హోమ్ /వార్తలు /లైఫ్ స్టైల్ /

Breakfast: ఉదయం బ్రష్​ చేయకుండా బ్రేక్​ఫాస్ట్ గానీ టీ గానీ తాగితే ఏమవుతుంది? 

Breakfast: ఉదయం బ్రష్​ చేయకుండా బ్రేక్​ఫాస్ట్ గానీ టీ గానీ తాగితే ఏమవుతుంది? 

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

చాలామంది బ్ర‌ష్ చేయకుండా బ్రేక్ ఫాస్ట్(break fast) చేసేస్తారు. టీ తాగుతారు. బద్దకం అలాంటిది మరి. ఇంతకీ అలా చేయడం కరెక్టేనా?

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

    ఉద‌యం (Morning) అందరికీ ఏదో ఒకటి తినడం అలవాటు. నిద్ర లేవ‌గానే చాలా మంది కాల‌కృత్యాలు తీర్చుకుని తినడానికి ముందు బ్ర‌ష్(brush) చేసుకుంటారు. దంతాల‌ను(teeth) తోముకుంటారు. అయితే కొంద‌రు మాత్రం నిద్ర లేవ‌గానే బెడ్ టీ లేదా కాఫీ(coffee) తాగుతారు. బ్రేక్ ఫాస్ట్ (అల్పాహారం) సరిగ్గా చేస్తే రోజాంతా యాక్టీవ్ గా ఉంటాం అనేది అందరికి తెలిసిన విషయమే. అయితే చాలామంది బ్ర‌ష్ చేయకుండా బ్రేక్ ఫాస్ట్(break fast) చేసేస్తారు. బద్దకం అలాంటిది మరి. ఈ కరోనా కారణంగా పని తక్కువై బద్దకం మరీ పెరిగిపోయింది. ఇలా చేయ‌డం వ‌ల్ల తీవ్ర‌మైన వ్యాధులు(diseases) వ‌స్తాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. నోటి దుర్వాస‌న(bad smell) స‌మ‌స్య‌.. వచ్చే అవకాశం ఉందట. దీన్నే హ‌లిటోసిస్ అని అంటారు. ఇది ప్ర‌పంచ వ్యాప్తంగా చాలా మందిని ఇబ్బందుల‌కు గురి చేస్తోందట. నోటి శుభ్ర‌త(clean) లేక‌పోవ‌డం వ‌ల్ల ఇది వ‌స్తుంది. రోజంతా మ‌నం తినే ఆహారాలు(food) నోట్లో ఎంతో కొంత భాగం ఉంటాయి. అవి ఎక్కువ స‌మ‌యం గ‌డిచే కొద్దీ కుళ్లిపోతాయి. దీంతో నోట్లో బాక్టీరియా త‌యార‌వుతుంది. ఫ‌లితంగా నోటి దుర్వాస‌న వ‌స్తుంది.

    నోట్లో బాక్టీరియా..

    దంతాల‌ను తోముకోకపోతే నోట్లో(mouth) బాక్టీరియా పెరిగిపోతుంది. దీంతో స‌మ‌స్య ఇంకా తీవ్ర‌త‌రం అవుతుంది. నోట్లో బాక్టీరియాను అలాగే పెట్టుకుని ఉద‌యం బెడ్ టీ, కాఫీ ల‌ను తాగ‌డం మంచిది కాదు. కొంద‌రు ఆహారం(food) కూడా తింటారు. అది ఇంకా చేటు చేస్తుంది. అందువ‌ల్ల ఉద‌యం క‌చ్చితంగా దంతాల‌ను తోముకోవాలి. త‌రువాతే ఆహారాల‌ను లేదా టీ, కాఫీ వంటివి తీసుకోవాలి. నోటి శుభ్రత లేక‌పోతే దంతాలు క్షీణిస్తాయి. పుచ్చిపోతాయి. దీంతో దంతాల‌ను తీసేయాల్సి(remove) వ‌స్తుంది. చిగుళ్ల స‌మ‌స్య‌లు వ‌స్తాయి. దంతాలు బ‌ల‌హీనంగా(weak) మారుతాయి. క‌నుక దంతాల‌ను రోజూ తోముకోవాలి. ఉద‌యం, రాత్రి భోజ‌నం త‌రువాత దంతాల‌ను తోముకుంటే ఆరోగ్యంగా ఉంచుకోవ‌చ్చు.

    టీ లేదా కాఫీ తాగడం..

    ఉదయాన్నే టీ లేదా కాఫీ తాగడం వల్ల మీరు రోజంతా పనిచేయకపోయినా.. అలిసిపోయిన ఫీలింగ్ కలుగుతుంది. ఉదయాన్నే బ్రష్ చేయకుండా టీ, కాఫీ తాగేవారికి.. పళ్లల్లో పిప్పి, పంటి నొప్పి (teeth pain) వంటి సమస్యలు ఎక్కువగా వస్తుంటాయి.

    మరి ఉదయం ఏం తినాలి..

    నానబెట్టిన వేరుశెనగను అల్పాహారం ముందు తినాలి. వేరుశెనగ(Peanut) బరువు తగ్గడం ప్రయోజనాలతో సంబంధం కలిగి ఉంటుంది. వేరుశెనగలో కేలరీలు అధికంగా ఉంటాయి కాబట్టి అతిగా తినకండి. కానీ సమతుల్య ఆహారంలో భాగంగా వీటిని మితంగా తినడం వల్ల బరువు తగ్గవచ్చు మరియు మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఏదైనా పదార్ధం అధికంగా తినటం శరీరానికి హాని కలిగిస్తుంది. వేరుశెనగ విషయంలో కూడా ఇదే పరిస్థితి. వేరుశెనగ అధికంగా తీసుకుంటే గుండెల్లో మంట మరియు గ్యాస్ సమస్యలకు దారితీస్తుంది.

    వేరుశెనగ చాలా మందిలో అలెర్జీని కలిగిస్తుంది. కాబట్టి అలెర్జీ ఉన్నవారు వేరుశెనగ వాడకూడదు. వేరుశనగ మీ కొలెస్ట్రాల్‌ను నియంత్రిస్తుంది. కొలెస్ట్రాల్ సంబంధిత పిత్తాశయ రాళ్లను నియంత్రించడానికి శనగపిండి సహాయపడుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. తక్కువ గ్లైసెమిక్ సూచిక కలిగిన వేరుశెనగ మధుమేహ వ్యాధిగ్రస్తులకు కూడా మంచిది. కానీ ఎక్కువ శనగపిండి తినడం వల్ల శక్తి అధికంగా ఉంటుంది, రక్తంలో చక్కెర స్థాయి అధికంగా ఉంటుంది

    Published by:Prabhakar Vaddi
    First published:

    Tags: Breakfast, Coffee, Tea, Teeth

    ఉత్తమ కథలు