యోగా అత్యంత పురాతనమైన విధానం. శరీరం, మనస్సుపై పనిచేసే శక్తిమంతమైన అభ్యాసం. శారీరక ఆరోగ్యంతో పాటు భావోద్వేగ వ్యక్తిత్వాన్ని కూడా యోగా మెరుగుపరుస్తుంది. అయితే యోగా అనేది సంక్లిష్టమైన భంగిమలని ఓ అపోహ ఉంది. మహమ్మారిపై పోరులో రోగనిరోధక శక్తి కీలక పాత్ర పోషిస్తుంది. అయితే ఈ ఇమ్యునిటీని పెంచుకోవడంలో యోగా బాగా పనిచేస్తుంది. ఒత్తిడిని తగ్గించడం, నిరాశను దూరం చేయడంతో పాటు కోవిడ్ రికవరీలోనూ యోగా చాలా సాయపడుతుంది. ఈ నేపథ్యంలో రోగనిరోధక శక్తిని పెంచేందుకు తోడ్పడే కొన్ని యోగాసనాలు ఉన్నాయి. కరోనా బారిన పడి కోలుకున్న వారు ఈ ఆసనాలు వేయడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
* ప్రాణాయామం, ఉఛ్వాసం-నిశ్వాస ప్రక్రియ..
ప్రాణాయామం అంటే శ్వాసను లోతుగా తీసుకోవడమని చాలా మంది తప్పుగా భావిస్తారు. ప్రాణాయమంలో నెమ్మదిగా ఉపిరి తీసుకోవాలి. తద్వారా ఊపిరితిత్తుల్లో ప్రతి భాగం ఆక్సిజన్‌ను గ్రహించడానికి తగిన సమయం ఉంటుంది. ఇది శరీరానికి శక్తినివ్వడానికి సహాయపడుతుంది. ఉఛ్వాస-నిశ్వాస అనేది ఓ నియంత్రిత శ్వాస. ఊపిరి పీల్చేటప్పుడు ఓ నాసికా రంధ్రం మూసివేయాలి. అనంతరం శ్వాసించేటప్పుడు మరో నాసికారంధ్రం మూసివేయాలి. ఈ విధంగా చేయడం ద్వారా రక్తప్రసరణతో సహా శారీరక, మానసిక ప్రయోజనాలు ఉన్నాయని చెబుతారు.
* స్టాఫ్ ఆసనం (Staff Pose)..
ఈ సాధారణ ఆసనం భుజాలు, ఛాతీని సాగదీయడానికి సహాయపడుతుంది. వెనుక కండరాలను బలపరుస్తుంది. మీ కాళ్లు ముందు వరకు విస్తరించి నేలపై కూర్చొండి. మీ వెనుకభాగాన్ని నిటారుగా ఉంచి మీ కటిని కొద్ది ఎత్తులో ఉంచండి. అవసరమైతే ఇందుకు దుప్పటిని ఉపయోగించవచ్చు. వెన్నును నిటారుగా ఉంచడంలో ఇబ్బందులు ఎదుర్కొంటుంటే గోడకు ఆనుకొని విశ్రాంతి తీసుకోవచ్చు. ఈ ఆసనంలో మీ భుజాలు గోడను తాకాలి. వెనుక భాగం, తల మాత్రం గోడను తాకకూడదు. ఫ్యూబిస్, టెయిల్ బోన్.. నేలకు సమాంతరంగా ఉండాలి. తొడలను దృఢంగా ఉంచి బొడ్డుపై బలం పడకుండా నేలపై నొక్కి ఉంచాలి. ఈ విధంగా 2-3 నిమిషాల పాటు ఉండాలి.
* భుజంగాసనం (Cobra Pose)..
దీన్నేకోబ్రా పోజ్ అని కూడా అంటారు. ఛాతీ కండరాలను తెరవడానికి రూపొందించిన ఈ ఆసనాన్ని, అనుభవం లేని వారు కూడా ప్రయత్నించవచ్చు. ఇది ఉబ్బసం నుంచి ఉపశమనం కలిగించడమే కాకుండా మనస్సును శాంతపరుస్తుంది. అంతేకాకుండా ఆనందం, అనుభూతిని తీసుకొస్తుంది.
ఇది చదవండి: Asanas for weight loss: సులభంగా బరువు తగ్గాలనుకుంటున్నారా.. ఈ యోగాసనాలు ప్రయత్నించండి..
* బట్టర్ ఫ్లై పోజ్..
ఈ భంగిమ.. తొడ కండరాలు, గజ్జలు. మోకాళ్లను సాగదీయడానికి ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ఫ్లెక్సిబిలిటీని మెరుగుపరుస్తుంది. ఎక్కువ సేపు నిల్చోవడం, నడవడం వల్ల ఎదురయ్యే అలసటను తగ్గించడానికి సహాయపడుతుంది. ఈ ఆసనం కోసం ముందు మోకాళ్లను వంచి కూర్చొవాలి. మీ పాదాలను కటి వైపునకు తీసుకువచ్చి అనంతరం పాదాల అరికాళ్లు ఒకదానికొకటి తాకనివ్వాలి. మీ చేతులతో మీ పాదాలను గట్టిగా పట్టుకోండి. అనంతరం లోతైన శ్వాస తీసుకోండి. మీ తొడలు, మోకాళ్లను నేల వైపునకు కిందకు నొక్కండి. సీతాకోకచిలుక (బటర్ ఫ్లై) రెక్కల వలే రెండు తొడలను పైకి కిందకు తిప్పడం ప్రారంభించండి.
* బితిల మర్జాలాసనం (Cat-cow Pose)..
ఇది రెండు ఆసనాల కలయిక. శరీరాన్ని శాంతంగా సాగదీయడానికి, వార్మప్ చేయడానికి ఈ ఆసనం సహాయపడుతుంది. ముందుగా పోట్టను పూర్తిగా లోపలికి ఉంచి ఊపిరి తీసుకోవాలి. రెండు చేతులు, కాళ్లను మ్యాట్ పై ఉంచి గడ్డాన్ని, ఛాతీని పైకి లేపి ఆవు మాదిరిగా భంగిమ ఉంచాలి. ఈ క్రమంలో సీలింగ్ వైపు తల పెట్టాలి. తర్వాత క్యాట్ పోజ్ లో పిల్లి తన వీపును విస్తరించినట్లే.. మీ పొట్ట భాగాన్ని వెన్నెముక వైపు నెట్టాలి. వీపు భాగాన్ని పైకి ఉంచి తలను కిందకు వంచాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Covid-19, Immunity, Yoga day, Yoga day 2021