Home /News /life-style /

IS DRINKING 2 LITRES OF WATER REALLY GOOD FOR ACNE PRONE SKIN UMG GH

Drinking Water: మెరిసే అందానికి మంచినీళ్లు..! ఇన్ని లీటర్ల వాటర్ తాగితే మిమ్మల్ని మీరే గుర్తు పట్టలేరు..!!

మెరిసే అందానికి మంచినీళ్లు..!

మెరిసే అందానికి మంచినీళ్లు..!

నీరు(Water) ఎక్కువగా తాగితే శరీరానికి కలిగే ప్రయోజనాల గురించి వినని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు. శరీరానికి సరిపడా నీరు అందిస్తే చాలా సమస్యలు దూరమవుతాయి. ఇంట్లో తల్లి నుంచి వైద్యుల వరకు ఎక్కువగా నీరు తాగాలని సూచిస్తుంటారు.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India
నీరు(Water) ఎక్కువగా తాగితే శరీరానికి కలిగే ప్రయోజనాల గురించి వినని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు. శరీరానికి సరిపడా నీరు అందిస్తే చాలా సమస్యలు దూరమవుతాయి. ఇంట్లో తల్లి నుంచి వైద్యుల వరకు ఎక్కువగా నీరు తాగాలని సూచిస్తుంటారు. వేసవిలో మాత్రమే కాకుండా.. అన్ని కాలాల్లోనూ శరీరానికి సరిపడా నీరును అందిస్తుండాలి. బరువు తగ్గడానికి(Weight Loss), చర్మ సంరక్షణ(Skin Protection)కు నీరు ఎంతో మేలు చేస్తుంది. రోజుకు రెండు లీటర్ల నీరు తాగితే దాదాపు చాలా సమస్యలు తగ్గిపోతాయని వైద్యులు చెబుతుంటారు. కొన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వాలు విద్యార్థులు తగినంత నీరు తాగేలా ప్రత్యేకంగా సమయాన్ని కేటాయించాయి. తరగతుల మధ్య బెల్‌ మోగించి విద్యార్థులు నీళ్లు తాగేలా శ్రద్ధ తీసుకుంటున్నాయి. నీరు తాగడం ద్వారా కలిగే ప్రయోజనాలు ఏవో చూద్దాం.

- చర్మానికి అతి పెద్ద ప్రమాదకరమైన అంశం ఒత్తిడి. కానీ ఎక్కువ నీరు తాగడం వల్ల కణాలకు అవసరమైన ఆక్సిజన్ సరఫరా మెరుగవుతుంది. అది చర్మాన్ని ప్రశాంతపరుస్తుంది, ఉపశమనం కలిగిస్తుంది.

- మొటిమలకు కారణమయ్యే టాక్సిన్స్‌ సహా శరీరం నుంచి వివిధ రకాల టాక్సిన్స్‌ను బయటకు పంపడంలో నీరు కీలకంగా పని చేస్తుంది. శరీరంలో నుంచి వ్యర్థాలను బయటకు పంపేందుకు తరచూ నీరు తాగాలి.

ఇదీ చదవండి: వామ్మో వీడు మామూలోడు కాదయ్యో.. ఏకంగా సీఎం ఫొటోతోనే కోట్లు కొల్లగొట్టడానికి రెడీ ! చివరికి ఏమైందంటే ?


- ప్రతి గంటకు నీరు తాగడం, శరీర ఉష్ణోగ్రతను నియంత్రించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. చర్మాన్ని మృదువుగా ఉంచుతుంది.

- రాత్రి వేళ గ్లాసు గోరు వెచ్చని నీరు తాగితే ఒత్తిడి దూరమవుతుందని నిపుణులు సూచిస్తున్నారు.

- తగినంత నీరు తీసుకోవడం వల్ల చర్మంలో నూనె స్థాయి కూడా అదుపులో ఉంటుంది.

- నీరు తాగడం వల్ల కలిగే మరో ముఖ్యమైన ప్రయోజనాలలో.. ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్‌ కూడా ఉంది.

- బరువు తగ్గాలనుకునే వారు ఇతర పద్ధతులతో పాటు రాత్రి పడుకునే ముందు గోరు వెచ్చని నీరు తాగితే మంచి ఫలితం ఉంటుంది.

- రాత్రి వేళ గోరువెచ్చని నీరు తాగడం వల్ల జీర్ణ వ్యవస్థ పనితీరు కూడా మెరుగవుతుంది.

- ఉదయం లేవగానే మంచినీళ్లు తాగడం వల్ల మల విసర్జన సులభంగా జరుగుతుంది.

- పరగడుపున నీళ్లు తాగటం వల్ల శరీరంలో పేరుకుపోయిన వ్యర్థాలు ఎప్పటికప్పుడు బయటకు వెళ్లిపోతాయి.

- పెద్ద పేగు శుభ్రం అయి.. ఆహారంలోని పోషకాలను మరింత మెరుగ్గా స్వీకరిస్తాయి.



* ఎంత నీరు తాగాలి?
ఒక వ్యక్తి శరీర బరువులో ప్రతి 20 కిలోలకు ఒక లీటరు నీరు తాగాలని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. కాబట్టి ఉన్న బరువు ఆధారంగా ఎంత నీరు తాగాలని లెక్కించుకోవచ్చు. ఆ మేరకు నీరు తాగి ఆరోగ్యాన్ని, చర్మ సౌందర్యాన్ని మెరుగుపరచుకోవచ్చు.
Published by:Mahesh
First published:

Tags: Drinking water, Health, Skin care, Water

తదుపరి వార్తలు