Sleep tips: నిద్ర హాయిగా పట్టాలంటే రాత్రి పూట పాలు తాగితే సరిపోతుందా? ఇంకా ఎలాంటి ఆహారం బెటర్​?

ప్రతీకాత్మక చిత్రం

నిద్ర లేకపోవడం వల్ల ఏకాగ్రత లోపిస్తుంది. ఏకాగ్రత లోపించడం వల్ల ఏ పని పూర్తి చేయలేకపోతుంటాం. అయితే రాత్రిళ్లు చాలామంది పాలు తాగి పడుకుంటారు. ఇంతకూ అలా తాగితే మంచిదేనా నిద్ర బాగా వస్తుందా? అనేది తెలుసుకుందాం..

  • Share this:
    జీవితంలో ప్రశాంతంగా నిద్రపోవడం ( Sleeping ) అనేది ఒక వరంలాంటిదే. కరోనా (corona) నేపథ్యంలో జీవితాలు తలకిందులయ్యాయి. లక్షలాది మంది ఉద్యోగాలు ఊడిపోయాయి. వారికి ప్రశాంతత (peace) కరువైంది. మిగతా వారు ఆర్థికంగా కుదేలయ్యారు. ఎన్నో మానసిక సమస్యలు ఎదుర్కొంటున్నారు. కనీసం నిద్ర కూడా సరిగా పట్టనివారున్నారు. అయితే వీటన్నింటి కారణంగా సగటు మధ్య తరగతి జీవుడిపై చాలా ఒత్తిళ్లు ఉంటాయి, నిత్యం బిజీబీజీ. చాలా మంది జీవన విధానం వల్ల తీవ్రమైన ఒత్తిడి (pressure)కి గురి అవుతుంటారు. దీని ప్రభావం వారి ఆరోగ్యంపై (Health) పడుతుంది. నిద్ర (sleep) కూడా కరువు అవుతుంది. నిద్ర లేకపోవడం వల్ల ఏకాగ్రత లోపిస్తుంది. ఏకాగ్రత లోపించడం వల్ల ఏ పని పూర్తి చేయలేకపోతుంటాం. అయితే రాత్రిళ్లు చాలామంది పాలు తాగి పడుకుంటారు. ఇంతకూ అలా తాగితే మంచిదేనా నిద్ర బాగా వస్తుందా? అనేది తెలుసుకుందాం..

    తేలికైన ఆహారం..

    రాత్రిపూట నిద్ర బాగా పట్టాలంటే సాధ్యమైనంత వరకూ తేలికగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. ఎందుకంటే అవి తొందరగా జీర్ణమవుతాయి. ఫలితంగా నిద్ర బాగా పడుతుంది. రాత్రి పడుకోబోయే ముందు గోరువెచ్చటి పాలు (lukewarm milk) తాగడం వల్ల నరాలు రిలాక్స్ అవుతాయి. అంతేకాకుండా రక్త ప్రసరణ సక్రమంగా జరుగుతుంది. గోరువెచ్చటి పాలు తాగడం వల్ల త్వరగా నిద్ర (sleep) పడుతుంది.

    అల్లం టీ..

    ఎండు ఖర్జూరాలు తినడం వల్ల జీర్ణక్రియ  సమస్యలు రాకుండా ఉంటాయి. ప్రతిరోజు 4  ఖర్జూర పండ్లు తినడం వల్ల  త్వరగా నిద్ర పడుతుంది.  రాత్రి సమయంలో అల్లం టీ తీసుకొంటే ఆరోగ్యానికి (health) చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అంతేకాకుండా మెదడు రెస్ట్ కోరుకోవడమే కాకుండా అది చేయడం ఆపివేయాలని సంకేతాలను పంపిస్తుంది. దీంతో నిద్ర బాగా పడుతుంది. రాత్రి సమయంలో కడుపునిండా రైస్ తీసుకోవడం వల్ల మంచి నిద్ర పడుతుంది అని కొన్ని అధ్యయనాలు తెలుపుతున్నాయి. అంతేకాకుండా నిద్రలేమి సమస్యను పోగొడుతుంది.

    రాత్రిపూట నిద్ర బాగా పట్టడానికి పండ్లు (fruits) బాగా ఉపయోగపడతాయి. ఎందుకంటే అరటి పండులో క్యాల్షియమ్, విటమిన్-డి ఎక్కువగా ఉంటాయి. అంతేకాకుండా అరటి పండు (banana)లో  కొంచెం చక్కెర కలుపుకుని తినడం వల్ల మెగ్నీషియం బాగా పెరిగి రక్త ప్రసరణ సక్రమంగా జరగడానికి సహాయపడుతుంది.
    Published by:Prabhakar Vaddi
    First published: