Home /News /life-style /

INTERNATIONAL YOGA DAY 2020 THERE ARE THE BEST MOBILE APPS TO LEARN YOGA AT HOME BA

International Yoga Day 2021 | ఇంట్లోనే యోగా నేర్చుకోవడానికి బెస్ట్ యాప్స్...

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Yoga Day 2021 | యోగాచేయాలంటే కచ్చితంగా క్లాసులకి వెళ్లాలి. సమయం లేదు. అంటూ సమాధానాలు కాకుండా.. ఇంట్లోనే ఏంచక్కా యోగాచేయొచ్చు.

    యోగాని జీవితంలో భాగంచేసుకుంటే ఎలాంటి అనారోగ్య సమస్యలు మనదరికి రావు. సాఫీగా లైఫ్ సాగిపోతుంది. అయితే, యోగాచేయాలంటే కచ్చితంగా క్లాసులకి వెళ్లాలి. సమయం లేదు. అంటూ సమాధానాలు కాకుండా.. ఇంట్లోనే ఏంచక్కా యోగాచేయొచ్చు. అందుకోసం మనకి ఉపయోగపడే కొన్ని యాప్స్ కూడా ఉన్నాయి. అవే ఇప్పుడు చూద్దాం..

    బ్రీత్ యాప్ : యోగా చేసే ముందు శ్వాస తీసుకుని, వదలడం చేస్తుండాలి. ఇలా చేయడం వల్ల ఆసనాల్లో ఎక్కువ సేపు ఉండగలుగుతాం..అందుకోసం ఈ బ్రీత్ యాప్ ఉపయోగపడుతుంది. ఇందులో.. శ్వాస ఎంతసేపు తీసుకోవాలి. అనేవి స్పష్టంగా ఉంటాయి. అంతేనా.. రోజూ మనం అనుకున్న సమయానికి యోగా చేయొచ్చని ఈ యాప్ సూచిస్తుంది.
    యోగా గో యాప్.. ఈ యాప్‌లో ఫిట్‌నెస్‌తో పాటు అధిక బరువు నియంత్రించుకోవడానికి నియమాలు కూడా ఉంటాయి. ఏడు నిమిషాల నుంచి మొలై 30 నిమిషాల వరకు యోగా చేసేలా ఉంటుంది.
    5 మినిట్.. సమయం తక్కువగా ఉన్నప్పుడు కేవలం ఐదు నిమిషాల్లోనే చేసే యోగాసనాల గురించి ఈ యాప్ పూర్తిసమాచారం ఇస్తుంది. ఇందులోని ఆసనాలన్నీ ఆరోగ్యాన్నివ్వడమే కాకుండా శరీరాన్ని చురుగ్గా ఉంచుతాయి.
    పాకెట్ యాప్ : యోగాసనాలు వేయడంలో ఎన్నో సూచనలు ఇచ్చే ఈ యాప్.. ఏ భంగిమ ఎలా వేయాలో.. దాని వల్ల కలిగే లాభాలేంటో సూచిస్తుంది.
    యోగా వేవ్ : ఈ యాప్ అప్పుడే యోగా నేర్చుకునేవారినుంచి నిష్ణాతులైనవారివరకూ అందరికీ చక్కగా ఉపయోగపడుతుంది. ఇందులోని నియమాలుపాటిస్తే శరీరం చక్కగా.. ఫ్లెక్సీబుల్‌గా మారుతుంది.
    సింపుల్ హాబిట్.. ఈ యాప్ మెడిటేషన్‌కి సంబంధించిన అన్ని విషయాలను వివరిస్తుంది. స్ట్రెస్, ఏకాగ్రతను పెంచి నిద్రలేమి సమస్యను దూరం చేస్తుందని చెప్పొచ్చు.
    Published by:Ashok Kumar Bonepalli
    First published:

    Tags: Yoga day 2020, Yoga day 2021

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు