Home /News /life-style /

INTERNATIONAL YOUTH DAY 2021 FIVE THINGS THAT DIFFERENTIATE TODAYS YOUTH FROM PAST GENERATIONS GH SK

International Youth Day: నేడు యువజన దినోత్సవం.. పాత తరం, నేటి యువత మధ్య తేడాలు ఇవే

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

International Youth Day 2021: గత 50 ఏళ్ల కాలంలో ప్రపంచం ఎవరూ ఊహించనంతగా మారింది. సాంస్కృతిక, టెక్నాలజీ, రాజకీయ, ఆర్థిక విభాగాలతో పాటు ఎన్నో రంగాల్లో వినూత్న మార్పులు వచ్చాయి.

ఒక తరానికి.. మరో తరానికి మధ్య ఎన్నో తేడాలు ఉంటాయి. జనరేషన్ల మధ్య యువత జీవన విధానం, అలవాట్లు, వస్తువులు.. ఇలా ఎన్నో మార్పులు చోటుచేసుకుంటాయి. అలానే గత తరం, ప్రస్తుత తరం యువతకు చాలా బేధాలు ఉన్నాయి. ముఖ్యంగా 50 ఏళ్ల కాలంలో ప్రపంచం ఎవరూ ఊహించనంతగా మారింది. సాంస్కృతిక, టెక్నాలజీ, రాజకీయ, ఆర్థిక విభాగాలతో పాటు ఎన్నో రంగాల్లో వినూత్న మార్పులు వచ్చాయి. నేడు అంతర్జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా తరాల మధ్య యువతతో వచ్చిన ముఖ్యమైన మార్పులేంటో చూసేయండి..

1981-1996 మధ్య జన్మించిన వారిని మిలీనియల్స్​గా పిలుస్తుంటే.. ఇదే విభాగానికి చెంది 1997-2012 మధ్య పుట్టిన వారిని ప్రస్తుతం జెన్ జెడ్​గా (జెనరేషన్-జెడ్‌) పేర్కొంటున్నారు. అయితే ఈ రెండు విభాగాల వారిని కలిపి మిలీనియల్స్​గానే పరిగణిస్తున్నారు. గత తరం యువతతో పోలిస్తే ఈ మిలీనియల్స్ యువతీ, యువకుల జీవన విధానంలో చాలా తేడాలు ఉన్నాయి. ఎన్నో విషయాల్లో మార్పులు వచ్చాయి.

విద్యలో మిలీనియల్స్‌ భేష్

గత తరంతో పోలిస్తే మిలీనియల్స్‌ యువత చదువులో ముందుందని నివేదికలు చెబుతున్నాయి. గత జనరేషన్​ యూత్​తో పోలిస్తే.. ఈ తరం యువత.. చదువుతో పాటు ఆ తర్వాత బాగా సంపాదిస్తోందని పీ రీసెర్చ్ సెంటర్ తన అధ్యయనంలో చెప్పింది. అలాగే గత తరంతో పోలిస్తే మిలీనియల్స్‌ అమ్మాయిల్లో ప్రస్తుతం ఉన్నత చదువులు పెరిగాయని, గ్రాడ్యుయేట్ల సంఖ్య గణనీయంగా పెరిగిందని పేర్కొంది.

ఆస్తుల్లో పాత తరమే ఎక్కువ

యువతగా ఉన్నప్పుడు గత తరం వారికే ఎక్కువగా ఆస్తులు ఉండేవని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. వారితో పోలిస్తే ప్రస్తుత తరం వారికి యువ వయసుల్లో ఉన్నప్పుడు ఆస్తులు ఆ స్థాయిలో లేవని స్పష్టం చేస్తున్నాయి. దీంతో ఆర్థికంగా కూడా వేగంగా ఎదగలేకపోతున్నారని పేర్కొంటున్నాయి.

పెళ్లికి ఆలస్యం..

తమ సీనియర్లతో పోలిస్తే ప్రస్తుత తరంలో యువతీ, యువకులకు ఆలస్యంగా పెళ్లిళ్లు అవుతున్నాయి. 27 ఏళ్ల వయసు నిండే వరకు చాలా మంది వివాహం గురించి ఆలోచించడం లేదు. ఎక్కువగా జీవితంలో స్థిరపడే ఆలోచన చేస్తూ వివాహాన్ని వాయిదా వేస్తున్నారు. ముఖ్యంగా గత తరంతో పోలిస్తే 30 ఏళ్ల వయసు తర్వాత వివాహం చేసుకునే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది.

టెక్నాలజీలో ఎక్కడి నుంచి ఎక్కడికో..

పాత తరంతో పోలిస్తే ఇప్పుడు టెక్నాలజీ ఎంతో అభివృద్ధి చెందింది. పాత తరం యువతకు ఎక్కువగా ల్యాండ్​లైన్ ఫోన్లు ఉండగా.. కంప్యూటర్లు అంతంత మాత్రమే. అయితే ప్రస్తుత తరం యువతీ, యువకులు అధికంగా స్మార్ట్​ఫోన్లు, కంప్యూటర్లు, ల్యాప్​టాప్​లతో పాటు అధునాతన గాడ్జెట్లను వాడుతున్నారు. ముఖ్యంగా మిలీనియల్స్‌లోనే జెన్ జెడ్ యువత మరింత ముందుంది. మిలీనియల్స్‌ ల్యాండ్​లైన్ ఫోన్లతో పాటు మరికొన్ని పాత టెక్నాలజీలు చూడగా.. ఈ జెడ్ జెన్ యువత మాత్రం స్మార్ట్​ఫోన్లు సహా మొత్తం అధునాతన టెక్నాలజీనే అనుభవిస్తోంది.
Published by:Shiva Kumar Addula
First published:

Tags: Life Style, Lifestyle, Youth

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు