Health tips: తులసి ఆకులను మింగితే మంచిదా.. తింటే మంచిదా? ఆయుర్వేదం ఏం చెబుతోంది?

తులసి ఆకులను నమిలి తినడం వల్ల దంతాలు (teeth) పాడయ్యే (damage) అవకాశం ఉంటుంది.

తులసి ఆకులకు ఎన్నో ఔషధ గుణాలున్నాయి. ఈ ఆకులు (leaves) నాడులకు టానిక్‌లాగా, జ్ఞాపకశక్తిని పెంపొందించేవిగా పనిచేస్తాయి. అయితే తులసి ఆకులను (basil leaf) నమిలి తినకూడదని (don’t eat) చాలామంది చెబుతుంటారు. తులసి ఆకులను నమిలి తినడం వల్ల దంతాలు (teeth) పాడయ్యే (damage) అవకాశం ఉంటుంది.

  • Share this:
    తులసి (Basil) ఆయుర్వేదం (Ayurveda))లో అద్భుతమైన ఔషధ మొక్కగా పరిగణిస్తారు. తులసి అన్ని రోగాలను నయం చేయడానికి శతాబ్దాలుగా ఉపయోగపడుతోంది. జలుబు, తలనొప్పి (headache), పొట్టకు సంబంధించిన వ్యాధులు, వాపులు, గుండె జబ్బులు, విషాహారాలు, మలేరియా (malaria) వంటి చాలా రకాల రుగ్మతలను నయం చేయడానికి తులసి వాడుతారు.   రోజూ తులసి ఆకులను తీసుకోవడం ద్వారా శరీరంలోని విషం (poison in body) బయటకు వెళ్తుంది. దీనితో పాటు శరీర ఉష్ణోగ్రతను (body temperature) నియంత్రించడానికి కూడా తులసి పనిచేస్తుంది. తులసి ఆకులకు ఎన్నో ఔషధ గుణాలున్నాయి. ఈ ఆకులు (leaves) నాడులకు టానిక్‌లాగా, జ్ఞాపకశక్తిని పెంపొందించేవిగా పనిచేస్తాయి. అయితే తులసి ఆకులను (basil leaf) నమిలి తినకూడదని (don’t eat) చాలామంది చెబుతుంటారు. తులసి ఆకులను నమిలి తినడం వల్ల దంతాలు (teeth) పాడయ్యే (damage) అవకాశం ఉంటుంది.

    మింగితేనే మంచిది..

    రోజూ రాత్రి సమయంలో నాలుగు నుంచి ఐదు తులసి ఆకులను కడిగి నీటి (water)తో పాటు నానబెట్టాలి. పరగడుపున ఈ ఆకులను నీటితో పాటు మింగితే మంచిది. ఆకులలో నీటిని మరిగించి టీ లాగా తాగిన శరీరానికి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. పాదరసం, ఐరన్‌ తులసి (Tulasi) ఆకులలో ఎక్కువగా ఉంటాయనే సంగతి తెలిసిందే. తులసి ఆకులను నమిలితే ఈ రెండు విడుదలయ్యే అవకాశాలు ఉంటాయి. తులసి ఆకుల వల్ల దంతాలు పాలిపోయే అవకాశం కూడా ఉన్న నేపథ్యంలో తులసి ఆకులను నమిలి తినకూడదు.

    తులసి ఆకులను నమిలి తింటే పంటిపై ఎనామిల్ పొర దెబ్బ తినే అవకాశం ఉంటుంది. తులసి ఆకులను డైరెక్ట్ గా మింగడంతో పాటు తులసి ఆకుల రసాన్ని నోటి పూతలకు నివారిణిగా వినియోగించడం మంచిది. తులసి ఆకులను ప్రతిరోజూ తీసుకునే వాళ్లు తప్పనిసరిగా తగిన జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. అనేక ఆరోగ్య సమస్యలకు చెక్ పెట్టడంలో తులసి ఉపయోగపడుతుందనే విషయం తెలిసిందే.

    ఇది కూడా చదవండి: పాలు తాగితే అధిక బరువును తగ్గించుకోవచ్చా? నిపుణులు ఏమంటున్నారు?

    తులసి వల్ల లాభాలు..

    దగ్గు, జలుబు, శ్వాస సంబంధిత సమస్యలకు చెక్ పెట్టడంలో తులసి ఉపయోగపడుతుంది. చెవిపోటు బాధలకు నివారిణిగా తులసి ఉపయోగపడుతుంది. తులసి జీర్ణశక్తితో పాటు శరీర శక్తిని కూడా పెంచుతుంది. తులసి ఆకుల్ని పలురకాల జ్వరాల్లో ఉపశమనానికి ఉపయోగించుకోవచ్చు. వర్షాకాలంలో మలేరియా, డెంగ్యూ జ్వరం వ్యాప్తి తీవ్రంగా ఉన్నప్పుడు లేత తులసి ఆకుల్ని నీళ్లలో వేసి మరిగించి తాగితే (drink) ఈ రకం జ్వరాల నుంచి మంచి ఉపశమనం ఉంటుంది. తులసి ఆకుల్ని నోట్లో (mouth) పెట్టుకుని నమలటం వల్ల జలుబు, ఫ్లూ నుంచి ఉపశమనం లభిస్తుంది. తులసి ఆకులతో మరిగించిన నీళ్లను తాగితే గొంతులో గరగర నుంచి ఉపశమనం లభిస్తుంది.

    (Disclaimer: The information and information provided in this article is based on general information. Telugu News 18 does not confirm these. Please contact the relevant expert before implementing them.)


    ఇది కూడా చదవండి: గదిలో ఒంటరిగా కూర్చుంటే తలనొప్పి తగ్గుతుందా? మరి నొప్పి తగ్గాలంటే ఇంకేం చేయాలి?

    Published by:Prabhakar Vaddi
    First published: