Women problems: నెలసరి సమయంలో టీ తాగితే మంచిదేనా?  ఆ సమయంలో ఎలాంటి ఆహారం బెటర్?

ప్రతీకాత్మక చిత్రం

పీరియడ్స్ సాధారణంగా మహిళలలో (women) అన్ బాలన్స్డ్  (Unbalanced) గా వస్తుంటాయి. అలాంటప్పుడు ఇలాంటి విపరీతమైన బాధలకు గురి అవ్వాల్సి ఉంటుంది. పీరియడ్స్​ సమయంలో పానీయాలు తాగేటపుడు జాగ్రత్త అవసరం.

 • Share this:
  పీరియడ్స్​ (periods). ఇవి వచ్చినపుడు మహిళల్లో (women) మానసికంగా, శారీరకంగా ఎన్నో మార్పులు ఉంటాయి. కొంత మందికి శరీరం అలసిపోయినట్లుగా ఉండే.. మరికొంత మందికి పొట్ట ఉబ్బరం, క్రాంప్స్, బ్యాక్ పెయిన్ (back pain), కాళ్ళ నొప్పులు (leg pain), వికారం వంటివన్నీ ఉంటాయి. అమ్మాయిలకు (girls) ఉండే బంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతి అమ్మాయి పిరియడ్స్‌ని ఎంతగా ఇష్టపడదో.. అవి ఆలస్యమైతే వాటికోసం అంతే వేచి చూస్తుంది. కొన్నిసార్లు పీరియడ్స్​ మిస్  అవ్వడం లేదా ఆలస్యమవ్వడం (late) ఆడవారికి ఎంతో బాధను కలిగిస్తుంది. పీరియడ్స్​ రావడం కంటే అవి ఎప్పుడొస్తాయో అని వేచి చూడడం చాలామంది అమ్మాయిలకు నచ్చని విషయం.

  ఇది కూడా చదవండి: బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేస్తే ఏమవుతుంది ? అసలు బ్రహ్మ ముహూర్తం ఎప్పుడు ఉంటుంది?

  ఎలాంటి ఆహారం బెటర్​..

  పీరియడ్స్ సాధారణంగా మహిళలలో (women) అన్ బాలన్స్డ్  (Unbalanced) గా వస్తుంటాయి. అలాంటప్పుడు ఇలాంటి విపరీతమైన బాధలకు గురి అవ్వాల్సి ఉంటుంది. పీరియడ్స్ (periods) వచ్చే రెండు వారాల ముందు నువ్వులు, బెల్లం బాగా మెత్తగా చేసి అల్పాహారం (breakfast) తిన్న తర్వాత తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల పీరియడ్స్ టైం లో రక్తహీనత , కడుపు నొప్పి (stomach pain) రాకుండా నివారిస్తుంది. అంతేకాకుండా కాల్షియం కూడా శరీరానికి సమృద్దిగా లభిస్తుంది.

  Tea కి దూరం..

  నెలసరి సమయంలో కెఫిన్, టీ (tea) లాంటి పానీయాలకు దూరంగా ఉంటే మరీ మంచిది. అంతగా తాగాలని అనిపించినప్పుడు గ్రీన్ టీ (green tea) లాంటివి తాగితే సరిపోతుంది. రుతుస్రావం సమయంలో వచ్చే కడుపు నొప్పి భరించలేక మహిళలు నరకాన్ని చూస్తుంటారు. అయితే అటువంటి నొప్పిని తగ్గించడానికి అల్లం టీ (ginger tea) అద్భుతంగా పనిచేస్తుంది. అంతేకాదు, అల్లం పొట్ట ఉబ్బరాన్ని కూడా తగ్గిస్తుంది. అలాగే ఒంటిలో వేడి పుట్టేలా చేసి.. మానసిక స్థితిని మెరుగు పరుస్తుంది అంతేకాకుండా నిత్యం పండ్ల రసాలు తాగడం అలవాటు చేసుకోవాలి. రోజువారీ వ్యాయామం (exercise) చేయడం తప్పనిసరిగా చేసుకోవడం వల్ల నెలసరి సమయంలో వచ్చే సమస్యల నుంచి విముక్తి పొందవచ్చు.

  ఇది కూడా చదవండి: నీళ్లు ఎక్కువగా తాగితే నిత్య యవ్వనంగా కనిపిస్తారా? ముఖంపై ముడుతలు పోవాలంటే ఏం చేయాలి?

  దాల్చిన చెక్కను దోరగా వేపి, పొడి చేసుకుని గ్లాసు పాల (milk)లో కలిపి నిత్యం తాగడం వల్ల చికాకు వంటి సమస్యలను దూరం చేసుకోవచ్చు. అంతేకాకుండా విపరీతమైన కడుపు నొప్పి (stomach pain) వస్తుంటే, కడుపు పై భాగంలో కొబ్బరి నూనెతో మర్దన చేసిన కొంచెం ఉపశమనం కలుగుతుంది. దీంతోపాటు ఒక గ్లాసు మంచి నీటిలో నాలుగు టేబుల్ స్పూన్ల చక్కర (sugar) వేసి తాగినా కూడా ఫలితం ఉంటుంది.

  (Disclaimer: The information and information provided in this article is based on general information. Telugu News 18 does not confirm these. Please contact the relevant expert before implementing them.)
  Published by:Prabhakar Vaddi
  First published: