హోమ్ /వార్తలు /లైఫ్ స్టైల్ /

Pregnant Women: షాకింగ్ నిజం.. గర్భం దాల్చే సయమంలో స్త్రీలలో ఈ ఒక్క లక్షణం కనుక ఉంటే.. పుట్టబోయేది ఆడబిడ్డే..!

Pregnant Women: షాకింగ్ నిజం.. గర్భం దాల్చే సయమంలో స్త్రీలలో ఈ ఒక్క లక్షణం కనుక ఉంటే.. పుట్టబోయేది ఆడబిడ్డే..!

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఓ మహిళ గర్భవతి అయితే చాలు. పుట్టబోయేది ఆడబిడ్డా? మగబిడ్డా? అని అటు భర్త కుటుంబంలోనూ, ఇటు పుట్టింటి తరపు వాళ్లు ముచ్చట్లు చెప్పుకుంటుంటారు. అబ్బాయే పుట్టాలని కొందరు, అమ్మాయి పుట్టొచ్చని కొందరు అంటుంటారు. కానీ ఓ సర్వేలో ఓ షాకింగ్ నిజం బయటపడింది.

ఇంకా చదవండి ...

‘‘అబద్ధం చెబితే ఆడపిల్ల పుడుతుంది” అనే మాట వినే ఉంటాం. అయితే, ఇప్పుడు ఈ వార్త విన్నాక మీ అభిప్రాయం మార్చుకుంటారు. ఎందుకంటే, గర్భాధారణ సమయంలో స్త్రీలు ఒత్తిడికి గురైతే ఆడపిల్ల పుడుతుందని ఒక పరిశోధనలో తేలింది. ఆశ్చర్చంగా ఉంది కదూ!.. తాజాగా, స్పెయిన్​లోని గ్రెనడా విశ్వవిద్యాలయం (యుజిఆర్) శాస్త్రవేత్తలు జరిపిన ఒక అధ్యయనంలో ఈ ఆసక్తికర విషయం బయటపడింది. గర్భవతి కావడానికి ముందు, గర్భధారణ సమయంలో అధిక ఒత్తిడిని అనుభవించే స్త్రీలకు అబ్బాయిల కంటే అమ్మాయిలు పుట్టే అవకాశాలు రెండు రెట్లు ఎక్కువని అధ్యయనంలో తేల్చిచెప్పింది. గర్భధారణ సమయంలో గర్భంలోని పిండాలు ఒత్తిడికి గురవుతాయని. తద్వారా, వారి గర్భంలో ఆడపిల్ల అభివృద్ధికి ఇవి కీలక పాత్ర పోషిస్తాయని పరిశోధకులు నిర్ధారించారు.

అధ్యయనం ఇలా జరిగింది..

స్పెయిన్ పరిశోధకులు మొత్తం108 మంది మహిళలపై అధ్యయనం నిర్వహించారు.

గర్భం దాల్చిన మొదటి వారం నుండి డెలివరీ వరకు వారిలో పిండం అభివృద్ధిని గమనించారు.

గర్భధారణకు ముందు, సమయంలో, ఆ తరువాత ఆయా స్త్రీలలో ఒత్తిడి స్థాయిలను నమోదు చేశారు.

పరిశోధనలో భాగంగా వారి జుట్టు శాంపిల్స్ తో వారిలోని కార్టిసాల్​ స్థాయిని కొలిచారు. అంతేకాక, వివిధ మానసిక పరీక్షలను నిర్వహించారు.

కార్టిసాల్​ సహాయంతో గర్భధారణకు ముందు , గర్భాధారణ సమయంలో మహిళల ఒత్తిడి స్థాయిలను నమోదు చేసుకున్నారు.

అనంతరం శిశువు పుట్టుక, లింగానికి సంబంధించిన వివిధ వేరియబుల్స్ నమోదు చేశారు.

ఒత్తిడితో శిశువు లింగంపై ప్రభావం..

కాగా, అధ్యయన ప్రధాన రచయిత మరియా ఇసాబెల్ పెరాల్టా రామెరెజ్ పరిశోధన ఫలితాలపై మాట్లాడుతూ ‘‘గర్భం దాల్చిన సమయంలో స్త్రీలు ఎదుర్కొనే ఒత్తిడి శిశువు లింగాన్ని ప్రభావితం చేయగలదని తగినన్ని శాస్త్రీయ ఆధారాలు లభ్యమయ్యాయి. ఆడపిల్లలకు జన్మనిచ్చిన స్త్రీలలో గర్భాధారణ, ఆ తర్వాత సమయాల్లో జట్టు వెంట్రుకలను పరిశీలించగా వారిలో కార్టిసాల్ స్థాయి అధికంగా నమోదైంది. అదే, మగపిల్లలకు జన్మనిచ్చిన స్త్రీలలోని వెంట్రుకల్లో కార్టిసాల్​ స్థాయి తక్కువగా నమోదైంది. ఈ ఫలితాలు ఆశ్చర్యాన్ని కలిగించాయి.” అని ఆమె వివరించారు. ది గార్డియన్‌లో ప్రచురితమైన ఒక నివేదిక ప్రకారం గర్భధారణ సమయంలో ఒక మహిళ అనుభవించే ఒత్తిడి గర్భం దాల్చిన 17 వారాల ముందుగానే పుట్టబోయే బిడ్డను ప్రభావితం చేస్తుంది. ఆ స్త్రీలలోని ఒత్తిడి పుట్టబోయే బిడ్డ మెదడు అభివృద్ధిపై హానికరమైన ప్రభావాలను కలిగిస్తుంది. పుట్టబోయే పిల్లలు తమ తల్లి ఒత్తిడి హార్మోన్లకు గురవుతున్నారని ఈ అధ్యయనం పేర్కొంది.

Published by:Hasaan Kandula
First published:

Tags: Ayurveda health tips, Best health benefits, Health benifits

ఉత్తమ కథలు