Health Tips : ఫ్రిజ్‌లో పెట్టిన అరటిపండ్లు తినొచ్చా..

Health Tips | ఫ్రిజ్‌లో పెట్టడం వల్ల అరటిపండ్ల తొక్కరంగు మారుతుందని.. ఇవి తినడానికి అంతగా నచ్చవని చెబుతున్నారు. అందుకే ఫ్రిజ్‌లో పెట్టరని చెబుతున్నారు.

news18-telugu
Updated: June 12, 2019, 12:15 PM IST
Health Tips : ఫ్రిజ్‌లో పెట్టిన అరటిపండ్లు తినొచ్చా..
ఫ్రిజ్‌లో పెట్టిన అరటిపండ్లు తినొచ్చా..
news18-telugu
Updated: June 12, 2019, 12:15 PM IST
చాలా వరకూ అన్నీ ఆహారపదార్థాలను ఫ్రిజ్‌లో పెడుతుంటారు. అలా పెడితే అవి చాలా రోజుల వరకూ తాజాగా ఉంటాయని అంటారు. అయితే, అరటిపండ్ల విషయంలో మాత్రం అలా పెట్టకూడదు అని చెబుతుంటారు. అరటిపండ్లని ఫ్రిజ్‌లో పెట్టి తింటే అనారోగ్య సమస్యలు వస్తాయని కొన్ని వార్తలు షికారు చేస్తున్నాయి. దీనిపై ఆహార నిపుణులని వివరణ కోరగా.. అరటి పండ్లని ఎలా తీసుకున్నా ప్రమాదమేమీ లేదని తేల్చారు. అన్ని పండ్లలానే అరటిపండ్లని ఫ్రిజ్‌లో స్టోర్ చేసుకోవచ్చని తెలిపారు.


అయితే, ఫ్రిజ్‌లో పెట్టడం వల్ల అరటిపండ్ల తొక్కరంగు మారుతుందని.. ఇవి తినడానికి అంతగా నచ్చవని చెబుతున్నారు. అందుకే ఫ్రిజ్‌లో పెట్టరని చెబుతున్నారు. అంతేకానీ, ఫ్రిజ్‌లో పెట్టిన పండ్లు తమ గుణాన్ని ఏమాత్రం కోల్పోవని.. అంతే ఆరోగ్యప్రయోజనాలిస్తాయని నిపుణులు చెబుతున్నారు.



ఇవి కూడా చదవండి..



First published: June 12, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...