గే, స్వలింగ సంపర్కులను ప్రతీ క్షణం వెంటాడే డౌట్.. మీ భాగస్వామి అలాంటి కండీషన్ పెడితే..

ప్రతీకాత్మక చిత్రం

తనకు తాను గే, స్వలింగ సంపర్కుడు అని చెప్పుకోకుండా, సీక్రెట్ గా ఉండే వ్యక్తితో డేటింగ్ చేయడం మంచిదేనా? గే, స్వలింగ సంపర్కులు ఎవరైనా అలాంటి వ్యక్తితో బాహ్య ప్రపంచంలో డేటింగ్ చేయొచ్చా?

 • Share this:
  ప్రశ్న: తనకు తాను గే, స్వలింగ సంపర్కుడు అని చెప్పుకోకుండా, సీక్రెట్ గా ఉండే వ్యక్తితో డేటింగ్ చేయడం మంచిదేనా? గే, స్వలింగ సంపర్కులు ఎవరైనా అలాంటి వ్యక్తితో బాహ్య ప్రపంచంలో డేటింగ్ చేయొచ్చా? ఈ బంధం వల్ల భవిష్యత్తులో మానసికంగా వారిని బ్లాక్ మెయిల్ కు దారితీసే అవకాశాలు ఉన్నాయా..?

  సమాధానం: మీరు గే కానీ, స్వలింగ సంపర్కులు కానీ అయితే ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకోవడం అత్యవసరం. కొందరు తమను తాము గే అనీ, స్వలింగ సంపర్కుడనీ బయటకు చెప్పుకోవడానికి ఇష్టపడరు. అయితే అలాంటి వ్యక్తుల్లో కొందరు గే, స్వలింగసంపర్కులతో డేటింగ్ చేస్తుంటారు. అయితే ఆ డేటింగ్ కేవలం నాలుగు గోడల మధ్యే పరిమితం కాదు. బయట బాహ్య ప్రపంచంలో కూడా డేటింగ్ చేసేలా కొందరు గే లతో డీల్ కుదుర్చుకుంటుంటారు. అలాంటి వాళ్లతో డేటింగ్ చేయడం మంచిదేనా? భవిష్యత్తులో ఇబ్బందులు రావా? అన్న సందేహం చాలా మంది గే, స్వలింగ సంపర్కుల్లో కలుగుతుంది. అయితే దీనికి సమాధానం తెలియాలంటే మొదటగా కొన్ని ప్రశ్నలను మీకు మీరే వేసుకోవాలి. నా భాగస్వామి కూడా గే, స్వలింగ సంపర్కుడే అని బయటకు ఎందుకు తెలియాలి? తెలియాల్సిన అవసరం ఉందా? అసలు అతడు తనను తాను గే, స్వలింగ సంపర్కుడు అని చెప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నాడా? లేదా నేను కోరినందువల్లనే నాతో డేటింగ్ చేస్తున్నాడా.? ముందస్తు ఒప్పందంతో డేటింగ్ చేయడం వల్ల తప్పు చేస్తున్నానా? అతడిని పూర్తిగా నమ్మొచ్చా? అతడు ఎందువల్ల ఈ కండీషన్ పెట్టినట్టు? మా మధ్య జరిగే శృంగార కార్యక్రమం భవిష్యత్తులో నన్ను బ్లాక్ మెయిల్ చేయడానికి, బెదిరించడానికి ఉపయోగపడుతుందా? అన్న ప్రశ్నలకు ముందుగా మీరు సమాధానం వెతుక్కోవాలి. ఆ తర్వాతే ఒక అంతిమ నిర్ణయానికి రావాలి?

  ఇన్ని ప్రశ్నలను చూసి మీరు భయపడిపోయి ఉంటారు. కానీ ఎవరితోనైనా, అది కూడా తన గురించి తాను బయటకు చెప్పుకోని వ్యక్తితో డేటింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవడం మంచిదే కదా. ఇవేమీ చిన్న చిన్న ప్రశ్నలు కావు. రైటో రాంగో సెలెక్ట్ చేసుకునేవి అసలే కాదు. మీ మధ్య ఉన్న బంధం గురించి, భవిష్యత్తులో దారితీయబోయే సంఘటనల గురించిన ప్రశ్నలు. ఈ ప్రశ్నలే మీ మధ్య ఎంతటి బలమైన బంధం ఉందో తెలియజేస్తుంది. ఆయా వ్యక్తుల సీక్రెట్ ను బయటపెట్టడం కూడా మంచిది కాదు. అలా చేస్తే కొన్ని ఊహించని సంఘటనలు జరిగి బంధం చెడిపోయి, పెను ప్రమాదకర సంఘటనలకు దారితీయొచ్చు. అతడు మీ బంధాన్ని బ్లాక్ మెయిల్ కే వాడుకుంటాడన్న అనుమానం ఉంటే, పరస్పరం గౌరవం ఏమాత్రం ఉండదు. మీ పట్ల అతడు ఎలాంటి భావనతో ఉంటాడో, మీరు కూడా అతడి పట్ల అదే భావనతో ఉంటారు.

  తన గురించి సీక్రెట్ ను దాచకుండా, తన సెక్సువాలిటీ గురించి బయట పెట్టుకున్న వారితో డేటింగ్ చేయడం కూడా కొన్నిసార్లు మంచిదే. అయితే మీ గురించి మీరు బయటపడ్డారా? లేదా? అన్నది కూడా చాలా ముఖ్యం. అయితే దీని గురించి అంతిమ నిర్ణయం తీసుకునే ముందు ఇద్దరూ కలిసి మాట్లాడుకోండి. ప్రస్తుతం మీమీ పరిస్థితులు ఏంటి? డేటింగ్ లో ఎక్కడకు వెళ్లాలని అనుకుంటున్నారు? ఎంతకాలం, ఎంత దూరం మీ జీవిత ప్రయాణాన్ని కొనసాగించాలనుకుంటున్నారు? హృదయం నుంచి వచ్చే మాటలతో మాట్లాడుకుంటే అన్ని అనుమానాలు తీరిపోతాయి.

  - Pallavi Barnwal

  Published by:Hasaan Kandula
  First published: