Home /News /life-style /

IS DETOX DIET A FAD OR IS IT BENEFICIAL FOR YOUR BODY FIND OUT UMG GH

Detox Diet: డిటాక్స్ డైట్స్ ఆరోగ్యానికి మంచివేనా..? ఇది తీసుకుంటే నిజంగానే మనకు ప్రమాదమా..? నిపుణులు చెప్పేది ఏంటంటే..!

డిటాక్స్ డైట్స్ ఆరోగ్యానికి మంచివేనా..?

డిటాక్స్ డైట్స్ ఆరోగ్యానికి మంచివేనా..?

మన శరీరానికి డిటాక్స్ ప్రోగ్రామ్ అవసరం లేదు. మన బాడీకి తనంతటతానే విషతుల్యాలను తొలగించగల సామర్థ్యం ఉంది. కాలేయం మన శరీరాన్ని డిటాక్స్ చేసే ఒక మెషిన్ లాగా పనిచేస్తుంది. మనం తినే, పీల్చే, తీసుకునే సాధారణ వస్తువులను డిటాక్స్ చేయడం కాలేయం ముఖ్య పని.

ఇంకా చదవండి ...
శరీరంలోని విషతుల్యాల (Toxins)ను తొలగించుకునేందుకు చాలా మంది ప్రజలు డిటాక్స్ డైట్ (Detox Diet) ఫాలో అయిపోతుంటారు. వీటిని ఫాలో కావడం ద్వారా ఒంట్లోని హానికరమైన విషతుల్యాలు పూర్తిగా తొలగిపోతాయని నమ్ముతారు. బాడీ డిటాక్స్ ఫుడ్ అంటూ సోషల్ మీడియాలో కూడా విస్తృతమైన ప్రచారం జరుగుతుంటుంది. అయితే శరీరం నిజంగా టాక్సిన్స్‌తో నిండిపోయి ఉంటుందా? డిటాక్స్ డైట్ ఎంతవరకు ఉపయోగపడుతుంది? ప్రతి ఒక్కరూ ప్రత్యేకంగా ఒక డిటాక్స్ ప్రోగ్రామ్‌ (Detox Program) తప్పక అనుసరించాలా? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

ఆరోగ్య నిపుణుల ప్రకారం, మన శరీరానికి డిటాక్స్ ప్రోగ్రామ్ అవసరం లేదు. మన బాడీకి తనంతటతానే విషతుల్యాలను తొలగించగల సామర్థ్యం ఉంది. కాలేయం మన శరీరాన్ని డిటాక్స్ చేసే ఒక మెషిన్ లాగా పనిచేస్తుంది. మనం తినే, పీల్చే, తీసుకునే సాధారణ వస్తువులను డిటాక్స్ చేయడం కాలేయం ముఖ్య పని. రక్త సరఫరాలో విషతుల్యాలను తొలగించడం, ఆరోగ్యకరమైన రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడం, రక్తం గడ్డకట్టడాన్ని ఆపడం చేస్తూ కాలేయం మనల్ని సజీవంగా ఉంచుతుంది. కిడ్నీ, ఊపిరితిత్తులు, చర్మం వంటి ఇతర అవయవాలు కూడా ఓవర్‌టైమ్ పని చేస్తూ బాడీలోని టాక్సిన్స్‌ను తొలగిస్తాయి.

ఇదీ చదవండి: టూర్ ప్లాన్ చేస్తున్నారా ? నార్త్ లో ఈ ప్రాంతాలకు వెళ్తే.. ఎప్పటికీ మీరు మరచిపోలేరు..!


* డిటాక్స్ డైట్స్‌ పనిచేస్తాయా?
ప్రజలు డిటాక్స్ డైట్‌లను ఫాలో అవుతున్నప్పుడు కూరగాయలు, పండ్లను మాత్రమే ఆహారంగా తీసుకుంటారు. అయితే ఈ డైట్స్‌ వల్ల ఒనగూరే ప్రయోజనాలు తాత్కాలికమే. అలాగే ఇవి అంత సమర్థవంతంగా పని చేయవు. అయితే ఈ డైట్ ఫాలో కావడం వల్ల ఎలక్ట్రోలైట్ సమతుల్యత దెబ్బతింటుంది. విటమిన్లు, ఖనిజాల లోపాలు వంటి సమస్యలు తలెత్తుతాయి. అతిసారం, ఉదర సంబంధిత సమస్యలు, అలసట లాంటి అనారోగ్యాలు కూడా వేధిస్తాయి. డాక్టర్ల ప్రకారం డిటాక్స్ డైట్స్‌లో ప్రజలు బరువు కోల్పోతారు. కానీ నిజంగా బరువు తగ్గరు. కండరాలు, నీటి బరువును కోల్పోవడం వల్ల బరువు తగ్గుతారు కానీ నిజంగా కొవ్వు తగ్గి బరువు కోల్పోరు. సో, ఈ వెయిట్ లాస్ వల్ల వచ్చే ప్రయోజనాలు ఏమీ ఉండవు. ఈ డిటాక్స్ డైట్స్‌ హానిచేయనివిగా కనిపిస్తాయి, కానీ వాస్తవానికి అవి మంచి కంటే ఎక్కువ హాని చేస్తాయి.



మరి ఏం చేయాలి?
శరీరం నుంచి విషతుల్యాలను తొలగించుకునేందుకు మీరు మీ శరీరాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. తాజాగా ఉన్న ఆహార పదార్థాలు, తక్కువ ప్రాసెస్ చేసిన ఆహారాలు మాత్రమే తీసుకోవాలి. మన గట్ రోగనిరోధక పనితీరులో 70% బాధ్యత వహిస్తుంది. కాబట్టి హెవీ ఫుడ్స్ తీసుకోవడం తగ్గిస్తే గట్ (Gut)పై ఒత్తిడి తగ్గుతుంది. అప్పుడు రోగ నిరోధక శక్తిని గట్ మెరుగ్గా అందించగలుగుతుంది. మీ గట్‌పై అధిక ప్రభావం పడకుండా మెత్తగా, తేలికగా జీర్ణమయ్యే ఆహారాన్ని తీసుకోవడం మంచిది. ఇవన్నీ కూడా ఎలాంటి డిటాక్స్ డైట్ అవసరం లేకుండా చేసి విషతుల్యాలను పోగొట్టవచ్చు.
Published by:Mahesh
First published:

Tags: Ayurvedic diet, Diet, Health, Health benefits

తదుపరి వార్తలు