IS IT REALLY NEED TO DRINK MILK IF YOU NEED NUTRIENTS THEN WHAT IS THE SITUATION OF THOSE WHO DO NOT DRINK AND WHAT IS BETTER TO TAKE PRV
Health tips: పోషకాలు కావాలంటే పాలే తాగాలా? మరి తాగని వారి పరిస్థితేంటి.. ఏం తీసుకుంటే బెటర్
ప్రతీకాత్మక చిత్రం
పాలు తాగడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మంచిదని వైద్యులు(doctors) సూచిస్తున్నారు. అయితే కొందరికి పాలు అంటే అస్సలు ఇష్టం(few hates milk) ఉండదు. పాలు అంటే చాలు ఆమడ దూరం పారిపోతారు. అటువంటి వాళ్ళు పాలకి బదులుగా ఈ ఆహార పదార్థాలు(food items) తీసుకుంటే కాల్షియం(calcium) అందుతుందని డాక్టర్లు అంటున్నారు. క్యాల్షియం ఆరోగ్యానికి చాలా ముఖ్యం. క్యాల్షియం ఉంటే ఎముకలు(bones) దృఢంగా ఉంటాయి. అయితే పాల ద్వారా కాల్షియం తీసుకోలేకపోతే ఇతర ఆహార పదార్థాల ద్వారా కాల్షియం పొందొచ్చు
ఈ కల్తీ కాలంలో ఆరోగ్యాన్ని(health) కాపాడుకోవడం అంత సులువైన పని కాదు. ఒకపక్క కరోనా వైరస్ నుంచి రక్షించుకోవాలి. మరోవైపు సీజనల్ వ్యాధులను(diseases) ఎదుర్కోవాలి. ఇటువంటి పరిస్థితుల్లో శరీరానికి కావాల్సిన పోషకాలు ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి. అందులో భాగంగానే పాలు(milk) కూడా తీసుకోవాలి. పాలు తాగడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మంచిదని వైద్యులు(doctors) సూచిస్తున్నారు. అయితే కొందరికి పాలు అంటే అస్సలు ఇష్టం(few hates milk) ఉండదు. పాలు అంటే చాలు ఆమడ దూరం పారిపోతారు. అటువంటి వాళ్ళు పాలకి బదులుగా ఈ ఆహార పదార్థాలు(food items) తీసుకుంటే కాల్షియం(calcium) అందుతుందని డాక్టర్లు అంటున్నారు. క్యాల్షియం ఆరోగ్యానికి చాలా ముఖ్యం. క్యాల్షియం ఉంటే ఎముకలు(bones) దృఢంగా ఉంటాయి. అయితే పాల ద్వారా కాల్షియం తీసుకోలేకపోతే ఇతర ఆహార పదార్థాల ద్వారా కాల్షియం పొందొచ్చు. పాలు తాగని వారు ఏం తీసుకోవాలో ఒకసారి తెలుసుకుందాం..
అరటి పండ్లు (banana) ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. తక్షణ శక్తిని ఇస్తాయి. అరటి పండులో ఒక మిల్లీ గ్రాము కాల్షియం మనకి లభిస్తుంది. కాబట్టి పాలు నచ్చని వాళ్ళు అరటి పండ్లు కూడా పాలకు బదులుగా తినొచ్చు. కమల పండ్లలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. అదేవిధంగా ఇతర పండ్లతో పోల్చుకుంటే క్యాల్షియం ఇందులో ఎక్కువగా ఉంటుంది. కాబట్టి పాలు నచ్చని వాళ్ళు కమలా పండ్లను కూడా తినొచ్చు. బీన్స్(beans) ఆరోగ్యానికి చాలా మంచిది. బీన్స్ లో కేవలం క్యాల్షియం మాత్రమే కాదు ప్రోటీన్ కూడా సమృద్ధిగా ఉంటాయి. మీరు బీన్స్ ని సలాడ్స్ వంటి వాటిలో వేసుకుని కూడా తీసుకోవచ్చు.
పాలు తాగని వాళ్ళు పన్నీర్(paneer) కూడా తీసుకోవచ్చు. పన్నీర్ లో క్యాల్షియం సమృద్ధిగా ఉంటుంది. పైగా పన్నీర్ తో వివిధ రకాల రెసిపీస్ చేసుకుని తినొచ్చు. తెల్ల నువ్వులలో కూడా కాల్షియం ఎక్కువగా ఉంటుంది. దీనితో లడ్డూలు వంటివి తయారు చేసుకుని పాలకు బదులుగా తీసుకోవచ్చు. తద్వారా క్యాల్షియం అందుతుంది. అనారోగ్య సమస్యల నుంచి కూడా దూరంగా ఉండచ్చు.
మిగతా వారు మాత్రం పాలు తాగాలి(drink). రోజూ రాత్రి పడుకోబోయే ముందు ఒక గ్లాసు పాలు తాగడం వల్ల మలబద్ధకం, గ్యాస్ట్రిక్ సమస్యలు దూరమవుతాయి. అందుకే రాత్రి సమయంలో(night time) పాలు తాగడం మంచిది. వ్యాధుల బారిన పడకుండా ఉండాలంటే రోగనిరోధక శక్తి అవసరము ఇది పెరగాలంటే రోజూ రాత్రి పడుకోబోయే ముందు ఒక గ్లాసు పాలు తాగడం వల్ల పెరుగుతుంది. నిరోధక శక్తి పెరగడం వల్ల ఎలాంటి వ్యాధులు రాకుండా ఉంటాయి. దీనివల్ల పనులు సక్రమంగా చేసుకోవచ్చు. ఒంట్లో వేడి ఎక్కువగా ఉన్నప్పుడు ఒక గ్లాసు పాలు తాగడం వల్ల ఒళ్ళు చల్లబడుతుంది. అలాగే గొంతు నొప్పి, సమస్యలు ఉన్నా కూడా పరిష్కారమవుతాయి. గొంతు నొప్పి తొందరగా తగ్గాలంటే, వేడిపాలలో మిరియాలు, పసుపు కలుపుకొని తాగడం వల్ల గొంతు నుంచి ఉపశమనం కలుగుతుంది.
Published by:Prabhakar Vaddi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.