Home /News /life-style /

IS AFTERNOON SLEEP GOOD FOR HEALTH OR NOT AND WHAT ARE THE EXPERTS SAYS FULL DETAILS HERE PRV

Afternoon Sleep: మధ్యాహ్నం నిద్ర మంచిదా? కాదా? నిపుణులు ఏమంటున్నారు?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

సాధార‌ణంగా చాలా మంది మ‌ధ్యాహ్నం నిద్ర పోవ‌డం అంటే భ‌య‌ప‌డ‌తారు. మధ్యాహ్నం నిద్ర (AfterNoon sleep) మంచిది కాదు అంటారు.. నిపుణులు మాత్రం మరోలా చెబుతున్నారు. దాని గురించి తెలుసుకుందాం..

    కరోనా కారణంగా చాలామంది పగలు బయటికి వెళ్లే అవకాశం లేక ఇంట్లోనే నిద్రించే అలవాటు చేసుకున్నారు. రాత్రిళ్లు తక్కువగా పడుకునేవారు. దీంతో అన్​లాక్‌ అనంతరం మళ్లీ సాధారణ జీవితం గడపాలనుకున్నా.. సాధ్యం కావడం లేదని పలువురు అంటున్నారు. దీనికి ప్రధాన కారణం. రాత్రిళ్లు నిద్రలేమి (Insomnia). లాక్​డౌన్​ కాలంలో పనేమీ లేకపోవడంతో ఇంట్లోనే ఇష్టం వచ్చిన సమయంలో నిద్రించేవారు. కానీ. మళ్లీ రొటీన్​ జీవితంలోకి అడుగుపెట్టాక అది ఇబ్బందిగా మారుతోంది. ఉద్యోగస్తులకైతే మరీ కష్టం.

     తిన్న వెంట‌నే కునుకు తీస్తే....

    రాత్రిళ్లు నిద్ర లేకపోవడం (sleeping problems), ఉదయాన్నే ఆఫీసులో నిద్ర రావడం లాంటి సమస్యలు వస్తుంటాయి. అయితే చాలామంది మధ్యాహ్నం నిద్ర (AfterNoon sleep) మంచిది కాదు అంటారు.. నిపుణులు మాత్రం మరోలా చెబుతున్నారు. దాని గురించి తెలుసుకుందాం.. రోజుకు ఎనిమిది గంట‌లు ప‌డుకోవ‌డం వ‌ల్ల మెదడు (brain)కు విశ్రాంతి దొరుకుతుందట. త‌ద్వారా జ్ఞాపకశక్తి పెరుగుతుందట. మ‌రియు నాడీ వ్యవస్థ సరిగా పనిచేసేందుకు దోహదం చేస్తుందట. ఇలా నిద్ర ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇవ‌న్నీ ప‌క్క‌న పెడితే.. సాధార‌ణంగా చాలా మంది మ‌ధ్యాహ్నం నిద్ర పోవ‌డం అంటే భ‌య‌ప‌డ‌తారు. ముఖ్యంగా తిన్న వెంట‌నే కునుకు తీస్తే.. బ‌రువు పెరుగుతార‌ని, రాత్రుళ్లు నిద్ర ప‌ట్ట‌ద‌ని మ‌రియు అనేక అనారోగ్య స‌మ‌స్య‌లు కూడా వ‌స్తాయ‌ని న‌మ్ముతుంటారు.

    మ‌ధ్యాహ్నం నిద్రించ‌డం వ‌ల్ల..

    అవి ఎంత వ‌ర‌కు నిజం అన్న‌ది ప‌క్క‌న పెడితే.. మ‌ధ్యాహ్నం నిద్ర (afternoon sleep) వ‌ల్ల చాలా ప్ర‌యోజ‌నాలు ఉన్నాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. మధ్యాహ్నం పూట ఒక గంట పాటు నిద్రించడం వల్ల‌ రక్తపోటు నియంత్రణలో ఉంటుందట‌. అలాగే మ‌ధ్యాహ్నం నిద్రించ‌డం వ‌ల్ల బ్రెయిన్ చురుగ్గా పనిచేయడానికి ఉపయోగపడుతుందని, శరీరం యాక్టివ్ గా ఉండటానికి తోడ్ప‌డుతుంద‌ని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇక హైబీపీని కంట్రోల్ చేయ‌డంలోనూ మ‌ధ్యాహ్నం స‌హాయ‌ప‌డుతుందట.

    మ‌ధ్యాహ్నం నిద్ర  గుండె సంబంధిత సమస్యలు రాకుండా కాపాడుతుందట. అదే స‌మ‌యంలో కొవ్వును క‌రిగించ‌డానికి మ‌ధ్యాహ్నం నిద్ర‌ మెరుగ్గా ప‌నిచేస్తుంది. అలాగే మ‌ధ్యాహ్నం నిద్ర హార్మొన్ల స‌మ‌తుల్య‌త పెరుగుతుందట. దీంతో మ‌ధుమేహం, థైరాయిడ్ స‌మ‌స్య‌ల నుంచి బ‌య‌ట‌ప‌డొచ్చు నిపుణ‌లు చెబుతున్నారు. అయితే ఇవన్నీ ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు కలగాలంటే కునుకు తీసే విధానంలో కొన్ని విధానాలు పాటించాలి. సరిగ్గా భోజనం చేసిన వెంటనే పడుకోవాలి. ప‌ది నుంచి ముప్పై నిమిషాల పాటు మాత్రమే నిద్రించాలట. మ‌రియు ఎడమవైపుకి తిరిగి తలకింద చేయి పెట్టుకొని పడుకోవాలి.

    (Disclaimer: The information and information provided in this article is based on general information. Telugu News 18 does not confirm these. Please contact the relevant expert before implementing them.)
    Published by:Prabhakar Vaddi
    First published:

    Tags: Health care, Sleep tips

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు