చాలామందికి తినడానికి సరిగా తిండి (food) కూడా దొరకడంలేదు. ఎక్కువ మంది పోషకాహార లోపంతో బాధ పడుతున్నారు. అయితే మరికొంతమందికి ఎంత తిన్నా ఇమ్యునిటీ (immunity) ఉండటం లేదు. ఇమ్యూనిటీ ఉంటే చాలు ఎలాంటి జబ్బులు రావు. లేకపోతే ప్రతీ చిన్న సమస్యకు శరీరం (body) సహకరించక జలుబు (cold) దగ్గులాంటివి వెంటాడుతుంటాయి. రోగ నిరోధక శక్తి (Immunity system) తగ్గడం వల్ల ఈ సమస్య వస్తోంది. ఇమ్యూనిటీ శరీరంలో ఉంటే శరీరం వ్యాధుల (dieses)తో పోరాడుతుంది. మంచి ఆరోగ్యం (health) కావాలంటే జీవన విధానం, పోషకాహారం ప్రధాన పాత్ర పోషిస్తాయి.
పౌష్టికాహార లోపం..
పౌష్టికాహార లోపం పిల్లలు, ఆడవారిలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తోంది. పౌష్టికాహారం కోసం మనం లక్షలకు లక్షలు ఖర్చుపెట్టాల్సిన పని లేదు. రోజువారీ తినే ఆహారంలోనే ఎక్కువ పోషకాలు ఉన్నవి, ప్రోటీన్స్ ఉన్నవి తింటే మేలు. పౌష్టికాహారం తింటే... అధిక బరువు (weight) లేకుండా ఉండటమే కాదు... కండరాలు (muscles) బలంగా మారతాయి. జుట్టు కూడా ఒత్తుగా పెరుగుతుంది. అందువల్ల ప్రోటీన్స్ (proteins) అధికంగా ఉండే ఆహారాలేంటో చూద్దాం.
డైలీ పాలు..
డైలీ పాలు (milk) తాగడం అలవాటు చేసుకోవాలి.. పాలల్లో ఎన్నో రకాలయిన పోషక పదార్ధాలు ఉంటాయి. క్యాల్షియం ఎక్కువ ఉంటుంది. అలాగే బి -కాంప్లెక్స్ విటమిన్స్ కూడా అధికంగా ఉంటాయి. ఇంకా కోడిగుడ్డు చాలా మంచిది .
ఇది కూడా చదవండి: బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేస్తే ఏమవుతుంది ? అసలు బ్రహ్మ ముహూర్తం ఎప్పుడు ఉంటుంది?
బయో ప్రోటీన్స్ కావాలంటే... ఎగ్స్ తినాల్సిందే. గుడ్ల (eggs)తో రకరకాల వంటలు వండుకోవచ్చు. ఆమ్లెట్లు వేసుకోవచ్చు. ఎగ్స్ కర్రీ రుచికరంగా చేసుకోవచ్చు. ఎగ్స్ శాండ్ విచ్ కూడా ఆరోగ్యదాయకమే. అందువల్ల రోజూ కనీసం రెండు గుడ్లు మీ డైట్‌లో ఉండేలా ప్లాన్ చేసుకోండి. ఇంకా చికెన్, చేపల లో కూడా ప్రోటీన్స్ ఉంటాయి.
బాదాం పప్పులు కూడా శరీరానికి సరిపడా మాంసకృతులను ఇస్తాయి. బాదాం (almonds) పప్పులు రాత్రి పూట నీటిలో నాన బెట్టుకుని ఉదయం తింటే చాలా మంచిది. తాజా కూరగాయల (fresh vegetables)లో కూడా పోషకాలు లభిస్తాయి.. ఐరన్, పొటాషియం, ఫోలిక్ ఆసిడ్, విటమిన్స్ చాలా ఉంటాయి..
ఇది కూడా చదవండి: నీళ్లు ఎక్కువగా తాగితే నిత్య యవ్వనంగా కనిపిస్తారా? ముఖంపై ముడుతలు పోవాలంటే ఏం చేయాలి?
పప్పు (dals) ధాన్యాల్లో కూడా ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటాయి. వారానికి మూడు సార్లు అయిన కందిపప్పు, పెసరపప్పు (dal) తింటూ ఉండాలి.. ఆకుకూరలతో పప్పు చేసుకుని తింటే శరీరానికి మంచిది.
(Disclaimer: The information and information provided in this article is based on general information. Telugu News 18 does not confirm these. Please contact the relevant expert before implementing them.)
ఇవి కూడా చదవండి: తిన్న ఆహారం అరగట్లేదా? అయితే రోజూ ఉదయాన్నే ఇలా చేయండి.. సమస్యను దూరం చేసుకోండి
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Almonds Health Benefits, Health Tips, MILK