వయసులో పెద్దవారైన మహిళలపై ఆకర్షణ సాధారణమేనా?

తమకంటే ఎక్కువ వయసు ఉన్న మహిళలపై మగవాళ్లు, ప్రత్యేకంగా యువకులకు ఆకర్షణ పెరగడం మామూలు విషయమేనని సెక్స్ ఎక్స్‌పర్ట్స్‌ చెబుతున్నారు.

news18-telugu
Updated: November 20, 2020, 8:17 PM IST
వయసులో పెద్దవారైన మహిళలపై ఆకర్షణ సాధారణమేనా?
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
తమకంటే ఎక్కువ వయసు ఉన్న మహిళలపై మగవాళ్లు, ప్రత్యేకంగా యువకులకు ఆకర్షణ పెరగడం మామూలు విషయమేనని సెక్స్ ఎక్స్‌పర్ట్స్‌ చెబుతున్నారు. సాధారణంగా తమకంటే పెద్దవారైన BBW మహిళవైపు మగవాళ్లు ఆకర్షితులవుతారు. BBW అంటే బిగ్ బ్యూటీఫుల్ ఉమెన్ అని అర్థం. దీనికి ఫ్యాటీ ఉమెన్ అని కూడా అర్థం చెబుతారు. కర్వీ, ప్లస్ సైజ్, క్వీన్ సైజ్, హస్కీ వంటి మరోన్నో వివరణల కోసం BBWను వాడతారు.

* కొంతమంది BBW అనేది చాలా శక్తినిచ్చే పదంగా చెప్పుకుంటారు. ఉమెన్ ఎంపవర్‌మెంట్‌లో ఒక భాగంగా దీన్ని గుర్తిస్తారు. మరికొందరు పోర్నోగ్రఫీకి లింక్ చేసి మాట్లాడతారు. లావుగా ఉన్న మహిళలను సెక్సువలైజేషన్ (over sexualisation) చేసి మాట్లాడటానికి BBWను వాడుతూ, ఎంపవర్‌మెంట్‌కు వ్యతిరేక అర్థం చెబుతారు. సానుకూలంగా చూస్తే బాడీ పాజిటివిటీ ఉద్యమం (body positivity movement)లో BBWని ఒక భాగంగా చెప్పుకోవచ్చు. లావుగా ఉన్నవారు అందరిలాగే శృంగారంలో పాల్గొంటారు. వారు కూడా సెక్సీగా ఉంటారు. తమ శరీరాన్ని సెక్సీగా ఉన్నట్లు గుర్తిస్తారు. ప్రజలు ఇలాంటి వారి వైపు ఆకర్షితులయ్యే అవకాశాలు ఉంటాయి. ఆకర్షణీయమైనవి, ఆకర్షణీయం కానివి ఏవో ఎవరూ నిర్వచించలేరు. కాబట్టి BBW మహిళలకు ఆకర్షితులైతే వచ్చే నష్టం ఏమీ లేదు.

Attraction towards elder women, BBW, Sexual relationships,Big Beautiful Woman, Sexualisation of fatty women, Relationships with age gap, Sexual pleasure with older women, Performance anxiety, లైంగిక ఆకర్షణ, బిగ్ బ్యూటీఫుల్ ఉమెన్, పర్ఫామెన్స్ యాంగ్జైటీ, ఫ్యాటీ ఉమెన్, రిలేషన్‌షిప్, లైంగిక సంబంధాలు
ప్రతీకాత్మకచిత్రం


* పెద్దవారితో సంబంధాలు కోరుకుంటారు
వయసులో పెద్దవారితో రిలేషన్‌షిప్‌లో ఉంటడంలో తప్పేం లేదు. వివిధ కారణాల వల్ల మగవాళ్లు తమకంటే వయసులో పెద్దవారైన మహిళలతో లైంగిక ఆనందాన్ని కోరుకుంటారు. వారు లైంగికంగా పరిణతి (sexually mature) చెందుతారని కొంతమంది భావిస్తారు. వారి అవసరాలను వ్యక్తం చేయలేరని, కొత్త రకం లైంగిక ప్రయోగాలకు ఆసక్తి చూపుతారని భావిస్తారు. ఇద్దరికీ సెక్స్‌పై ఒకే రకమైన ఆలోచనలు ఉంటడం, మహిళల నుంచి కూడా సెక్సువల్ పార్టిసిపేషన్ ఉండటం వల్ల లైంగిక చర్యను ప్రారంభించడం, ముందుకు తీసుకెళ్లడం మగవాళ్లకు సులువుగా అనిపిస్తుంది. ఈ ప్రక్రియలో వారు ఎలాంటి ఒత్తిడికీ గురికారు. ఇది మగవాళ్లు సెక్స్‌లో మహిళలను సంతృప్తి పరచడానికి సహాయపడుతుంది.

* వారితో ఒత్తిడి ఉండదు
తమకంటే తక్కువ వయసున్నవారిని శృంగారంలో తృప్తి పరచాలనుకునే మగవాళ్లు పర్ఫామెన్స్ యాంగ్జైటీ (Performance anxiety)కి గురవుతారు. ఇది ఒక రకమైన ఒత్తిడిని కలిగిస్తుంది. కానీ ఎక్కువ వయసు ఉన్న భాగస్వామితో మగవాళ్లు ఇలాంటి ఇబ్బందులను ఎదుర్కోరు. వారు మగవాళ్లపై ఒత్తిడిని తగ్గించే ప్రయత్నం చేస్తారు. శృంగారంలో ఇద్దరూ తృప్తి పొందేలా మార్గనిర్దేశం చేస్తూ ప్రోత్సహిస్తారు. దీంతో ఒత్తిడి దూరమవ్వడంతో పాటు ఇద్దరూ సెక్స్‌ను ఎంజాయ్ చేయవచ్చు. తనకంటే పెద్దవారైన మహిళలతో ఇలాంటి భయాలను, ఆందోళనను సులభంగా పంచుకోగలమని మగవాళ్లు భావిస్తారు.

* భావోద్వేగాలూ ముఖ్యమే
శృంగారం అనేది భావోద్వేగ, మానసిక, శారీరక అంశాలతో ముడిపడి ఉంటుంది. సెక్స్‌లో పాల్గొనే ఇద్దరూ ఎదుటి వారి కోరికలు, అవసరాలను అంచనా వేయగలగాలి. కేవలం సెక్స్‌ కోసమే రిలేషన్‌షిప్‌ను కోరుకుంటున్నారా, లేదా అంతకు మించిన సంబంధాన్ని కోరుకుంటున్నారా అనేది తెలుసుకోవాలి. క్యాజువల్ సెక్స్ వల్ల అనేక సానుకూల ప్రభావాలు ఉన్నాయి. శృంగారంలో పాల్గొనే వారు తమకు కావాల్సిన లేదా కోరుకున్న అనుభూతిని పొందుతారు. దీంతో గర్వంగా, ఉత్సాహంగా ఉంటారు. కానీ దీని వల్ల ప్రతికూలతలు కూడా ఉన్నాయి. విచారం, నిరాశ, గందరగోళం, ఇబ్బంది, అపరాధ భావం, ఒంటరితనం, ఆత్మగౌరవం తగ్గిపోవడం వంటి ఇబ్బందులు శృంగారంలో పాల్గొన్న తర్వాత ఎదురయ్యే అవకాశం ఉంది.

* ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి
సెక్స్ గురించి నిర్ణయాలు తీసుకునేటప్పుడు మానసిక ఆరోగ్యం, ఆత్మగౌరవం, స్వీయ వాస్తవికత వంటి భావాలకు ప్రాధాన్యత ఇవ్వాలి. ఒకరి కంటే ఎక్కువ మంది మహిళలతో లైంగిక సంబంధాలు పెట్టుకోవడం వల్ల భావోద్వేగపరమైన అంశాలపై ఎలాంటి ప్రభావం ఉంటుందో అంచనా వేసుకోవాలి. ఇలాంటి ప్రశ్నలకు మీరే సమాధానం చెప్పుకోగలిగినప్పుడు, ఏం చేయాలో మీకే తెలుస్తుంది. కానీ మీకు ఎదురయ్యే ఆకర్షణలు సాధారణమైనవిగా భావించాలి.

(Article by - Pallavi Barnwal)
Published by: Sumanth Kanukula
First published: November 18, 2020, 12:09 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading