IS BATHING IN LUKEWARM WATER GOOD FOR HEALTH OR BETTER IF DONE WITH COLD WATER LETS SEE PRV
Health tips: గోరు వెచ్చని నీటితో స్నానం చేస్తే ఆరోగ్యానికి మంచిదా? చల్లటి నీటితో చేస్తే బెటరా?
ప్రతీకాత్మక చిత్రం
ఉరుకుల పరుగుల జీవితంలో మనిషి రోజూ చేసే పనులు కూడా మరిచిపోతున్నాడు. అయితే మన శరీరం మన స్థితిని వాసన, చెమట రూపంలో తెలియజేస్తుంది. స్నానానికి వేడినీరు (hot water), చల్లటి నీరు (cool water) అనే తేడా లేదు వాడేస్తుంటారు. అసలు స్నానానికి గోరు వెచ్చని నీరు మంచిదా..? చల్లటి నీరు మంచిదా అని? ఒక సారి చూద్దాం
స్నానం (Bath). ఉరుకుల పరుగుల జీవితంలో మనిషి రోజూ చేసే పనులు కూడా మరిచిపోతున్నాడు. అయితే మన శరీరం మన స్థితిని వాసన, చెమట రూపంలో తెలియజేస్తుంది. ఎక్కడికైనా బయటకు వెళ్లి ఇంటికి వచ్చే సరికి అలసిపోయినట్టు ఉండి స్నానం (bath) చేయకుంటేనే ఆగమాగం అవుతాం. ఇక రోజూ ఉదయం లేవగానే స్నానం చేయడమనేది మన దినచర్య. చాలా మంది ఉదయం, సాయంత్రం కూడా చేస్తుంటారు. అసలు ఒక్కరోజు స్నానం చేయకుంటే చికాకు.. చికాకుగా ఉంటుంది. మనిషికి ఆరోగ్యాన్ని(health) ఇచ్చేది కూడా. మనం ఎంత శుభ్రం (CLEAN)గా ఉంటే మన ఆరోగ్యం అంత బాగుంటుంది. స్నానానికి వేడినీరు (hot water), చల్లటి నీరు (cool water) అనే తేడా లేదు వాడేస్తుంటారు. అసలు స్నానానికి గోరు వెచ్చని నీరు మంచిదా..? చల్లటి నీరు మంచిదా అని? ఒక సారి చూద్దాం..
చల్లటి నీటితో మంచిదే..
ఊపిరితిత్తుల ఆరోగ్యానికి చల్లటి నీటితో స్నానం మంచిది. చల్లని నీటితో స్నానం వల్ల శరీవ వాపు తగ్గుతుంది. కండరాల నొప్పులు (pains) తగ్గుతాయి హృదయ స్పందన రేటు పెరుగుతుంది. వ్యాయామం (exercise) తర్వాత చల్లని స్నానం చేయడం వల్ల శరీరం చల్లబడుతుంది. దీని వల్ల హైడ్రేషన్ మెరుగుపడుతుంది. శరీర కణజాలాలలో రక్త నాళాలు మరింత విస్తరించి.. ప్రసరణను మెరుగుపరుస్తుంది. క్రీడాకారులు ఎక్కువగా చన్నీటి స్నానం చేయడమే మంచిదట. అలసట, ఒత్తిడిగా ఉన్నప్పుడు చల్లని నీటితో స్నానం చేస్తే మంచి ఉపశమనం లభిస్తుంది.
తిన్న తర్వాత వద్దు..
ఉదయం టిఫిన్ (Morning Tiffin) చేసిన తర్వాత స్నానం చేయకండి. భోజనం చేసిన తర్వాత (after eat) కనీసం 2,3 గంటలు ఆగిన తరువాత స్నానం చేయడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఒకవేళ స్నానం చేసిన తర్వాత భోజనం చేసినట్లయితే.. ఆయిల్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకోకండి. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి. పెద్దలు ఏ ఉద్దేశంతో చెప్పినా కూడా సైన్స్ కూడా ఇదే విషయాన్ని మరో విధంగా చెబుతోంది. ఇంకేం స్నానం చేసేటపుడు జీర్ణ వ్యవస్థకు కొంచెం సమయం ఇవ్వండి.
మరిగిన నీటితో స్నానం చేయడం కంటే గోరు వెచ్చని నీటితో స్నానం చేయడం వల్లే ప్రయోజనాలే (benefits) ఎక్కువ. గోరు వెచ్చని నీటితో స్నానం చేయడం వల్ల రక్త ప్రవాహం మెరుగవుతుంది. హృదయ సమస్యలతో బాధపడేవారు వేడి నీటి స్నానం చేయడం ఉత్తమం. బరువు (weight) తగ్గాలనుకొనేవారు వేడి నీటితో స్నానం చేయడం మంచిదే. శరీరం అధిక ఉష్ణోగ్రతలకు గురైనప్పుడు రక్తనాళాలు విస్తరిస్తాయి. ఫలితంగా రక్త ప్రవాహం మెరుగుపడుతుంది. అయితే వేడి నీటి కంటే గోరువెచ్చని నీరే ఆరోగ్యానికి మంచిది. అలాగే చల్లటి నీరు కూడా మంచిది.
(Disclaimer: The information and information provided in this article is based on general information. Telugu News 18 does not confirm these. Please contact the relevant expert before implementing them.)
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.