హోమ్ /వార్తలు /లైఫ్ స్టైల్ /

International Tea Day 2020: బ్లాక్ టీతో మీకు కలిగే అద్భుత ప్రయోజనాలు

International Tea Day 2020: బ్లాక్ టీతో మీకు కలిగే అద్భుత ప్రయోజనాలు

బ్లాక్ టీతో మీకు కలిగే అద్భుత ప్రయోజనాలు

బ్లాక్ టీతో మీకు కలిగే అద్భుత ప్రయోజనాలు

International Tea Day 2020: చాలా మంది కాఫీ తాగే బదులు... బ్లాక్ టీ తాగితే ఎక్కువ ప్రయోజనాలుంటాయి. శరీరానికి బయట, లోపల కూడా బెనెఫిట్స్ కలుగుతాయి. అవేంటో తెలుసుకుందాం.

Black Tea: మన దేశంలో టీ అంటే ఇష్టపడని వారు చాలా తక్కువ మంది ఉంటారు. ఏదైనా వర్క్ చేసి బ్రెయిన్‌కి పని పెడితే... కాస్త రిలాక్స్ కోసం టీ లేదా కాఫీ తాగేస్తాం. ఐతే... మనకు రెగ్యులర్ టీలు, కాఫీలు మాత్రమే ఎక్కువగా అలవాటు ఉంటాయి. ఈ రోజుల్లో డాక్టర్ల సలహాల వల్ల చాలా మంది గ్రీన్ టీ, తులసి ఆకుల టీ, లెమన్ టీ, ఆరెంజ్ టీ, గ్రీన్ కాఫీ, మాచా టీ వంటివి కూడా తాగుతున్నారు. ఐతే... వీటితోపాటూ... రెగ్యులర్‌గా బ్లాక్ టీ కూడా తాగాలని సూచిస్తున్నారు ఆరోగ్య నిపుణులు. ఎందుకంటే... బ్లాక్ టీలో ఉండే కొన్ని ప్రత్యేక గుణాలు గ్రీన్ టీ, లెమన్ టీ, కాఫీ వంటి వాటిలో ఉండవు. అందుకే మనం ఇప్పుడు బ్లాక్ టీ ప్రయోజనాల్ని చకచకా తెలుసుకుందాం.

1.గాయాలకు మందు : గాయాల నుంచీ కాపాడేందుకు, రక్తం కారిపోవడాన్ని ఆపేందుకు, గాయాల మంట తగ్గేందుకు బ్లాక్ టీ ఉపయోగపడుతుంది. బ్లాక్ టీ తాగిన తర్వాత... టీ బ్యాగ్‌ని పారేయకుండా... గాయం దగ్గర దానితో టచ్ చేస్తే... రిలీఫ్ ఫీల్ కలుగుతుంది. బ్లాక్ టీ తాగుతున్నా గాయాలు తగ్గకపోతే, వెంటనే డాక్టర్‌ని సంప్రదించడం బెటర్.

2. నోటి చిగుళ్లకు రక్షణ : మీకు చిగుళ్ల సమస్య, దంతాల సమస్య ఉంటే... మీరు తడి బ్లాక్ టీ బ్యాగ్‌ను ఆ ప్రదేశంలో పెట్టి... కొద్దిగా నొక్కండి. బ్లాక్ టీలోని టాన్నిక్ యాసిడ్స్ చిగుళ్లకు మేలు చేస్తాయి. బ్లాక్ టీని మౌత్ వాష్‌గా కూడా వాడొచ్చు. సమస్య చాలా తీవ్రంగా ఉంటే మాత్రం డాక్టర్‌ని కలవడం బెటర్.

3. వ్యాధినిరోధక శక్తి : మీరు రోజూ ఉదయాన్నే 5 నిమిషాలపాటూ... బ్లాక్ టీ తాగారంటే... మీకు కలిగే ఆరోగ్య ప్రయోజనాల్ని కొన్ని రోజుల్లోనే గ్రహిస్తారు. మంచి నాణ్యమైన బ్లాక్ టీ బ్యాగులను వాడితే... ఎక్కువ ప్రయోజనాలు కలుగుతాయి. మీ శరీరంలో మంచి ఆరోగ్యకర మార్పులు చాలా వస్తాయి.

4. కళ్లకు హాయి : కొంతమందికి మాటిమాటికీ కళ్లు మండుతూ ఉంటాయి. దురద పెడతాయి. వాళ్లు బ్లాక్ టీ ప్రయోజనాలు పొందొచ్చు. రెండు బ్లాక్ టీ బ్యాగులను పది నిమిషాలపాటూ గోరువెచ్చటి నీటిలో ఉంచాలి. ఇప్పుడు బ్యాగుల్లో అదనంగా ఉన్న నీటిని తొలగించాలి. ఇప్పుడు ఆ బ్యాగుల్ని కళ్లపై 10 నిమిషాలు పెట్టుకోవాలి. అంతే కళ్లు చల్లగా అయిపోతాయి.

5. కురుపులకు మందు : కొన్నిసార్లు గాయాలు వెంటనే తగ్గకుండా... ఇబ్బంది పెడతాయి. అలాంటి వాళ్లు... చల్లటి బ్లాక్ టీ బ్యాగ్‌ను గాయం ఉన్నచోట పెట్టుకోవాలి. ఓ 10 నిమిషాలు అలా ఉంచితే... బ్లాక్ టీలోని బ్యాక్టీరియాను చంపే గుణాలు... కురుపులను తగ్గిస్తాయి.

6. అలెర్జీలకు చెక్ : కొంతమందికి కాలాలు (వానాకాలం, ఎండాకాలం, చలికాలం) మారగానే అలెర్జీలు వస్తుంటాయి. అలాంటి వాళ్లు రోజుకు రెండు, మూడు బ్లాక్ టీలను తాగాలి. దాంతో అలెర్జీలకు చెక్ పెట్టినట్లవుతుంది.

7. మంటలకు మేలు : కొంతమందికి శరీరంపై మంటలు, దురదలు, వాపుల వంటివి వస్తుంటాయి. అలాంటి వారు... ఓ ఐదు టీ బ్యాగులలను బాత్ టబ్‌లో వెయ్యాలి. కాసేపు వాటిని అటూ ఇటూ కదపాలి. ఆ తర్వాత వాటిని తీసేసి... ఆ టబ్‌ నీటిలో స్నానం చెయ్యాలి. దాంతో... మంటలు, దురదల వంటివి మటుమాయం అవుతాయి.

8. కంజెక్టివిటీస్‌కి మేలు : కొంత మందికి రకరకాల అనారోగ్యాల వల్ల కళ్ల రంగు మారుతుంది. ఎరుపు రంగు, బ్లూ కలర్, గ్రీన్ కలర్ ఇలా కళ్లు రకరకాలుగా మారతాయి. అలాంటి వాళ్లు చల్లటి బ్లాక్ టీ బ్యాగ్‌ని కళ్లపై 5 నిమిషాలు ఉంచాలి. ఇలా... రోజూ కొన్నిసార్లు చేస్తూ ఉంటే... ఫలితం ఉంటుంది.

9. డయేరియాకు చెక్ : పేగుల్లో వ్యర్థాలపై బ్లాక్ టీ యుద్ధం చేస్తుంది. ఫలితంగా పేగుల్లో మంట, నొప్పి వంటివి తగ్గుతాయి. ఇందుకోసం బ్లాక్ టీలో తేనె కలుపుకొని తాగితే, డయేరియా (విరేచనాలు) తగ్గుతుంది.

10. నీటి కురుపులకు చెక్ : నీటి కురుపులు అనేవి ముఖం, మెడ, భుజాలు, చంకలు ఇలా రకరకాల ప్రాంతాల్లో వస్తుంటాయి. ఇవి మంట పుడుతూ ఉంటాయి. అలాంటి వాటిపై గోరు వెచ్చటి బ్లాక్ టీ బ్యాగ్‌తో అద్దితే... చాలా ప్రయోజనాలుంటాయి. 15 నిమిషాల చొప్పున రోజుకు ఐదుసార్లు ఇలా చేస్తే ఫలితం ఉంటుంది.

11. కాళ్ల వాసనలకు చెక్ : వర్షాకాలంలో మనం వాడే షూస్, స్లిప్పర్స్... ఏవైనా సరే... మన కాళ్లకు ఒక రకమైన చెడు వాసన వచ్చేలా చేస్తాయి. కొంతమందికి చిన్న సైజు నీటి కురుపులు కూడా వస్తాయి. అలాంటి వారికి బ్లాక్ టీ ఎంతో మేలు. ఎందుకంటే ఇందులో బ్యాక్టీరియా అంతుచూసే టాన్నిక్ యాసిడ్ ఉంటుంది. అది కాళ్లకు ఎక్కువ చెమట పట్టకుండా చేస్తుంది. ఏం చెయ్యాలంటే... రెండు బ్యాగుల బ్లాక్ టీ పౌడర్‌ను 15 నిమిషాలపాటూ ఉడికించాలి. బ్లాక్ టీ బ్యాగుల్ని తొలగించాలి. అందులో కొంత మరికొంత నీరు పొయ్యాలి. ఆ మిశ్రమం చల్లబడినతర్వాత... కాళ్లను అందులు 15 నుంచీ 30 నిమిషాలు ఉంచాలి. ఇలా రెగ్యులర్‌గా చేస్తుంటే... పాదాలు హాయిగా ఉంటాయి.

12. పైల్స్ సమస్యకు చెక్ : పైల్స్ సమస్య ఉన్నవారు... గోరు వెచ్చటి, తడి బ్లాక్ టీ బ్యాగ్‌ని... పైల్స్ నొప్పి ఉన్న ప్రాంతంలో ఉంచితే... ఉపశమనం కలుగుతుంది. పైగా బ్లాక్ టీలోని టాన్నిక్ యాసిడ్... ఎంతో మేలు చేస్తుంది. అలాగే... బ్లీడింగ్‌ను ఆపుతుంది.

First published:

Tags: Health benifits, Health Tips, Life Style, Tips For Women

ఉత్తమ కథలు