Health tips: జననాంగాల వద్ద మరీ ఎక్కువ దురదగా ఉంటుందా? అయితే ఈ చిట్కాలు పాటించి దూరం చేసుకోండి

ప్రతీకాత్మక చిత్రం

నలుగురిలో ఉన్నపుడు దురదగా అనిపిస్తే ఆ ఇబ్బంది మాటల్లో చెప్పలేనిది. చాలామందికి దురద సమస్య ఉంటుంది. అయితే జననాంగాల వద్ద అయితే మరీ ఎక్కువుంటుంది. కొద్దిమందికి జననాంగాల (genital area) వద్ద దురద (itching) వచ్చిందంటే.. దాన్ని తగ్గించుకోవడానికి ఏం చేయాలో అర్థం కాదు.

  • Share this:
    దురద (itch). నలుగురిలో ఉన్నపుడు దురదగా అనిపిస్తే ఆ ఇబ్బంది మాటల్లో చెప్పలేనిది. చాలామందికి దురద సమస్య ఉంటుంది. అయితే జననాంగాల (Private parts) వద్ద అయితే మరీ ఎక్కువుంటుంది. కొద్దిమందికి జననాంగాల (genital area) వద్ద దురద (itching) వచ్చిందంటే.. దాన్ని తగ్గించుకోవడానికి ఏం చేయాలో అర్థం కాదు. దురద తగ్గించేందుకు గోక్కుంటే నలుగురిలో ఎబ్బెట్టుగా ఉంటుంది. కానీ అలా చేయకపోతే ఆ దురద మనల్ని చాలా ఇబ్బంది పెడుతుంది. ఇలాంటప్పుడు నరకం కనిపిస్తుంది. ముఖ్యంగా అమ్మాయిలైతే (girls).. అసలు ఈ సమస్య ఎదురైతేనే సిగ్గుగా ఫీలవుతుంటారు. ఈ సమస్య నుంచి దూరం అవడానికి కొన్ని పద్దతులు పాటిస్తే సరిపోతుంది. అవేంటో ఒకసారి తెలుసుకుందాం..

    ఇంతకీ దురద ఎందుకొస్తుందంటే..

    మన శరీరంపై ఏదైనా సూక్ష్మక్రిమి లాంటిది వాలినప్పుడు, కదిలినప్పుడు, కరిచినప్పుడు, నడిచినప్పుడు... ఆ ప్రాంతంలో మనకు దురద వస్తుంది. ఆ సమయంలో... వెన్నెముకలోని స్పైనల్ కార్డులో... ఇన్హిబిటరీ న్యూరాన్లు పనిచేస్తాయి. అవి దురదను రప్పిస్తాయి. ఆ ప్రాంతంలో ఏదో సంబంధం లేనిది వచ్చిందని బ్రెయిన్‌కి సమాచారం అందిస్తాయి. దురద వచ్చినప్పుడు గోకడం వల్ల... ఆ ప్రాంతంలో... బయటి నుంచీ వచ్చిన క్రిముల వంటివి, చెల్లా చెదురై, వెళ్లిపోతాయి.

    పెరుగుతో చెక్​ పెట్టండి..

    పెరుగు (curd)లో ఎన్నో ప్రొబయోటిక్ గుణాలుంటాయి. ఇది మంచి బ్యాక్టీరియాను పెంచి.. చెడు బ్యాక్టీరియాను సంహరించడానికి తోడ్పడుతుంది. అంతే కాదు.. పీహెచ్‌ని బ్యాలన్స్ చేయడంలో కూడా ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. అందుకే జననాంగాల వద్ద పెరుగు రుద్దడం వల్ల.. అక్కడున్న బ్యాక్టీరియాను ఇది తగ్గిస్తుంది. తద్వారా దురద కూడా తగ్గుతుంది.

    వేపాకులో ఎన్నో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ గుణాలుంటాయి. ఈ ఆకుల రసాన్ని రుద్దడం వల్ల క్యాండిడా, ఈస్ట్ వంటివి కూడా తొలగిపోతాయి కాబట్టి ఎలాంటి ఇబ్బంది లేకుండా.. దురద రాకుండా ఉంటుంది. దీనికోసం చేయాల్సిందల్లా గిన్నెలో నీళ్లు తీసుకొని అందులో వేపాకులు వేసి మరిగించి.. ఆ నీటితో జననాంగాల భాగాన్ని రోజుకు రెండు సార్లు కడుక్కోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతటి దురద ఉన్నా.. అది రెండు మూడు రోజుల్లో తగ్గిపోతుంది.

    కొబ్బరి నూనె (coconut oil)లో కూడా యాంటీ ఫంగల్ గుణాలు ఉంటాయి. ఇది సామాన్యంగా క్యాండిడా లాంటి ఫంగస్‌కి వ్యతిరేకంగా కూడా పోరాడుతుంది. అందుకే జననాంగాల భాగంలో దురద సమస్య లేకుండా కొబ్బరి నూనెను చర్మానికి అప్లై చేసుకోవాలి. కావాలంటే గోరు వెచ్చగా చేసి కూడా అప్లై చేసుకోవచ్చు. తర్వాత కాసేపటికి నీటితో కడిగేసుకోవచ్చు.

    ఇది కూడా చదవండి: ఈ కలుపు మొక్కతో మగవారిలో లైంగిక పరంగా ఉన్న ఆ సమస్యకు చెక్​ పెట్టొచ్చంట.. ఆ మొక్క ఏంటంటే?


    ఎలా దూరం చేసుకోవాలి..

    టాయిలెట్ ఉపయోగించిన తర్వాత ఆ భాగంలో తడి లేకుండా చూసుకోవాలి. స్వీట్లు తినడం తగ్గించండి. అవసరం ఉన్నప్పుడే యాంటీ బయోటిక్స్ వంటి మందులు ఉపయోగించండి. లేదంటే శరీరంపై ఈస్ట్, బ్యాక్టీరియా పెరిగిపోతుంది. టైట్‌గా ఉండే లోదుస్తులు కాకుండా కాస్త వదులుగా ఉన్నవి.. కాటన్‌తో తయారుచేసినవి ఎంచుకోవడం మంచిది.

    స్విమ్మింగ్‌కి వెళ్లినప్పుడు లేదా జిమ్‌కి వెళ్లినప్పుడు వెంటనే బట్టలు మార్చుకోవాలి. దీనివల్ల దురద ఎక్కువగా ఉండదు. సెంట్లు, స్ప్రేలు, లోషన్లు వంటివన్నీ జననాంగాల భాగంలో ఉపయోగించడం సరికాదు. అంతే కాదు.. సబ్బును కూడా ఉపయోగించకూడదు. ఇవి ఆ ప్రాంతంలో దురద వచ్చేలా చేస్తాయి.

    (Disclaimer: The information and information provided in this article is based on general information. Telugu News 18 does not confirm these. Please contact the relevant expert before implementing them.)

    ఇది కూడా చదవండి:

    గదిలో ఒంటరిగా కూర్చుంటే తలనొప్పి తగ్గుతుందా? మరి నొప్పి తగ్గాలంటే ఇంకేం చేయాలి?

    Published by:Prabhakar Vaddi
    First published: