Home /News /life-style /

Corona: కరోనా ఎఫెక్ట్.. ముంచుకొస్తున్న మరో ముప్పు.. ఎవరూ పట్టించుకోవడం లేదు కానీ..

Corona: కరోనా ఎఫెక్ట్.. ముంచుకొస్తున్న మరో ముప్పు.. ఎవరూ పట్టించుకోవడం లేదు కానీ..

కరోనా టెస్టుకు నమూనాలు తీసుకుంటున్న వైద్య సిబ్బంది(ఫైల్ ఫొటో)

కరోనా టెస్టుకు నమూనాలు తీసుకుంటున్న వైద్య సిబ్బంది(ఫైల్ ఫొటో)

కరోనా మహమ్మారి వల్ల ప్రజలు ఎదుర్కొన్న సమస్యల గురించి మీడియాలోనూ, సోషల్ మీడియాలోనూ ఎన్నో వార్తలు వచ్చాయి. అయితే కొవిడ్ వల్ల, వరుస లాక్ డౌన్ ల వల్ల యువతలో వచ్చిన ఓ కొత్త మార్పు, భవిష్యత్ తరాలకు ఎంత నష్టం చేకూరుస్తోందో గుర్తించలేకపోతున్నారు. ఇంతకీ అదేంటనే కదా మీ డౌటు..

ఇంకా చదవండి ...
  కరోనా వైరస్ ప్రపంచాన్ని ఎంత అతలాకుతలం చేసిందో అందరికీ తెలిసిందే. రోడ్లపైకి రావడానికి కూడా ప్రజలు భయపడేలా చేసింది. ఇళ్లల్లోనే బిక్కుబిక్కుమంటూ గడిపేలా చేసింది. నాలుగు గోడల మధ్య నలుగురినీ కట్టేసింది. ప్రయాణాలు లేవు, శుభకార్యాలు అసలే లేవు. బంధువులు వేరే ఇతర కారణాలతో చనిపోయినా వెళ్లేందుకు ధైర్యం చాలలేదు. ఇక కరోనాతో ఎవరైనా చనిపోయారని తెలిస్తే ఊళ్లలోకే రానివ్వకుండా కంచెలు వేసిన ఘటనలు కోకొల్లలు. అంతటి విపత్తులోనూ మానవత్వం వెల్లివిరిసింది. వాహనాలు లేక సొంతూళ్లకు వెళ్లేందుకు లక్షలాది మంది కార్మికులు కాలినడకనే నమ్ముకున్నారు. రోడ్లపై వందలు, వేల కిలోమీటర్ల దూరం నడుచుకుంటూ వెళ్తున్న ఆ వలస కూలీలకు ఆపద్భాందవుల్లా సాయం చేసి, వారి గుండెల్లో దేవుళ్లలా మారిన వారు ఎందరో. ఒక్క కరోనా, ఎన్ని సమస్యలను సృష్టించిందో లెక్కేలేదు.

  ఉద్యోగాలు కోల్పోయారు. నిరుద్యోగం పెరిగింది. అదృష్టవశాత్తూ ఉద్యోగం ఉన్నా, యాజమాన్యాలు జీతాల్లో కోతలు పెట్టేశాయి. రూపాయి, రూపాయి లెక్కిస్తూ ఖర్చు పెట్టుకోవడాన్ని అలవాటు చేసుకున్నారు. ఆరోగ్యంపై శ్రద్ధ పెరిగింది. అనారోగ్యంపై భయం పెరిగింది. ఇవన్నీ బయటకు చెప్పుకుంటున్న విషయాలు. జనం నోళ్లల్లో నానుతున్న మాటలు. మీడియాలోనూ, సోషల్ మీడియాలోనూ వస్తున్న వార్తలు. కానీ ఓ అంశం గురించి మాత్రం బయట అంతగా చర్చ జరగడం లేదు. కరోనా మహమ్మారి వల్ల, వరుస లాక్ డౌన్ ల వల్ల యువతలో వచ్చిన ఓ కొత్త మార్పు, భవిష్యత్ తరాలకు ఎంత నష్టం చేకూరుస్తోందో గుర్తించలేకపోతున్నారు. ఇంతకీ అదేంటనే కదా మీ డౌటు..

  కరోనా వల్ల వర్క్ ఫ్రం హోం, ఆన్ లైన్ క్లాసులు పెరిగిన సంగతి తెలిసిందే. దీని వల్ల ఉద్యోగం కారణంగానో, చదువు కారణంగానో నెట్టింట గడిపేవారి సంఖ్య అమాతం పెరిగింది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే టైమ్ కూడా ఊహించని రీతిలో పెరిగింది. అటు ఉద్యోగులు, విద్యార్థులే కాదు, ఇటు నిరుద్యోగ యువత కూడా కాలక్షేపం కోసం నెట్ నే ఆశ్రయించింది. మొదట్లో కంప్యూటర్/ మొబైల్ స్క్రీన్ ను అంత సేపు చూసేందుకు కష్టపడిన యువత, ప్రస్తుతం ఆన్ లైన్ లో ఉంటూ ఏదో ఒకటి బ్రౌజ్ చేయకుండా ఉండలేకపోతున్నారు. యూట్యూబ్ లో వీడియోలు చూడటం, ఫేస్ బుక్, వాట్సప్.. ఒకటేమిటి అన్నింటినీ ఓ లుక్కేశారు. టైమ్ పాస్ కావడం కోసం ఇటీవల విడుదలయిన పరభాషా చిత్రాలను కూడా మనోళ్లు చూస్తున్నారంటే ఇంటర్నెట్ కు ఎంత అడిక్ట్ అయ్యారో వేరే చెప్పనవసరం లేదు. ఇలా ఇంటర్నెట్ కు అడిక్ట్ అయ్యి, ఎక్కువ సేపు ఆన్ లైన్ ఉంటే అనారోగ్యం బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనీ, భవిష్యత్తులో ఇబ్బందులు ఎదుర్కొనక తప్పదని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. భవిష్యత్తులో దీని దుష్ప్రభవాలు తప్పకుండా బయటపడతాయని చెబుతున్నారు.
  Published by:Hasaan Kandula
  First published:

  Tags: Corona Possitive, Corona Vaccine, Coronavirus, Covid-19, COVID-19 vaccine

  తదుపరి వార్తలు