Monsoon food: వర్షాకాలంలో ఆకుకూరలు తింటే మంచిది కాదా? మరి ఎలాంటి ఆహారం తీసుకుంటే బెటర్​..?

ప్రతీకాత్మక చిత్రం

డెంగ్యూ, చికన్ గున్యా, మలేరియా, కలరా, టైఫాయిడ్, డయేరియా, వైరల్ ఫీవర్ వంటి ఎన్నో వ్యాధులు వర్షా కాలంలోనే ఎక్కువగా ప్రబలుతుంటాయి. అయితే వర్షాకాలంలో తీసుకునే ఆహారంలో జాగ్రత్తలు పాటిస్తే మంచిది.

  • Share this:
వర్షం (rain). అంటే ఇష్టపడని వారు ఉండరు. చాలామంది తొలకరి వర్షానికి ముందు, పడేటప్పుడు భూమి నుంచి వచ్చే ప్రత్యేక వాసన (smell)ను ఇష్టపడతారు. వర్షపు నీరు చాలా శుద్ధమైనది (fresh) . భూమి మీద నీరే (water) ఆవిరై మేఘాలుగా మారి వర్షంగా కురుస్తుంది. వర్షాకాలం (rainy season) ఇష్టపడేవాళ్లు చాలామందే ఉంటారు. అందమైన వాతావరణం, బయట వర్షం పడుతుంటే వేడి వేడి స్నాక్స్ తింటూ కాలం గడపడం అందరికీ ఇష్టమైన పనులే.. అయితే వర్షా కాలం కేవలం వీటినే కాదు.. ఎన్నో రకాల రోగాలను కూడా తీసుకొస్తుంది. డెంగ్యూ, చికన్ గున్యా, మలేరియా, కలరా, టైఫాయిడ్, డయేరియా, వైరల్ ఫీవర్ వంటి ఎన్నో వ్యాధులు వర్షాకాలం (monsoon) లోనే ఎక్కువగా ప్రబలుతుంటాయి. వీటితో పాటు జలుబు (Cold), దగ్గు, జ్వరం వంటి సాధారణ సమస్యలు కూడా ఇబ్బంది పెడుతుంటాయి. అయితే వర్షాకాలంలో తీసుకునే ఆహారంలో జాగ్రత్తలు పాటిస్తే మంచిది.ముఖ్యంగా ఆకుకూరల (Greens) విషయంలో. ఆ వివరాలు ఒకసారి తెలుసుకుందాం..

ఆకుకూరలకు దూరం బెటర్​..

వర్షాకాలం (monsoon)లో మహిళలు తీసుకునే ఆహారం (food)లో జాగ్రత్తలు పాటించాలి. వర్షాకాలంలో ఆకుకూరల్లో నీరు అధికంగా ఉండటం వల్ల జీర్ణశక్తి తగ్గుతుంది. అందుచేత ఆకుకూరలపై క్రిమికీటకాలు ఎక్కువగా ఉంటాయి.  వీలైనంత వరకు ఆకుకూరలు తీసుకోవడం తగ్గిస్తే (reduce) బెటర్​. కాయకూరల పులుసు సాంబర్ (sambar), చట్నీ (chutney)లను తరుచు తీసుకోవాలి. ఇక పుదీనా చట్నీ, ఉల్లి, వెల్లుల్లి వేసిన పదార్థాలు వాడితే జీర్ణశక్తి పెరుగుతుంది.  అలాగే పులుపు పదార్థాలు పెరుగు మజ్జిగ (butter milk)లాంటివి పూర్తిగా తగ్గించాలని న్యూట్రీషన్లు (nutritionists) సూచిస్తున్నారు.

ఇది కూడా చదవండి: బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేస్తే ఏమవుతుంది ? అసలు బ్రహ్మ ముహూర్తం ఎప్పుడు ఉంటుంది?

వర్షాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు..

మీ ఇల్లు, పరిసరాలను శుభ్రం (clean)గా ఉంచుకోవాలి. వంట చేయడానికి, తాగడానికి శుభ్రమైన నీటిని ఉపయోగించాల్సి ఉంటుంది. తాజా ఆహారాన్ని (fresh food) తీసుకోవడం మంచిది. మీకు అవసరం ఉన్నంత మాత్రమే వండుకోండి. ఒకవేళ ఆహారం మిగిలితే రిఫ్రిజిరేటర్‌లో పెట్టి ఉంచండి. దీని ద్వారా సూక్ష్మ జీవులు పెరగకుండా ఉంటాయి. ఆ తర్వాత వేడి చేసి తీసుకోండి.

పాలు (milk), పెరుగు (curd) వంటి పదార్థాలు ఫ్రిజ్ లో పెట్టడం మంచిది. తాజా పదార్థాలు, కూరగాయలు (vegetables) మాత్రమే ఉపయోగించడం మంచిది. అల్లం, వెల్లుల్లి, జీలకర్ర, ధనియాలు, పసుపు (turmeric), మిరియాలు వంటివి ఉపయోగించడం వల్ల రోగ నిరోధక శక్తి (immunity system) పెరుగుతుంది. వర్షాకాలంలో వచ్చే సమస్యల నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోవచ్చు.

(Disclaimer: The information and information provided in this article is based on general information. Telugu News 18 does not confirm these. Please contact the relevant expert before implementing them.)

ఇది కూడా చదవండి: నీళ్లు ఎక్కువగా తాగితే నిత్య యవ్వనంగా కనిపిస్తారా? ముఖంపై ముడుతలు పోవాలంటే ఏం చేయాలి?

ఇవి కూడా చదవండి:  తిన్న ఆహారం అరగట్లేదా? అయితే రోజూ ఉదయాన్నే ఇలా చేయండి.. సమస్యను దూరం చేసుకోండి

వర్షంలో తడిచాక మీ జుట్టు పాడైపోతుంది కదా? ఈ చిట్కాలతో మీ జుట్టును కాపాడుకోండి..


ముఖంలో కాంతి, తేజస్సు కావాలా ? మొటిమలు తగ్గిపోవాలా? అయితే ఇలా చేయండి
Published by:Prabhakar Vaddi
First published: