Home /News /life-style /

INTERNATIONAL YOGA DAY 2020 SPECIAL 5 IMPORTANT YOGA ASANAS CHECK HERE DETAILS

Yoga Day 2020 : యోగాలో బెస్ట్ ఆసనాలు ఇవే...మీరూ ట్రై చేయండి

5 ముఖ్య యోగా ఆసనాలు

5 ముఖ్య యోగా ఆసనాలు

International Yoga Day 2020 | యోగా ఆసనాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. నిజానికి యోగా అనేది ఎప్పట్నుంచో మనదేశంలో ఉంది. ఈ ఆసనాల గొప్పదనం తెలిసే చాలామంది విదేశీయులు సైతం వీటిని పాటిస్తున్నారు. అందులో కొన్ని ముఖ్య ఆసనాలు.. వాటి వల్ల లాభాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

ఇంకా చదవండి ...
    హిందూత్వ ఆధ్యాత్మిక సాధనలలో ఒక భాగమే యోగా. యోగా ఆసనాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. నిజానికి యోగా అనేది ఎప్పట్నుంచో మనదేశంలో ఉంది. ఈ ఆసనాల గొప్పదనం తెలిసే చాలామంది విదేశీయులు సైతం వీటిని పాటిస్తున్నారు. అందులో కొన్ని ముఖ్య ఆసనాలు... వాటి వల్ల లాభాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

    ధనురాసనం : బోర్లా పడుకుని కాళ్లని వెడల్పు పెట్టి.. మోకాళ్ల భాగం నుంచి వెనక్కి వంచి చేతులతో పాదాలను పట్టుకోవాలి. తలని పైకి చూస్తూ ఇదే స్థితిలో కాసేపు ఉండాలి. దీనివల్ల నడుము, మెడనొప్పులు తగ్గుతాయి. బరువు తగ్గి నడుము సన్నగా మారుతుంది. హెర్నియా ఉన్నవారు ఈ ఆసనం వేయొద్దు.

    చక్రాసనం : వెల్లకిలా పడుకుని నడుమును పైకి లేపాలి. బరువు మొత్తం కాళ్లు, చేతులపై మోయాలి. ఈ స్థితిలో ఉండగలిగినంత సేపు ఉండాలి. దీని వల్ల వెన్నెముక, ఊపిరితిత్తులు, కాళ్లు,  చేతులకు చాలా ఉపయోగం. పొట్ట, కొవ్వు  తగ్గి  జీర్ణశక్తి  మెరుగవుతుంది. మలబద్ధకం దూరమవుతుంది.

    సర్పాసనం : బోర్లా పడుకుని రెండు చేతులనూ నడుము కింది భాగంలో పట్టుకుని తలభాగాన్ని పైకి లేపాలి. ఇలా చేయడం వల్ల నడుము, ఊపిరితిత్తులు, వెన్నుపూసకి మంచిది.

    నౌకాసనం : వెల్లకిలా పడుకుని కాళ్లను, చేతలను చాపి ముందుగా మోకాళ్లు వంచకుండా కాళ్లను ఓ అడుగు ఎత్తుతో లేపాలి. ఇప్పుడు చేతులు కూడా పైకి లేపి నడుము భాగంపైనే శరీరాన్ని ఉంచాలి. ఈ ఆసనం వేయడం వల్ల పొట్ట, కొవ్వు పూర్తిగా తగ్గిపోతుంది. అజీర్ణ సమస్యలు దూరమవుతాయి.

    ఉత్తాన పాదాసనం  : వెల్లకిలా పడుకుని రెండుకాళ్లనూ దగ్గరగా జరిపి రెండు పాదాలను ముందుకు చాపి చేతివేళ్లను తలకింద పెట్టుకోవాలి. ఇప్పుడు మోకాళ్లు వంచకుండా నేల నుంచి ఓ అడుగు భాగం ఎత్తులేపాలి. కళ్లు మూసుకుని ఉండాలి. దీనివల్ల పొత్తికడుపు పొట్ట త్వరగా తగ్గుతుంది. ప్రసవం అయిన స్త్రీలకు ఈ ఆసనం చాలామేలు చేస్తుంది.
    Published by:Janardhan V
    First published:

    Tags: Health, Health Tips, Yoga, Yoga day 2020

    తదుపరి వార్తలు