించి మిమ్మల్ని అంచనా వేస్తే అది వారి లోపం. మీది కాదు. మీ లైంగిక జీవితం మీది.