High-Protein Diet: ప్రోటీన్స్ ఉండే ఆహారం ఎక్కువగా తినవచ్చా? తింటే ఏమవుతుంది?

High-Protein Diet : మనకు కార్బోహైడ్రేట్స్ (పిండి పదార్థాలు) ఎంత ముఖ్యమో... ప్రోటీన్స్ (మాంసకృత్తులు) కూడా అంతే అవసరం. ప్రోటీన్స్ ప్రయోజనాలేంటో తెలుసుకుందాం.

news18-telugu
Updated: August 28, 2020, 3:33 AM IST
High-Protein Diet: ప్రోటీన్స్ ఉండే ఆహారం ఎక్కువగా తినవచ్చా? తింటే ఏమవుతుంది?
Health : ప్రోటీన్స్ ఉండే ఆహారం ఎక్కువగా తినవచ్చా? తింటే ఏమవుతుంది?
  • Share this:
High-Protein Diet: మనం చురుకుగా, ఆరోగ్యంగా, చలాకీగా, ఉత్సాహంగా ఉండాలంటే... ప్రోటీన్స్ ఉండే ఆహారం తీసుకోవాలి. మన శరీరం సరిగా పనిచెయ్యాలంటే... మనకు మాంసకృత్తులు తప్పనిసరిగా కావాలి. ప్రోటీన్స్ మనకు కావాల్సిన ఎనర్జీని ఇస్తాయి. మన కండరాల్ని బలంగా చేస్తాయి. ప్రోటీన్స్ మన చర్మం, జుట్టుకి కూడా ఎంతో అవసరం. అందువల్ల ఎవరైనా సరే ప్రోటీన్స్ ఉండే ఆహారం ఎక్కువగా తీసుకోవాలి. ఎంత వీలైతే అంత ఎక్కువగా తీసుకోవాలి. ఒక్కోసారి డాక్టర్లు చెప్పేదాని కంటే ఎక్కువే తీసుకుంటారు కూడా. మరి అధికంగా తీసుకునే ప్రోటీన్స్ మనకు కలిసొస్తాయా? అంటే అన్నిసార్లూ కలిసిరావన్నదే ఆన్సర్. అవసరమైన దానికంటే ఎక్కువ ప్రోటీన్స్ తీసుకుంటే వాటివల్ల అందరికీ ఎక్కువ ప్రయోజనాలు కలగట్లేదని పర్డ్యూ యూనివర్శిటీ సైంటిస్టుల పరిశోధనలో తేలింది. బరువు తగ్గేందుకు గట్టిగా ప్రయత్నించేవాళ్లు, కండరాల్ని పెంచుకోవాలి అనుకునేవాళ్లకు మాత్రమే ఎక్కువ ప్రోటీన్స్ ఉండే ఆహారం సెట్ అవుతుంది. కొంతమంది ప్రత్యేకించి వర్కవుట్స్ చేస్తారు. బలంగా ఉండేందుకు ప్రత్యేక ట్రైనింగ్ చేసుకుంటారు. వాళ్లు ఎక్కువ ప్రోటీన్స్ ఉన్న ఆహారం తీసుకోవచ్చు. పర్డ్యూ వర్శిటీ సైంటిస్టులు... 981 మంది విద్యార్థులపై పరిశోధన చేశారు. వాళ్ల ఆరోగ్యం, తీసుకునే ప్రోటీన్స్, బరువు తగ్గడం, వ్యాయామం వంటి అంశాల్ని లెక్కలోకి తీసుకున్నారు. ఈ వివరాల్ని అడ్వాన్సెస్ ఇన్ న్యూట్రిషన్‌లో ప్రచురించారు.

పాలు, గుడ్లు, మాంసం, గింజలు, తృణధాన్యాల్లో ఎక్కువగా ప్రోటీన్స్ ఉంటాయి. కావాల్సినదానికంటే ఎక్కువ ప్రోటీన్స్ తీసుకుంటే... అవి బాడీలో అలాగే ఉంటాయి. వాటిని కరిగించుకునేందుకు వర్కవుట్స్ చెయ్యాల్సి ఉంటుంది. అందువల్ల ఎక్కువ ప్రోటీన్స్ తీసుకోవడం మంచిది కాదు. అధిక బరువు వల్ల అన్నీ ఇబ్బందులే కాబట్టి... ప్రోటీన్స్ ఎంత అవసరమో అంతే తీసుకుంటూ... బరువు బ్యాలెన్సింగ్‌గా ఉండేలా చేసుకోవాలి.

సపోజ్ కేజీ బాడీకి ఒక రోజుకి 0.8 గ్రాముల ప్రోటీన్స్ అవసరం. పది కేజీల బరువు ఉంటే... రోజుకు 8 గ్రాముల ప్రోటీన్స్ అవసరం. 50 కేజీల బరువు ఉంటే... రోజూ 40 గ్రాముల ప్రోటీన్స్ తీసుకోవాలి. అంతకంటే ఎక్కువ ప్రోటీన్స్ తీసుకుంటే... అధికబరువు సమస్య మొదలవుతుంది.
Published by: Krishna Kumar N
First published: August 28, 2020, 3:25 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading