Explainer-Covid-19 pandemic: షాకింగ్ నిజాలు వెలుగులోకి.. గర్భిణీలపై కరోనా మహమ్మారి ప్రభావం ఏ రేంజ్ లో ఉందంటే..

ప్రతీకాత్మక చిత్రం

కరోనా మహమ్మారి విజృంభించిన సమయంలో అన్ని వర్గాల వారు ఇబ్బందులను ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. అయితే గర్భిణులపై ప్రభావం గురించి తాజాగా జరిగిన ఓ సర్వేలో షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి..

  • Share this:
వయసుతో సంబంధం లేకుండా చిన్నా, పెద్దా అందరిపై ప్రభావం చూపింది కరోనా మహమ్మారి. ముఖ్యంగా వృద్ధులపై ఈ ప్రభావం ఎక్కువగా ఉంది. అయితే గర్భిణీలపై కూడా గణనీయమైన ప్రభావాన్ని చూపిందని తాజా అధ్యయనాల్లో తేలింది. దాదాపు 17 దేశాలకు చెందిన 40 అధ్యయనాలు పరిశీలించగా గర్భిణీలు, శిశువులపై అధిక ప్రభావం పడిందని లాన్సెట్ గ్లోబల్ హెల్త్ లో ప్రచురితమైంది. వివిధ దేశాల నివేదికల ప్రకారం కరోనా మహమ్మారి రాకముందు గణాంకాలతో పోలిస్తే ప్రాణం లేకుండా పుట్టే( Stillbirth)శిశువుల సంఖ్య, ప్రసూతి మరణాల రేటు దాదాపు మూడో వంతు పెరిగిందని తేలింది.

ప్రసూతి మరణాలు కూడా వృద్ధి..
గతంతో పోలిస్తే కోవిడ్ తర్వాత కేవలం జీవం లేకుండా పుట్టిన వారి సంఖ్య 25 శాతం పెరిగిందని మొత్తం 40 అధ్యయనాల్లో 12 నివేదికల్లో తేలింది. రెండు నివేదికల్లో ప్రసూతి మరణాలు వృద్ధి చెందాయని తేల్చింది. అందులో ఒకటి భారత్ కాగా.. రెండోది మెక్సికో రిపోర్టు. ఈ రెండు నివేదికల ప్రకారం మూడో వంతు ప్రసూతి మరణాలు పెరిగాయని పేర్కొన్నాయి. గర్భధారణ గురించి మెక్సికో అధ్యయనం ఎక్కువ ప్రాధాన్యమిచ్చింది. తక్కువ, మధ్య ఆదాయ దేశాల్లో ప్రతికూల ఫలితాలు ఎక్కువగా ఉన్నాయని చంఢీఘడ్ లోని పీజీఐఎంఆర్ అసిస్టెంట్ ప్రొఫెసర్(నియోనాటాలజీ) డాక్టర్ జోగేందర్ కుమార్ స్పష్టం చేశారు. పేద దేశాల్లో సాధారణ పరిస్థితుల్లో కూడా ప్రసూతి డెలివరీలను అందించడం సవాలుగా ఉందని, అత్యవసర పరిస్థితుల్లో గౌరవప్రదమైన ప్రసూతి సంరక్షణ ఇంకా కఠినంగా మారిందని తెలిపారు. కోవిడ్-19 ఈ ప్రభావాన్ని బాగా పెంచిందని ఆయన అన్నారు.
ఇది కూడా చదవండి: గర్భవతి అయినప్పటికీ భర్తతో శృంగారంలో పాల్గొన్న భార్య.. కడుపులో బిడ్డ ఎదుగుదలను చూసేందుకు స్కానింగ్ తీస్తే షాకింగ్ రిజల్ట్

గర్భ సంబంధిత సమస్యలతో మరణాలు..
ప్రస్తుతం భారత్ లో కోవిడ్-19 వల్ల ప్రసూతి మరణాలు రేటు 1.3 శాతంగా ఉందని, అందులోనూ కాస్త వయసు పైబడిన తర్వాత గర్భం ధరించే వారిలో ఈ సమస్య ఎక్కువగా ఉందని ఈ అధ్యయనం వెల్లడిస్తోంది. కరోనా వల్ల మరణించే గర్భిణుల సంఖ్య మిగిలినవారిలాగే తక్కువగానే ఉన్నా... లాక్ డౌన్ వల్ల ఆసుపత్రుల్లో కేసులు అధికంగా ఉండడం వల్ల జరిగిన ఆలస్యం కారణంగా గర్భ సబంధిత సమస్యలతో మరణించే వారి సంఖ్య పెరిగిందని అధ్యయనకారులు తెలిపారు.

ఇంకా జన్మించకుండానే కడుపులోనే మరణించిన శిశువుల సంఖ్య(Unborn Deaths)ను ఈ జాబితాలో లెక్కించకపోవడం దరదృష్టకరమని వారు అన్నారు. ఆసుపత్రుల్లో స్టిల్ బర్త్స్ కోసం రిపోర్ట్ వ్యవస్థ ఉన్నప్పటికీ సామాజిక స్థాయిలో లేదని ఆయన స్పష్టం చేశారు. సెకండ్ వేవ్ ఉధృతంగా వ్యాపిస్తోన్న నేపథ్యంలో రోజూ కేసుల సంఖ్య ఎక్కువవుతున్నాయి. ఓ వైపు వ్యాక్సినేషన్ కార్యక్రమం నిరంతరం కొనసాగుతున్నా.. కేసుల పెరుగుదల అందరిలో ఆందోళన కలిగిస్తుంది. ముఖ్యంగా వృద్ధులతో పాటు గర్భిణీలపై ప్రభావం చూపుతున్న కారణంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తగు జాగ్రత్తలు సూచిస్తున్నారు.
First published: