Health tips: పచ్చళ్లు తింటే ఆరోగ్యానికి మంచిదా? రోగ నిరోధక శక్తి ఎక్కువుంటుందా? తెలుసుకుందాం..

ప్రతీకాత్మక చిత్రం

కరోనా (corona) ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తోంది. వైరస్​ను ఎదుర్కోవడానికి రోగ నిరోధక శక్తి (Immunity power) చాలా అవసరం. మ‌న ఇంట్లో ఎల్ల‌ప్పుడే స్టాక్ ఉండే ప‌చ్చ‌ళ్ల‌ (Pickles)తో ఇమ్యూనిటీ ప‌వ‌ర్ పెరుగుతుందా అని చాలా ర‌కాల ప్ర‌శ్న‌లు వ‌స్తున్నాయి. నిజానికి ఇంట్లో తయారు చేసుకునే ఏ వంట (food) అయినా ఆరోగ్యానికి చాలా మంచిదని డాక్ట‌ర్లు చెబుతున్నారు.

  • Share this:
    బిజీ లైఫ్​. టెక్నాలజీ రోజురోజుకీ కొత్తపుంతలు తొక్కుతోంది. అయినా అనారోగ్యాలు మనుషులను కబలిస్తూనే ఉన్నాయి. ఆహారంలో కల్తీలు ఎక్కువయ్యాయి. రోగాలూ (diseases) అధికమయ్యాయి. అది కాదన్నట్లు గత ఏడాదిన్నరగా కరోనా పట్టి పీడిస్తోంది. కరోనా (corona) ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తోంది. వైరస్​ను ఎదుర్కోవడానికి రోగ నిరోధక శక్తి (Immunity power) చాలా అవసరం. ఆసుపత్రికి వెళ్లకున్నా ఇమ్యునిటీ పవర్​ శరీరంలో ఉంటే బతికేయొచ్చు. అయితే రోగనిరోధక శక్తి ఒకేసారి మనలోకి ఎలా వస్తుంది. రోజువారి ఆహార అలవాట్లు శక్తి(energy)ని ఇస్తుంది. అయితే ఈ రోగనిరోధక శక్తి అనేది ఎక్కువగా ప్రోటీన్లు ఉండే బలవర్ధకం ఆహారం తీసుకుంటే వస్తుంది. శరీరంలో కణజాలాలను పునరుత్పత్తికి ప్రోటీన్(protein) దోహదపడుతాయి. అలాగే ఎముకలు (bones), కండరాలు, మృదులాస్థితోపాటు చర్మం (skin) ఏర్పడటంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. శరీరానికి శక్తిని అందించడానికి ప్రోటీన్ పనిచేస్తుంది. శరీరానికి ప్రోటీన్ అవసరమని భావించడానికి ఇదే కారణం.

    ఇంట్లో తయారు చేసినవే..

    మ‌న ఇంట్లో ఎల్ల‌ప్పుడే స్టాక్ ఉండే ప‌చ్చ‌ళ్ల‌ (Pickles)తో ఇమ్యూనిటీ ప‌వ‌ర్ పెరుగుతుందా అని చాలా ర‌కాల ప్ర‌శ్న‌లు వ‌స్తున్నాయి. నిజానికి ఇంట్లో తయారు చేసుకునే ఏ వంట (food) అయినా ఆరోగ్యానికి చాలా మంచిదని డాక్ట‌ర్లు చెబుతున్నారు. మ‌నం పెట్టుకునే ప‌చ్చ‌ళ్ల (pickles) ద్వారా ఎన్నో ప్ర‌యోజ‌నాలు ఉన్నాయి. అయితే బ‌య‌ట కొనే ప‌చ్చ‌ళ్ల‌లో కెమికల్స్ (chemicals) ఉంటాయి. అలానే ఆర్టిఫిషియల్ కలర్స్ లాంటి వాటిని కూడా అందులో వేస్తారు కాబ‌ట్టి వాటిని తినొద్దు (don’t eat). ఇంట్లోనే చేసుకుని తినాలి. ఊరగాయలని ఉప్పు (salt)లో ఊరబెట్టి కలుపుతూ ఉంటారు. కాబ‌ట్టి ఈ బ్యాక్టీరియా (bacteria) ఎంతో ఆరోగ్యంగా (healthy) ఉంటుంది, ఇది మ‌న‌కు చాలా మేలు చేస్తుంది.

    మన ఇంట్లో నానమ్మలు నూనె వేసి మెంతి పొడి, జీలకర్ర పొడి, ధనియాల పొడి, మెంతులు ఇలా పచ్చడి ని బట్టి పదార్ధాలని (items) ఉపయోగిస్తారు. ఇందులోని మెంతులు జీలకర్ర ధనియాలు మొదలైన వాటిలో యాంటీ మైక్రోబియల్ గుణాలున్నాయి. ఇవి మ‌న‌ల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. ఒబేసిటీని తరిమికొడతాయి అలాగే డయాబెటిస్ ను కూడా తగ్గిస్తాయని డాక్ట‌ర్లు వివ‌రిస్తున్నారు.

    మ‌న శ‌రీరంలోని బ్లోటింగ్ లాంటివి తొలగిస్తాయి. ఈ ప‌చ్చ‌ళ్ల ద్వారా బీ-12 విట‌మిన్ అందుతుంది. అలాగే విట‌మిన్‌-డి పుష్క‌లంగా ల‌భిస్తుంది. వీటిని తింటే విటమిన్ (vitamin) బి తో పాటు విటమిన్ డి3 ప్రొడక్షన్ మ‌న శ‌రీరంలో జ‌రిగి రోగ‌ నిరోధ‌క శ‌క్తి (Immunity power) పెరుగుతుంది. నిరుత్సాహం లాంటివి త‌గ్గుతాయి. డైజేషన్ కూడా అవుతుంది. ఇందులో ఉండే ఫైబర్ జీర్ణం సరిగా అయేలా చూస్తుంది. ఎక్కువ రోజులు నిల్వ ఉండే వీటిల్లో బ్యాడ్ బ్యాక్టీరియా ఉండ‌దు.
    Published by:Prabhakar Vaddi
    First published: