IRCTC: బ్యాంకాక్‌లో న్యూ ఇయర్ పార్టీ... ఐఆర్‌సీటీసీ టూర్ ప్యాకేజీ వివరాలివే

IRCTC Treasures Of Thailand | ప్యాకేజీలో ఫ్లైట్ టికెట్లు, వీసా ఛార్జీలు, మొత్తం 5 బ్రేక్‌ఫాస్ట్, 5 లంచ్, 5 డిన్నర్స్, డిసెంబర్ 31 రాత్రి గాలా డిన్నర్, ఏసీ బస్సులో సైట్ సీయింగ్, అకామడేషన్, ట్రావెల్ ఇన్స్యూరెన్స్ లాంటివి కవర్ అవుతాయి.

news18-telugu
Updated: November 13, 2019, 11:42 AM IST
IRCTC: బ్యాంకాక్‌లో న్యూ ఇయర్ పార్టీ... ఐఆర్‌సీటీసీ టూర్ ప్యాకేజీ వివరాలివే
IRCTC: బ్యాంకాక్‌లో న్యూ ఇయర్ పార్టీ... ఐఆర్‌సీటీసీ టూర్ ప్యాకేజీ వివరాలివే (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
ఈసారి మీరు న్యూ ఇయర్ పార్టీ ఎక్కడ సెలబ్రేట్ చేసుకుంటున్నారు? ఇంకా ప్లాన్ చేసుకోలేదా? ఈ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ జీవితాంతం గుర్తుండిపోయేలా జరుపుకోవాలని ఆలోచిస్తున్నారా? అయితే మీకు శుభవార్త. న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ అద్భుతమైన ప్యాకేజీ రూపొందించింది. థాయ్‌ల్యాండ్‌లో న్యూ ఇయర్ పార్టీ ప్లాన్ చేసింది. 'ట్రెజర్స్ ఆఫ్ థాయ్‌ల్యాండ్' పేరుతో ఐఆర్‌సీటీసీ రూపొందించిన ప్యాకేజీ ఇది. ఈ ప్యాకేజీ బుక్ చేసుకున్నవారు బ్యాంకాక్, పట్టాయాలో న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకోవచ్చు. 4 రాత్రులు, 5 రోజుల ప్యాకేజీ ఇది. ప్యాకేజీ ప్రారంభ ధర రూ.47,990. ప్యాకేజీలో ఫ్లైట్ టికెట్లు, వీసా ఛార్జీలు, మొత్తం 5 బ్రేక్‌ఫాస్ట్, 5 లంచ్, 5 డిన్నర్స్, డిసెంబర్ 31 రాత్రి గాలా డిన్నర్, ఏసీ బస్సులో సైట్ సీయింగ్, అకామడేషన్, ట్రావెల్ ఇన్స్యూరెన్స్ లాంటివి కవర్ అవుతాయి.

IRCTC Treasures Of Thailand: ఐఆర్‌సీటీసీ థాయ్‌ల్యాండ్ టూర్ ప్యాకేజీ వివరాలివే...


ఐఆర్‌సీటీసీ థాయ్‌ల్యాండ్ టూర్ డిసెంబర్ 29న ముంబై నుంచి ప్రారంభమవుతుంది. తెల్లవారుజామున ముంబైలో 02.40 బ్యాంకాక్ ఫ్లైట్ ఎక్కాలి. ఉదయం 09.05 గంటలకు బ్యాంకాక్ చేరుకుంటారు. బ్రేక్‌ఫాస్ట్ తర్వాత బ్యాంకాక్ సిటీ టూర్, గోల్డెన్ బుద్ధ, మార్బుల్ టెంపుల్ దర్శనం ఉంటుంది. మధ్యాహ్నం భోజనం తర్వాత కాసేపు హోటల్‌లో విశ్రాంతి తీసుకోవాలి. సాయంత్రం ఛావో ఫ్రాయా రివర్ క్రూజ్‌లో విహారం ఉంటుంది. రాత్రికి బ్యాంకాక్‌లో హోటల్‌లో బస చేయాలి. డిసెంబర్ 30న సఫారీ వాల్డ్, మెరైన్ పార్క్ తీసుకెళ్తారు. సాయంత్రం ఇందిరా మార్కెట్‌కు తీసుకెళ్తారు. రాత్రికి బ్యాంకాక్‌లో బస చేయాలి.

డిసెంబర్ 31న న్యూ ఇయర్ సెలబ్రేషన్స్‌కు పట్టాయాకు బయల్దేరాలి. దారిలో టైగర్ షోకు తీసుకెళ్తారు. పట్టాయాలో రాత్రి గాలా డిన్నర్‌కు వెళ్లాలి. అక్కడే న్యూ ఇయర్ పార్టీ సెలబ్రేషన్స్ ఉంటాయి. రాత్రికి పట్టాయాలోనే బస చేయాలి. జనవరి 1న కోరల్ ఐల్యాండ్ టూర్ ఉంటుంది. ససాయంత్రం అల్కజార్ షోకు తీసుకెళ్తారు. రాత్రికి పట్టాయాలో బస చేయాలి. జనవరి 2న తిరిగి బ్యాంకాక్‌కు బయల్దేరాలి. దారిలో జెమ్స్ గ్యాలరీకి తీసుకెళ్తారు. ఆ తర్వాత ఇందిరా మార్కెట్‌లో షాపింగ్‌కు వెళఅలొచ్చు. ఆ తర్వాత సువర్ణభూమి ఎయిర్‌పోర్టుకు తీసుకెళ్తారు. రాత్రి 10.10 గంటలకు బ్యాంకాక్‌లో ఫ్లైట్ ఎక్కితే అర్థరాత్రి 01.35 గంటలకు ముంబై చేరుకోవడంతో టూర్ ముగుస్తుంది. ఈ ప్యాకేజీకి సంబంధించిన పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Xiaomi Mi CC9 Pro: 108 మెగాపిక్సెల్ కెమెరాతో షావోమీ ఎంఐ సీసీ9 ప్రో రిలీజ్... ఎలా ఉందో చూడండి





ఇవి కూడా చదవండి:
Loading...
IRCTC Tirupathi Tour: తిరుపతి టూర్ ప్యాకేజీ ప్రకటించిన ఐఆర్‌సీటీసీ... విశేషాలివే

IRCTC: గుడ్ న్యూస్... హైదరాబాద్ నుంచి ఐఆర్‌సీటీసీ రామాయణ యాత్ర

IRCTC Bharat Darshan: తెలుగు ప్రజలకు శుభవార్త... రూ.7,560 ప్యాకేజీతో దక్షిణ భారతదేశ యాత్ర
First published: November 13, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...