హోమ్ /వార్తలు /లైఫ్ స్టైల్ /

Health tips: ఉదయం బ్రేక్​ఫాస్ట్​ చేసి టీ తాగితే బెటరా? టీ తాగి బ్రేక్​ఫాస్ట్​ చేస్తే బెటరా?

Health tips: ఉదయం బ్రేక్​ఫాస్ట్​ చేసి టీ తాగితే బెటరా? టీ తాగి బ్రేక్​ఫాస్ట్​ చేస్తే బెటరా?

వేడినీరు తాగడం వల్ల అజీర్తి సమస్య తొలగిపోయి జీర్ణశక్తి మెరుగుపడుతుంది. వేడి నీటిని తాగడం వల్ల మలబద్ధకం సమస్య దూరమవుతుంది. అందువల్ల కడుపు లేదా జీర్ణవ్యవస్థకు సంబంధించిన ఏదైనా సమస్య ఉంటే, వేడి నీటి వాడకం చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

వేడినీరు తాగడం వల్ల అజీర్తి సమస్య తొలగిపోయి జీర్ణశక్తి మెరుగుపడుతుంది. వేడి నీటిని తాగడం వల్ల మలబద్ధకం సమస్య దూరమవుతుంది. అందువల్ల కడుపు లేదా జీర్ణవ్యవస్థకు సంబంధించిన ఏదైనా సమస్య ఉంటే, వేడి నీటి వాడకం చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

ఉదయం టీ తాగే అలవాటు అయితే తప్పక ఉంటుంది. మీరంతా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే... ఉదయం ఖాళీ కడుపుతో టీ తాగడం అంత మంచిది కాదంటా.. అయితే ఉదయం లేవగానే టీ లేదా కాఫీ (Coffee) తాగనిదే.. మనలో చాలామందికి అస్సలు బుర్ర పనిచేయదు.

  టీ (tea). చాలామందికి ఉత్తేజనిచ్చేది. శరీరంలో చల్లదనం (coolness) ఎక్కువైనపుడు వేడి కోసం టీని ఆశ్రయిస్తారు జనం. అంతేకాకుండా స్నేహితులతో అలా సరదాగా బయటికి వెళ్లినా.. సాయంత్రం వేళ వేడిగా ఏదైనా తాగాలనిపించినా మొదట గుర్తొచ్చేది టీ (tea). అయితే వీళ్లందిరిలో ఉదయం టీ తాగే అలవాటు అయితే తప్పక ఉంటుంది. మీరంతా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే... ఉదయం ఖాళీ కడుపుతో టీ తాగడం అంత మంచిది కాదంటా.. అయితే ఉదయం లేవగానే టీ లేదా కాఫీ (Coffee) తాగనిదే.. మనలో చాలామందికి అస్సలు బుర్ర పనిచేయదు. బెడ్ కాఫీతో రోజును ప్రారంభించేవారు కూడా ఎందరో ఉన్నారు. తెల్లవారు జామునే ఛాయ్ (chai) లేదా కాఫీని సేవించడం వల్ల.. రోజును ఫ్రెష్‌గా ప్రారంభించే వీలుంటుందనేది వారి ఫీలింగ్. మరి రోజూ చాయ్​ తాగనిదే గడవదే అంటే మాత్రం.. మీకూ ఐడియా ఉంది. కొన్ని జాగ్రత్తలు పాటిస్తే ఈ బాధ నుంచి తప్పించుకోవచ్చు..

  అసలు ఏంటి సమస్యంటే..

  రాత్రి నుంచి (from night onwards) ఏమీ తినకుండా.. ఉదయాన్నే వేరే ఏదీ తీసుకోకుండా టీ లేదా కాఫీ తాగడం వల్ల.. మీ పేగులపైనా ప్రభావం పడుతుంది. దీనివల్ల మీ ఆకలి (hunger) తగ్గిపోవడంతో పాటు.. జీర్ణ ప్రక్రియ (digestive system) కూడా నెమ్మదిగా మారుతుంది. టీ లేదా కాఫీని పరగడుపున తీసుకోవడం వల్ల కడుపు నొప్పి, గ్యాస్ (gas) సమస్యలు ఎదురవుతాయి.

  మంచి బ్రేక్​ఫాస్ట్​ బెటర్​..

  ఉదయాన్నే తీసుకునే బ్రేక్ ఫాస్ట్ (breakfast)కాస్త పోషక భరితమైనదైతే.. శరీరానికి తక్షణ శక్తి అంది యాక్టివ్‌గా ఉండే వీలుంటుంది. కావాలంటే ఆ తర్వాత టీ (tea) తాగవచ్చు. అయితే ఎంత ఇష్టమైనా సరే.. టీ, కాఫీల సంఖ్యను కేవలం ఒకటి లేదా రెండు కప్పులకు మాత్రమే పరిమితం చేయాలి. ఒకవేళ అంతకంటే ఎక్కువ టీ తాగాలని పిస్తే మామూలు టీ బదులు గ్రీన్ టీ, స్పైసీ టీ వంటివి ప్రయత్నించవచ్చు.

  ఇది కూడా చదవండి: ఈ కలుపు మొక్కతో మగవారిలో లైంగిక పరంగా ఉన్న ఆ సమస్యకు చెక్​ పెట్టొచ్చంట.. ఆ మొక్క ఏంటంటే?

  పంటి నొప్పుల రావచ్చు..

  ఉదయాన్నే టీ లేదా కాఫీ తాగడం వల్ల మీరు రోజంతా పనిచేయకపోయినా.. అలిసిపోయిన ఫీలింగ్ కలుగుతుంది. ఉదయాన్నే బ్రష్ చేయకుండా టీ, కాఫీ తాగేవారికి.. పళ్లల్లో పిప్పి, పంటి నొప్పి (teeth pain) వంటి సమస్యలు ఎక్కువగా వస్తుంటాయి.

  ఇలా బయటపడొచ్చు..

  మీ రొటీన్‌లో కొన్ని మార్పులు చేసుకోవడం వల్ల.. టీ లేదా కాఫీ అలవాటును మీ ఆరోగ్యానికి హానికరంగా మారకుండా చూసుకోవచ్చు. ఉదయం లేవగానే టీ లేదా కాఫీ తాగాలనిపిస్తే దానికి బదులుగా.. అంతే వేడిగా ఉన్న నీటిని తీసుకోండి. ఆ నీటిలో డ్రైఫ్రూట్స్ వంటివి నానబెట్టుకొని.. నీళ్లు తాగి వాటిని తినడం మరింత మంచిది. ఆ తర్వాత బ్రేక్ ఫాస్ట్ చేయండి.

  (Disclaimer: The information and information provided in this article is based on general information. Telugu News 18 does not confirm these. Please contact the relevant expert before implementing them.)

  ఇవి కూడా చదవండి:

  గదిలో ఒంటరిగా కూర్చుంటే తలనొప్పి తగ్గుతుందా? మరి నొప్పి తగ్గాలంటే ఇంకేం చేయాలి?


  శరీరం నుంచి దుర్వాసన అధికంగా వస్తుందా? అయితే ఈ చిట్కాలతో సమస్య నుంచి బయటపడండి

  Published by:Prabhakar Vaddi
  First published:

  Tags: Health Tips, Life Style, Tea, Telugu news

  ఉత్తమ కథలు