కీళ్ల నొప్పులు వచ్చినప్పుడు కీళ్ల ప్రాంతాల్లో వాపు కనిపిస్తుంది. అక్కడ విపరీతమైన నొప్పి పుడుతుంది. ఇందులో మరింత ఆందోళనకరమైన విషయం ఏంటంటే.. కీళ్ల నొప్పులను శాశ్వతంగా నయం చేయడం అసాధ్యం. రోగులకు ఉపశమనం కలిగించే ఏకైక మార్గం నొప్పులను తగ్గించుకునేందుకు ప్రయత్నించడం. రోగులకు నొప్పిని తగ్గించే అనేక ఆహారాలు, మందులు ఉన్నాయి. అలాంటి వండర్ ఫుడ్స్‌లో ఆలివ్ ఆయిల్ ఒకటి. ఇది కీళ్ల వాపును, ఆర్థరైటిస్ ఉన్నవారి కీళ్ల ప్రాంతాల చుట్టూ నొప్పిని తగ్గిస్తుందని అధ్యయనాల్లో తేలింది. దీంట్లో రిఫైన్డ్ ఆయిల్, వర్జిన్ ఆలివ్ ఆయిల్, ఎక్స్‌ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్ వంటి మూడు ప్రధాన గ్రేడ్‌లు ఉన్నాయి. ఎక్స్‌ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్‌ను అతి తక్కువగా ప్రాసెస్ చేస్తారు. ఇది అత్యంత ఆరోగ్యకరమైనదిగా చెబుతారు. దీని రుచి కూడా బాగుంటుంది.
* యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు
ఎక్స్‌ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్‌లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇందులో కనిపించే ప్రధాన యాంటీఆక్సిడెంట్లలో ఒకటి ఒలియోకాంతల్. జాయింట్ డీజనరేటివ్ డిసీజ్, ఇన్ఫమ్లేటరీ సంబంధ వ్యాధులు, కొన్ని రకాల క్యాన్సర్‌లు, న్యూరో-డీజెనరేటివ్ డిసీజ్ వంటి వాటికి వ్యతిరేకంగా ఒలియోకాంతల్ పోరాడుతుంది.
* పరిశోధనలు ఏం చెబుతున్నాయి?
ఆర్థరైటిస్‌తో బాధపడుతున్న రోగులలో ఆలివ్ ఆయిల్ తీసుకొచ్చే మార్పులపై అధ్యయనాలు జరిగాయి. ర్యాండమైజ్డ్ క్లినికల్ ట్రైల్‌లో భాగంగా ఇరాన్‌లోని అరక్‌లో జరిగిన 2020 రీసెర్చ్ స్టడీలో.. రుమటాయిడ్ ఆర్థరైటిస్ మనిఫస్టేషన్స్‌ను నియంత్రించడంలో ఎక్స్‌ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్ ప్రభావవంతంగా చూపుతుందని కనుగొన్నారు. ఆలివ్ ఆయిల్‌లోని యాంటీ ఆక్సిడెంట్లు యాంటీ ఇన్‌ఫ్లమేటరీ పెయిన్ రిలీవర్ అయిన ఇబుప్రోఫెన్ డ్రగ్ లాగానే పనిచేస్తాయని మరో అధ్యయనం పేర్కొంది. ఒలేయిక్ యాసిడ్ రక్తంలో సి-రియాక్టివ్ ప్రొటీన్ మొత్తాన్ని తగ్గిస్తుంది. సి-రియాక్టివ్ ప్రోటీన్ అనేది ఆర్థరైటిస్ పరిస్థితులలో ఒక ఇన్‌ఫ్లమేటరీ మార్కర్.
* ఎంత ఎక్స్‌ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్ తీసుకోవాలి?
ఎక్స్‌ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్ మానవ శరీరానికి మంచిదే అయినప్పటికీ.. అధికంగా తీసుకోవడం వల్ల సమస్యలు తలెత్తవచ్చు. వివిధ ఆరోగ్య నివేదికల ప్రకారం రోజుకు 1-4 టేబుల్ స్పూన్ల ఆలివ్ ఆయిల్ తీసుకోవడం మంచిదని చెప్పవచ్చు.
* ఏ సమయంలో తీసుకోవాలి?
ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఎక్స్‌ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్‌ను రోజులోని నిర్దిష్ట సమయంలో ఉపయోగిస్తే ఫలితాలు బాగుంటాయి. యాంటీ ఇన్‌ఫ్లమేషన్ ప్రయోజనాల కోసం ఆలివ్ ఆయిల్‌ను ఉదయం తీసుకోవాలి. ఇలా చేస్తే, చర్మ ఆరోగ్యం, పెద్ద పేగు క్యాన్సర్‌ను దూరం చేస్తుంది.
* ఆర్థరైటిస్ రోగులు ఏ జాగ్రత్తలు తీసుకోవాలి?
ఆర్థరైటిస్ రోగులు ఎల్లప్పుడూ వారి బరువును కంట్రోల్ చేసుకోవడానికి ప్రయత్నించాలి. చెడు అలవాట్లను మానేయాలి. కీళ్లను సరైన విధంగా కదిలించడం కూడా అంతే అవసరం. తక్కువ ఇంపాక్ట్ ఉన్న వ్యాయామాలు మాత్రమే చేయాలి. పెయిన్ కిల్లర్స్ వాడకం తగ్గించాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Cooking oil, Health, Health problems, Olive Oil