Home /News /life-style /

INTERNATIONAL YOGA DAY ON JUNE 21 YOGA ASANAS TO CURB STRESS DEPRESSION AND ANXIETY MK GH

Yoga for depression: ఈ ఆసనాలు వేయండి.. ఒత్తిడిని దూరం చేసుకోండి

ప్రతీకాత్మకచిత్రం

ప్రతీకాత్మకచిత్రం

ఓ అధ్యయనం ప్రకారం ఒత్తిడిని తగ్గించడానికి, ఆందోళనను నియంత్రించడానికి కొన్ని యోగాసనాలు సహాయపడతాయి. అవేంటో చూద్దాం.

ఈ రోజు (జూన్ 21) విశ్వవ్యాప్తంగా అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. యోగా ప్రాముఖ్యతను, ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపడానికి ఎలా సహాయపడుతుందో ఈ రోజు గమనించవచ్చు. యోగా ప్రయోజనాల గురించి అవగాహన పెంచడానికి ఈ రోజు అవగాహన కల్పిస్తారు. ఈ ఏడాది అంతర్జాతీయ యోగా దినోత్సవానికి "శ్రేయస్సు కోసం యోగా" (Yoga for well Being) అనే థీమ్‌ను నిర్ణయించారు. కరోనా మహమ్మారి ప్రజలను శారీరకంగానే కాకుండా మానసికంగానూ ప్రభావితం చేసింది. దీంతో ఈ ఏడాది ఈ థీమ్‌ను నిర్దేశించారు. మహమ్మారి కారణంగా ప్రస్తుతం ప్రజలు నిరాశ, ఆందోళన వంటి మానసిక ఆరోగ్య సమస్యతో బాధపడుతున్నారు. మరోవైపు ఇలాంటి సంక్షోభాలను ఎదుర్కోవడానికి ప్రజలకు యోగా సహాయపడుతుంది.

"ప్రపంచవ్యాప్తంగా ప్రజల్లో ఆరోగ్యంపై చైతన్యం నింపడానికి, సామాజిక ఒంటరితనం, నిరాశతో పోరాడటంలో పెరుగుతున్న ధోరణి మహమ్మారి సమయంలో కనిపించింది. ఐసోలేషన్, డిప్రెషన్, సామాజిక సంరక్షణ, పునరావసంలో కూడా యోగా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. వారి భయాలు, ఆందోళనలను తొలగించడంలో ఇది ప్రత్యేకంగా సహాయపడుతుంది" అని ఐక్యరాజ్యసమితి ప్రకటనలో పేర్కొంది. ఓ అధ్యయనం ప్రకారం ఒత్తిడిని తగ్గించడానికి, ఆందోళనను నియంత్రించడానికి కొన్ని యోగాసనాలు సహాయపడతాయి. అవేంటో చూద్దాం.

 ఉస్తరాసనం లేదా క్యామెల్ ఫోజ్
ఈ ఆసనం ఒత్తిడిని తగ్గిస్తుంది. రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది. మెరుగైన రక్తప్రసరణ వల్ల మీ మనస్సుకు ప్రశాంతత చేకూరుతుంది. దీంతో పాటు శరీరానికి తగినంత ఆక్సిజన్ సరఫరా అవుతుంది.

సేతు బంధాసనం లేదా బ్రిడ్జ్ ఫోజ్
సేతు బంధాసనం వేయడం ద్వారా శరీరంలో రక్తప్రసరణ వ్యవస్థ మెరుగుపడుతుంది. ఇది వెన్నెముక, గుండె ఆరోగ్యానికి మేలు చేకూరుస్తుంది. ఫలితంగా మీ మనస్సు శాంతపడుతుంది. అంతేకాకుండా ఒత్తిడి స్థాయిలను కూడా ఈ ఆసనం తగ్గిస్తుంది.

బటర్ ఫ్లై భంగిమ..
ఈ ఆసనం మీ తొడలు, గజ్జలు సాగదీయడానికి సహాయపడుతుంది. ఫలితంగా మీరు మానసిక ప్రశాంతత పొందవచ్చు. అంతేకాకుండా మీ ఒత్తిడి స్థాయిలు తగ్గుతాయి.

బితిలాసనం, మార్జాలాసనం
మార్జాలాసనం (క్యాట్ పోజ్), బితిలాసనం (కౌ పోజ్)లను కలిపి శరీరాన్ని సాగదీయడం ద్వారా ఒత్తిడి తగ్గుతుంది. దీంతోపాటు వెన్నెముక, కడుపు అవయావాలకు మసాజ్ చేయడానికి వార్మప్ గా ఉపయోగపడుతుంది. ఈ యోగాసనాలు చేయడం ద్వారా మీలో ఫ్లెక్సిబిలిటీ లేదా సాగే గుణం పెరుగుతుంది. ఇది మీ మనస్సును శాంతపరుస్తుంది.

బాలాసనం..
ఈ భంగిమ వేయడం వల్ల చాలా రిలాక్స్ గా ఉంటుంది. ఇది మీలో ఉత్సాహం నింపడానికి సహాయపడుతుంది. వెన్నునొప్పి, మెడనొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
Published by:Krishna Adithya
First published:

Tags: Yoga day, Yoga day 2021

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు