Home /News /life-style /

INTERNATIONAL YOGA DAY 2021 EASY YOGA POSES FOR WEIGHT LOSS KNOW EVERYTHING SU GH

Asanas for weight loss: సులభంగా బరువు తగ్గాలనుకుంటున్నారా.. ఈ యోగాసనాలు ప్రయత్నించండి..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

సులభంగా బరువు తగ్గాలనుకునే వారికి యోగా వల్ల మంచి ఫలితాలుంటాయి.

గత కొన్ని నెలలుగా కరోనా లాక్‌డౌన్ కారణంగా చాలా మంది ఇళ్లకే పరిమతిమయ్యారు. ఉద్యోగులు కూడా ఇంటి వద్ద నుంచే పని చేయడం ప్రారంభించారు. ఫలితంగా శారీరక శ్రమ లేకపోవడం వల్ల చాలా మంది బరువు పెరిగారు. ఇది ఊబకాయానికి దారితీసే ప్రమాదముంది. బరువును తగ్గించడం అంత తేలికైన విషయం కాదు. సులభంగా బరువు తగ్గాలనుకునే వారికి యోగా వల్ల మంచి ఫలితాలుంటాయి. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా యోగా బాగా ప్రాచుర్యం పొందింది. సమతుల్యత, బలం, ఓర్పు, ఏరోబిక్ సామర్థ్యాన్ని మెరుగుపరచడంలో ఇది సహాయపడుతుంది. అంతేకాకుండా జ్ఞాపకశక్తిని, ఆత్మగౌరవాన్ని పెంపొందించడంలో సహాయపడుతుంది. ఆందోళన, ఒత్తిడిని కూడా తగ్గిస్తుంది. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఇక్కడ కొన్ని ఉపయోగకరమైన యోగాసనాలు ఉన్నాయి. ఇవి బరువును తగ్గించడంలో సహాయపడతాయి. ఈ ఆసనాల గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం.

* ఉత్కాటాసనం..
ఈ ఆసనం వేయడం ద్వారా తొడ కండరాల నోప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు. అంతేకాకుండా క్రమమైన రీతిని తెచ్చుకోవచ్చు. క్రమం తప్పకుండా ఈ ఆసనం వేయడం ద్వారా కండరాలు కూడా బలపడతాయి.

* వీరభద్రాసనం..
ఈ ఆనసనం ఛాతీ, ఊపితిత్తులు, భుజాలు, మెడ, కడుపు, గజ్జలను సాగదీస్తుంది. ఇది భుజాలు, చేతులు, వెనుక వైపు ఉండే కండరాలను కూడా బలపరుస్తుంది. తొడలు, చీలమండలను బలపరుస్తుంది. ఈ ఆసనం సయాటికాకు మంచి చికిత్స.

* నటరాజసనం..
ఇది తుంటిపై బాగా పనిచేస్తుంది. ఈ ఆసనం మంచి శరీరాకృతిని ఇస్తుంది. తోడల బాహ్య, అంతర్గత కండరాలను బలపరుస్తుంది. కటి నుంచి కాలి వరకు ఉన్న ప్రాంతంపై ఆసనం ప్రభావం పడుతుంది. ఈ ఆసనం ద్వారా భుజం, ఛాతీ, తొడలు, ఉదరం, కాళ్లకు మంచి ఫ్లెక్సిబిలిటీని అందిస్తుంది.

* నవాసనం..
ఇది చాలా సరళమైన ఆసనం. ఇది మీ ప్యాక్స్, లోపలి తొడలకు మంచి ఆకారాన్నిస్తాయి. ఇది చేయడానికి మీ చేతులతో కాలిని పట్టుకోవడానికి ప్రయత్నించండి. ఫలితంగా గరిష్ఠ ప్రయోజనాలు పొందడానికి వీలైనంత ఎక్కువ సేపు ఉండేందుకు ప్రయత్నించండి.

* శాలభాసనం..
ఇది మీ వెనుక పిరుదులు, తుంటిపై బాగా పనిచేస్తుంది. దీన్ని చేయడానికి మీరు మీ కడుపుపై పడుకొని చేతులను తొడల కింద ఉంచండి. కాళ్లు వంగకుండా చూడాలి. వీలైనంత ఎక్కువ సమయం ఈ భంగిమలో ఉండండి. నెమ్మదిగా కాళ్లను కిందకు దించి మొదటి స్థానానికి తిరిగి చేర్చండి.

* పూర్వోత్తరాసనం..
ఇది మీ బాహ్య తొడలపై బాగా పనిచేస్తుంది. మీ చేతులను బలోపేతం చేయడానికి, టోన్ చేయడానికి ఈ ఆసనం సహాయపడుతుంది. ఈ భంగిమలో మీరు మీ కాళ్లు, చేతులపై మీ శరీర బలాన్ని పెంచినప్పుడు హామ్ స్ట్రింగ్స్, గ్లూట్స్ పై పనిచేస్తుంది.
Published by:Sumanth Kanukula
First published:

Tags: Weight loss, Yoga day, Yoga day 2021

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు