హోమ్ /వార్తలు /లైఫ్ స్టైల్ /

Weight loss tips: పాలు తాగితే అధిక బరువును తగ్గించుకోవచ్చా? నిపుణులు ఏమంటున్నారు?

Weight loss tips: పాలు తాగితే అధిక బరువును తగ్గించుకోవచ్చా? నిపుణులు ఏమంటున్నారు?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

నిత్యం నిద్రపట్టక బాధపడే వాళ్ళు రోజూ రాత్రి పడుకోబోయే ముందు గ్లాసెడు పాల (milk)లో తేనెను కలుపుకుని తాగితే కొన్నాళ్లకి కమ్మని నిద్ర (sleep)కు చేరువవుతారు. అయితే పాలు తాగితే బరువు (weight) కూడా తగ్గుతారట. అధిక బరువు ఉన్నవారు కొన్ని ప్రత్యేక పద్దతిలో పాలు తాగితే బరువును కంట్రోల్ (weight control)​లో ఉంచుకోవచ్చట.

ఇంకా చదవండి ...

పాలు (Milk)  శ్రేష్ఠమయిన బలవర్ధక ఆహారము (food). ఇందులో అన్ని రకాలైన పోషక విలువలు ఉన్నాయి. కొద్దిగా విటమిన్ సి, ఇనుము తక్కువ. అన్ని వయసుల (all ages) వారూ తీసుకోదగ్గ ఉత్తమ ఆహార పదార్థం. పాలు తాగటం వల్ల కళ్ళు తేటగా ప్రకాశవంతంగా అవుతాయి. శరీరానికి ఆరోగ్యకరమైన మెరుపు వస్తుంది. శరీరంలోని అవయవాలన్నిటి లోకి సరిపడా శక్తి (energy) చేరుకుంటుంది. నిద్రలేమి (sleeping problems)తో బాధపడే వాళ్ళకు పాలు పరప్రసాదం లాంటివి. నిత్యం నిద్రపట్టక బాధపడే వాళ్ళు రోజూ రాత్రి పడుకోబోయే ముందు గ్లాసెడు పాల (milk)లో తేనెను కలుపుకుని తాగితే కొన్నాళ్లకి కమ్మని నిద్ర (sleep)కు చేరువవుతారు. అయితే పాలు తాగితే బరువు (weight) కూడా తగ్గుతారట. అధిక బరువు ఉన్నవారు కొన్ని ప్రత్యేక పద్దతిలో పాలు తాగితే బరువును కంట్రోల్ (weight control)​లో ఉంచుకోవచ్చట. అదేంటో తెలుసుకుందాం..

డీ విటమిన్​తో పాలు..

పాలు ఆరోగ్యాన్ని (health) ఇస్తాయి. ఇది అందరికీ తెలుసు. పాల వలన బరువు తగ్గడము (weight loss) కూడా సాధ్యమే ... మధ్య వయసులో పాలు తగినంత తాగుతూ, డి-విటమిన్‌ (vitamin) సమృద్ధిగా తీసుకునేవారు బరువు తగ్గుతారని నిరూపించబడింది . ఇజ్రాయిల్ పరిశోధకులు భారీ కాయం (heavy weight) కలిగిన 300 మంది మీద జరిపిన పరిశోధనా ఫలితం ఇది.

వయసు 45-60 మధ్య ఉన్నవారిపై ఈ అధ్యయనం జరిపారు. ప్రతిరోజూ 2 గ్లాసుల పాలు (milk) త్రాగడంతో పాటు పిండి పదార్థాలు ఉన్న ఆహారము తక్కువగా (less food) తీసుకున్న వీరు 2 ఏళ్ళ కాలములో 5.5 కిలోల బరువు తగ్గడము గమనించారు. అదే సమయములో ఇతర పద్ధతుల ద్వారా బరువు తగ్గేందుకు (weight loss) ప్రయత్నించినవారు కేవలము 3 కిలోల బరువు (weight) మాత్రమే తగ్గారు. అందుకే పాలలోని కాల్షియం, విటమిన్‌ డి బరువు తగ్గడంలో కీలక పాత్ర వహిస్తాయని పరిశోధన (researches)ల ద్వారా స్పష్టమైంది.

రక్త ప్రసరణకు..

శరీరంలో రక్తప్రసరణ సరిగా లేని వాళ్ళకు పాలు అద్భుతమైన ఆహారం! పాలు (milk) తాగటంవల్ల కడుపు, ప్రేవులలోని ద్రవాంశం వృద్ధి చెంది, శరీరంలో రక్తప్రసరణ సహజసిద్ధంగా మెరుగుపడుతుంది. రక్త ప్రసరణ సరిగా లేకపోవటంవల్ల చేతులు, పాదాలు చల్లగా ఉంటాయి. రక్తప్రసరణ సజావు స్థితికి చేరుకున్నాక ఇవి మళ్ళీ జవాన్ని పుంజుకొని కొద్ది రోజులకే ఆ వ్యక్తి నవనవలాడే చైతన్యంతో కనిపిస్తాడు. కడుపు (stomach)లో యాసిడ్‌ తయారవుతూ హైపర్‌ ఎసిడిటీతో బాధపడే వాళ్ళకు పాలు మంచి ఆహారం (food). పాలు జీర్ణం కావటానికి యాసిడ్‌ (acid) అధికంగా కావాల్సివస్తుంది. పాలలో ఉండే ఆల్కలైన్‌ని తయారుచేసే పదార్థాల వల్ల శరీరం (body)లోని యాసిడ్‌ స్థితిని ప్రేరేపించే పరిస్థితులు చాలా త్వరగా సాధారణ స్థితికి వచ్చేస్తాయి.

First published:

Tags: Health Tips, MILK, Weight loss

ఉత్తమ కథలు