Home /News /life-style /

IS BEING OVERWEIGHT CAUSING PROBLEMS THEN IF YOU USE THIS OIL IN YOUR DIET THERE IS A CHANCE TO LOSE WEIGHT PRV

Weight loss: అధిక బరువు సమస్యలు తెచ్చిపెడుతోందా? అయితే మీ ఆహారంలో ఈ నూనెను వాడితే బరువు తగ్గుతారట..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

అధిక బరువు (heavy weight). మనిషికి మన: శాంతిని దూరం చేస్తుంది. వేళకు తినకపోవడం, సమయానికి నిద్ర పోకపోవడం తదితర కారణాలు బరువు పెరగడానికి (weight gain) కారణాలవుతాయి. అయితే ఈ అధిక బరువు శారీరక రోగాలకు దారి తీస్తాయి.

    అధిక బరువు (heavy weight). మనిషికి మన: శాంతిని దూరం చేస్తుంది. వేళకు తినకపోవడం, సమయానికి నిద్ర పోకపోవడం తదితర కారణాలు బరువు పెరగడానికి (weight gain) కారణాలవుతాయి. అయితే ఈ అధిక బరువు శారీరక రోగాలకు దారి తీస్తాయి. అందుకే తగ్గించుకోవడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. కానీ, కొంతమందికి ఆ సమయం (time) కూడా ఉండదు. బరువు తగ్గడానికి (weight loss) కడుపు కాల్చుకుంటారు. ఆహారం (food) ఎక్కువగా తీసుకోరు. అయినా కూడా అలాంటి వారు బరువు తగ్గరు. వారికీ కూడా ఎందుకో అర్థం కాదు. అయితే అలాంటి వారు కొన్నిచిట్కాలు (tips) పాటిస్తే బరువు (weight) తగ్గుతారు. అతిగా వ్యాయామాలు చేయడమే. ఎంత చక్కటి వర్కవుటైనా... ఇన్నిసార్లు... ఇంతసేపు చేయాలనే నియమం ఉంటుంది. అలా కాకుండా త్వరగా బరువు తగ్గాలని మితి మీరి వర్కవుట్లు చేస్తే అనారోగ్యాల బారిన పడతారు. ఆవాల నూనె మీ ఆహారంలో ఉంటే బరువు తగ్గడానికి ఉపయోగ పడుతుందట. దాని గురించి తెలుసుకుందాం..

    ఆహారాన్ని వేగంగా జీర్ణం చేయడంలో..

    ఆవాల నూనె (Mustard oil)కు జీవక్రియను వేగవంతం చేసే సామర్థ్యం ఉంది. ప్రధానంగా నియాసిన్, రిబోఫ్లావిన్ వంటి బి-కాంప్లెక్స్ విటమిన్లు ఉండటం వల్ల ఆహారాన్ని వేగంగా జీర్ణం చేయడంలో సహాయపడుతుంది. ఈ ప్రక్రియ బరువు తగ్గడానికి (weight loss) సహాయపడుతుంది. చాలా మంది ప్రజలు ఆవ నూనె (mustard oil)కు దాని జిగట, ఘాటైన వాసన కారణంగా దూరంగా ఉంటారు. కానీ ఒకసారి సరిగ్గా వేడి చేస్తే ఆవ నూనె కూడా ఇతర నూనెల లాగే ఉంటుంది. ఈ నూనె ఒమేగా -3, ఒమేగా -6 కొవ్వు ఆమ్లాలు మరియు గుండెకు ఆరోగ్యకరమైన కొవ్వులకు మంచి మూలం. ఆరోగ్యకరమైన కొవ్వు ఆమ్లాల కలయిక ఆహారం రుచిని మెరుగుపరచడమే కాకుండా రక్తంలో కొవ్వు స్థాయిని తగ్గిస్తుంది. ఒమేగా -6 కొవ్వు ఆమ్లాలు శరీరంలో సహజంగా నిల్వ ఉన్న కొవ్వు వినియోగాన్ని మెరుగు పరుస్తాయి, ఇవి బరువు తగ్గడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి.

    బరువు తగ్గడమే కాకుండా ఆవనూనెలో విస్మరించలేని అనేక ఇతర ప్రయోజనాలు ఉన్నాయి. మస్టర్డ్ ఆయిల్‌లో మోనోశాచురేటెడ్, పాలీఅన్‌శాచురేటెడ్ కొవ్వులు ఉంటాయి. ఇవి గుండెకు మంచివి. మంచి కొలెస్ట్రాల్ స్థాయిని పెంచడంలో సహాయపడతాయి. గ్లూకోసినోలేట్స్ ఉండటం వల్ల మస్టర్డ్ ఆయిల్‌లో క్యాన్సర్ నిరోధక గుణాలు కూడా ఉన్నాయి. కొలొరెక్టల్, గ్యాస్ట్రోఇంటెస్టినల్ వంటి క్యాన్సర్ల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఆవాల నూనెను వంటకు కాకుండా అనేక ఇతర మార్గాలలో ఉపయోగిస్తారు. వేడి ఆవనూనెతో కీళ్లనొప్పి ఉన్నవారు క్రమం తప్పకుండా మసాజ్ చేయడం వలన నొప్పి బాగా తగ్గుతుంది.

    (Disclaimer: The information and information provided in this article is based on general information. Telugu News 18 does not confirm these. Please contact the relevant expert before implementing them.)
    Published by:Prabhakar Vaddi
    First published:

    Tags: Food, Mustard Oil, Weight loss

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు